E-Paper
Advertisement

డివోర్స్ మహిళతో రెండో పెళ్లి… మరో మహిళతో సన్నిహితంగా… ఇదేం ఫ్యామిలీ భయ్యా

డివోర్స్ మహిళతో రెండో పెళ్లి… మరో మహిళతో సన్నిహితంగా… ఇదేం ఫ్యామిలీ భయ్యా

Chaarulatha : ప్రస్తుతం ఓటీటీలో భారీ యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్లు రాజ్యం చేస్తున్నా, ETV Win మాత్రం హృదయాన్ని తాకే కథలతో నిశ్శబ్ద విప్లవం సృష్టిస్తోంది. ప్రతి ఆదివారం వస్తున్న ‘కథాసుధ’ సిరీస్‌కు తెలుగు కుటుంబాల్లో భారీ క్రేజ్ ఏర్పడింది. ఈ ఆదివారం అంటే జూన్ 7న కూడా ఒక హార్ట్-టచింగ్ స్టోరీతో వచ్చేసింది. ఆ సినిమానే ‘చారులత’.

కథలోకి వెళ్తే…

చారులత కథ షర్మిల (సుజిత), మిలింద్ (రవిప్రకాష్) చుట్టూ తిరుగుతుంది. షర్మిల స్వతంత్ర ఆలోచనలు ఉన్న, ధైర్యవంతురాలైన మహిళ. మొదటి భర్తతో విడాకులు తీసుకుని ఉంటుంది. కూతురి కస్టడీ కూడా కోల్పోయి ఒంటరి జీవితం గడుపుతుంది. మిలింద్ కూడా తాను ప్రాణంగా ప్రేమించిన భార్యను కోల్పోయి, లోపల ఖాళీగా ఉంటాడు. సమాజం ఒత్తిడి, ఒంటరితనం కారణంగా ఇద్దరూ రెండో పెళ్లి చేసుకుంటారు. కానీ ఇది ప్రేమావేశాలతో చేసుకున్న పెళ్లి కాదు. కేవలం ఒకరికొకరు తోడుగా ఉండాలనే ఉద్దేశ్యంతో, కొన్ని కఠిన షరతులతో ఈ వివాహం చేసుకుంటారు. అపరిచితుల్లా మొదలైన జీవితం ఒకే ఇంట్లో ఉంటున్నా, ఇద్దరూ మొదట్లో అపరిచితుల్లాగానే ప్రవర్తిస్తారు.

మాట్లాడకుండా, ఒకరి ముఖం ఒకరు చూసుకోకుండా రోజులు గడుపుతారు. కానీ కాలం ముందుకు సాగుతుండగా మిలింద్ ప్రవర్తనలో ఉన్న ఆత్మీయత షర్మిల మనసును కరిగిస్తుంది. నెమ్మదిగా ఇద్దరి మధ్య అనుబంధం ఏర్పడుతుంది. ఒకరి బాధను ఒకరు అర్థం చేసుకుంటారు. ఇద్దరూ జీవితంలో మళ్లీ కొత్త ఆశలు కలిగించుకుంటారు. క్లైమాక్స్‌లో షాకింగ్ ట్విస్ట్ ఉంటుంది. కథ సుఖాంతం వైపు వెళ్తుందని అనుకునే సమయంలో ఆ పెద్ద ట్విస్ట్ వస్తుంది. షర్మిల ఒకరోజు మిలింద్‌ను మరో మహిళతో సన్నిహితంగా చూస్తుంది. తనను మోసం చేశాడని ఆమెకు తీవ్ర కోపం వస్తుంది. ఆలోచన లేకుండా విడాకులకు దరఖాస్తు చేస్తుంది. కానీ ఈ సంఘటన వెనుక ఒక భారీ రహస్యం దాగి ఉంటుంది. ఆ ట్విస్ట్ ఏమిటి ? మిలింద్ నిజంగా మోసం చేశాడా ? లేక ఇంకేదైనా ఉందా ? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ‘చారులత’ పూర్తిగా చూడాల్సిందే.

ఎక్కడ చూడాలి ?

ఈ సినిమా నార్మల్ ప్రేమ కథ కాదు. వయోజనుల మధ్య ఏర్పడే సంబంధం, గాయాలు, నమ్మకం, అపార్థాలు… రెండో ఇన్నింగ్స్ గురించి చాలా సున్నితంగా, హృదయానికి హత్తుకునేలా చూపించిన సినిమా ఇది. రవిప్రకాష్, సుజిత, అనిరుధ్ నటన సినిమాకు ప్లస్ పాయింట్స్. ETV Winలో ఈ ఆదివారం ‘కథాసుధ’లో ‘చారులత’ స్ట్రీమింగ్ అవుతోంది. కుటుంబంతో కలిసి చూడదగ్గ, ఆలోచింపజేసే హార్ట్-టచింగ్ స్టోరీ కావాలంటే తప్పకుండా ఈ మూవీని చూడండి.

Read Also : బిగ్ హింట్… ప్రైమ్ వీడియో క్రేజీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌కు సీజన్ 2 వస్తుందా ?

Tags

Related News

బార్‌లో మద్యం తాగుతూ భార్యలు చేసే రచ్చ… ఏ ఓటీటీలో ఉందంటే ?

‘ఏపెక్స్’ నుండి ‘ది రిప్’ వరకు… 2026లో విడుదలైన 5 కొత్త సస్పెన్స్ థ్రిల్లర్స్

ఫేక్ నోట్ల యాపారం… ప్రింటింగ్ ప్రెస్ పేరుతో వీళ్ళు చేసే పని చూస్తే బుర్రపాడు

ఉపాధ్యాయులపై దాడులు… విద్యార్థులకు బుద్ధి చెప్పే ఊర మాస్ టీచర్

Bharat Bhhagya Viddhaata OTT : 26/11 దాడి అన్ టోల్డ్ స్టోరీ… కంగనా మూవీ స్ట్రీమింగ్ డేట్

Avatar 3 OTT Release : 12,000 కోట్ల విజువల్ వండర్ ఓటీటీలోకి… రెడీ అవ్వండమ్మా

This Week OTT Movies : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఆ మూడు మస్ట్ వాచ్..!

Big Stories

×