E-Paper
Advertisement

Fantasy movie: ఫ్యూచర్ నుంచి వచ్చే పెళ్ళాం… భర్తకి షాకింగ్ ట్విస్టులు… ఇన్స్టా లో ట్రెండ్ అవుతున్న మాస్టర్ పీస్

Fantasy movie: ఫ్యూచర్ నుంచి వచ్చే పెళ్ళాం… భర్తకి షాకింగ్ ట్విస్టులు… ఇన్స్టా లో ట్రెండ్ అవుతున్న మాస్టర్ పీస్
Advertisement

Fantasy movie : టైమ్ ట్రావెల్ సినిమాలు ఎంత ఆసక్తిగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. అందుకే ఈ సినిమాలను ఆడియన్స్ కూడా వదిలి పెట్టరు. గత ఏడాది ఇండోనేషియా నుంచి వచ్చిన ఒక టైమ్ ట్రావెల్ మూవీ మంచి రెస్పాన్స్ పొందింది. ఓటీటీలో కూడా ఈ మూవీ బాగా ట్రెండ్ అవుతోంది. ఫ్యూచర్ నుంచి వచ్చే ఒక అమ్మాయి చుట్టూ కథ ఉంటుంది. అస్సలు బోర్ కొట్టని సినిమా ఇది. వీలైతే వీకెండ్ ఓ సారి ట్రై చేయండి. ఈ మూవీ పేరు, ఎక్కడ చూడచ్చు అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది అంటే

2025లో వచ్చిన ఈ ఇండోనేషియన్ రొమాంటిక్ సైన్స్ ఫాంటసీ మూవీ పేరు ‘Sore: A Wife From The Future’. ఇది యాండీ లారెన్స్ దర్శకత్వం వహించిన సినిమా. 2017 వెబ్ సిరీస్ “Sore”కి ఫుల్ లెంగ్త్ అడాప్టేషన్. డియాన్ వియోకో (జోనాథన్), షీలా దారా ఐషా (సోర్) ఇందులో లీడ్ రోల్స్ లో నటించారు. ఈ చిత్రం 98వ అకాడమీ అవార్డ్స్ కోసం ఇండోనేషియా తరపున అధికారిక ఎంట్రీగా కూడా ఎంపికైంది. థియేటర్లలో ఇండోనేషియాలో 2025 జూలై 10న రిలీజ్ అయింది ఈ మూవీ. 2025 డిసెంబర్ 10 నుంచి ఈ సినిమా Netflix ప్లాట్‌ ఫామ్‌లో అందుబాటులో ఉంది. IMDbలో 7.7/10 రేటింగ్ కూడా ఉంది మూవీకి.

స్టోరీ ఏమిటంటే

Advertisement

జోనాథన్ అనే వ్యక్తి ఫోటోగ్రాఫర్‌గా ఉంటూ, తన ఆరోగ్యం గురించి అస్సలు పట్టించుకోకుండా ఇష్టమొచ్చినట్టు జీవిస్తుంటాడు. ఒకరోజు ఉదయం అతను నిద్రలేచేసరికి, సోర్ అనే ఒక అమ్మాయి అతని ఇంట్లో ఉంటుంది. తను భవిష్యత్తు నుండి వచ్చిన అతని భార్యనని, అతను తన అలవాట్ల వల్ల భవిష్యత్తులో చనిపోతాడని, అతన్ని కాపాడటానికే తాను వచ్చానని ఆమె చెబుతుంది. మొదట జోనాథన్ దీన్ని నమ్మకపోయినా, ఆమె చెప్పే విషయాలు నిజమవుతుండటంతో ఆమె మాట వినడం మొదలు పెడతాడు.

సోర్ తన భర్తను కాపాడుకోవడానికి పదేపదే టైమ్ ట్రావెల్ చేస్తూ, జోనాథన్ తన తండ్రితో ఉన్న విభేదాలను పోగొట్టుకునేలా చేస్తుంది. అలాగే అతని దురలవాట్లను, అంటే సిగరెట్, ఆల్కహాల్ లాంటివి మాన్పిస్తుంది. తనపై తనకు బాధ్యత తెలిసేలా చేస్తుంది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య పుట్టే ప్రేమ, ఒకరికోసం ఒకరు పడే తపన హార్ట్ ని టచ్ చేస్తాయి. తన భార్య తనపై చూపించే ఆ అంతులేని ప్రేమను చూసి జోనాథన్ తన జీవితాన్ని ఎలా మార్చుకున్నాడనేదే ఈ సినిమాలోని అసలు కథ.

Advertisement

Read Also : అప్పులు తీర్చడానికి 400 ఏళ్ల నాటి రాజభవనం అమ్మకం… తోలు తీసే ప్రేతాత్మ… ఐయండిబిలో టాప్ రేటింగ్

Tags

Related News

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

బాడీ షేమింగ్‌ చేస్తూ వేధించిన అమ్మాయిలు… వాళ్లను కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని చూసి కూడా నోరు మెదపని బాధితురాలు! స్పానిష్‌ రివెంజ్‌ థ్రిల్లర్‌

గేమ్‌ ఆడితే మెదడునే కంట్రోల్‌ చేసే డేంజరస్ టెక్నాలజీ… సైకలాజికల్‌ సైఫై థ్రిల్లర్‌ ఓటీటీలోకి

Big Stories

Advertisement
×