E-Paper
Advertisement

Biopic OTT : ఇండియన్ ఫుట్ బాల్ లెజెండ్ బయోపిక్… కట్టిపడేసిన అజయ్ నటన… స్పోర్ట్స్ ప్రియులకు ఫీస్ట్

Biopic OTT : ఇండియన్ ఫుట్ బాల్ లెజెండ్ బయోపిక్…  కట్టిపడేసిన అజయ్ నటన… స్పోర్ట్స్ ప్రియులకు ఫీస్ట్
Advertisement

Biopic OTT : చాలా వరకు బయోపిక్ సినిమాలు ఇన్స్పైరింగ్ గా ఉంటాయి. అయితే హిందీలో వచ్చిన ఒక స్పోర్ట్స్ బయోపిక్ సినిమాను చూస్తే జీవితంలో ఏదో సాధించాలని అనిపిస్తుంది. అలా ఉంటుంది ఈ సినిమా మరి. అజయ్ దేవగన్‌ లీడ్ లో నటించిన ఈ సినిమా, భారత ఫుట్‌బాల్ ఐకానిక్ కోచ్ సైద్ అబ్దుల్ రహీమ్ జీవిత కథ ఆధారంగా రూపొందింది. 1950 నుండి 1960 వరకు భారత ఫుట్‌బాల్ గోల్డెన్ ఏజ్ గా చెప్పుకుంటారు. ఆయన సారథ్యంలో భారత్‌కు ఆసియా క్రీడల్లో బంగారు పతకం ఎలా అందిందో ఇందులో కళ్ళకు కట్టినట్లు చూపించారు.

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

భారతీయ ఫుట్‌బాల్ దిగ్గజ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ‘మైదాన్’ (Maidaan). అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం 2024 ఏప్రిల్ 11న విడుదలైంది. దీనికి అమిత్ శర్మ దర్శకత్వం వహించగా, ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించారు. ఇందులో అజయ్ దేవగన్‌తో పాటు ప్రియమణి, గజరాజ్ రావు కీలక పాత్రల్లో నటించారు. విమర్శకుల నుండి మంచి ప్రశంసలు పొందినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయింది. అయితే అజయ్ దేవగన్ నటనకు గాను సెప్టిమియస్ అవార్డ్స్‌లో ఉత్తమ ఆసియా నటుడు అవార్డు లభించింది. ప్రస్తుతం Amazon Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

1950వ దశకంలో భారత ఫుట్‌బాల్ జట్టు పరిస్థితి ఏమాత్రం బాగోలేని సమయం అది. కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ (అజయ్ దేవగన్) ఆ జట్టు బాధ్యతను తన భుజాల మీద వేసుకుంటాడు. ఫుట్‌బాల్ అసోసియేషన్‌లో ఉండే రాజకీయాలను, కుట్రలను ఎదుర్కొంటూనే ఆయన దేశవ్యాప్తంగా తిరుగుతూ టాలెంట్ ఉన్న కుర్రాళ్లను వెతికి ఒక టీమ్‌ను తయారు చేస్తాడు. కేవలం ఆటగాళ్లను ఎంపిక చేయడమే కాకుండా, భారత జట్టుకు ఒక ధైర్యాన్ని, ఆత్మ విశ్వాసాన్ని నూరి పోస్తాడు. ఇక ప్రపంచ వేదికలపై టీమ్ ఇండియాను గర్వపడేలా చేయడం కోసం తన ఆరోగ్యం పాడవుతున్నా లెక్కచేయకుండా పోరాడతాడు.

చివరికి 1962లో జకార్తాలో జరిగిన ఆసియా క్రీడలే ఈ సినిమాకు హైలైట్. అప్పటికే రహీమ్ క్యాన్సర్‌తో బాధపడుతూ మరణానికి దగ్గరగా ఉన్నా, తన జట్టును ఎలాగైనా గెలిపించాలనే పట్టుదలతో ఉంటాడు. స్టేడియంలో వేలమంది ప్రేక్షకులు భారత్‌కు వ్యతిరేకంగా అరుస్తున్నా, బలమైన ప్రత్యర్థులను ఢీకొట్టి మన దేశం గోల్డ్ మెడల్ సాధించేలా చేస్తారు. భారత్‌ను ‘ఆసియా బ్రెజిల్’గా మార్చిన ఒక గొప్ప కోచ్ విజయగాథే ఈ సినిమా.

Advertisement

Read Also : ఫ్యూచర్ నుంచి వచ్చే పెళ్ళాం… భర్తకి షాకింగ్ ట్విస్టులు… ఇన్స్టా లో ట్రెండ్ అవుతున్న మాస్టర్ పీస్

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×