E-Paper
Advertisement

Psycho Movie OTT : అమ్మాయిలే వీడి టార్గెట్… 1 గంట 58 నిమిషాల థ్రిల్లర్ మూవీ… IMDbలో 10కి 8.6 రేటింగ్‌

Psycho Movie OTT : అమ్మాయిలే వీడి టార్గెట్… 1 గంట 58 నిమిషాల థ్రిల్లర్ మూవీ… IMDbలో 10కి 8.6 రేటింగ్‌
Advertisement

Psycho Movie OTT : సినిమా ప్రియులలో రానురానూ హారర్ జానర్ పట్ల క్రేజ్ పెరుగుతోంది. పెద్ద తెరపై హారర్ చిత్రాలను చూసిన తర్వాత కూడా, ప్రేక్షకులు ఆ భయాన్ని, థ్రిల్ ను మరోసారి ఫీల్ అవ్వడానికి ఓటీటీలను ఆశ్రయిస్తున్నారు. అందుకే ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో ఉండే అలాంటి చిత్రాలపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు జనాలు. ఇక నిర్మాతలు కూడా హారర్ లేదా హారర్-కామెడీ సినిమాలు, సిరీస్‌లను రూపొందించడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం అలాంటి ఒక చిత్రం ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది. బాక్సాఫీస్ దగ్గర దాని బడ్జెట్‌కు మూడు రెట్లు సంపాదించిన ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది? స్టోరీ ఏంటి? అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం పదండి.

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

ఈ 1 గంట 58 నిమిషాల సినిమా చూస్తే అస్సలు బోర్ అనిపించదు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ హర్రర్ సినిమా ఏకంగా ఐదు ఆస్కార్ అవార్డులను గెలుచుకుంది. ఈ సినిమా విడుదలైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించడం ఒక విశేషం అయితే, ఇప్పుడు అది మరోసారి ఓటీటీలో ట్రెండ్ అవుతుండడం మరో విశేషం. ఆ మూవీ మరేమిటో కాదు “ది సైలెన్స్ ఆఫ్ ది లాంప్స్” (The Silence of the Lambs). IMDbలో 10కి 8.6 రేటింగ్‌ తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ ఎపిక్ మూవీని నెట్‌ఫ్లిక్స్‌లో ఆస్వాదించవచ్చు. 1991లో విడుదలైన ఈ మూవీ ఒక అమెరికన్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. ఇంటెన్స్, సస్పెన్స్‌ఫుల్, ఐకానిక్ సినిమాగా పేరు తెచ్చుకున్న దీనికి జానతన్ డెమ్మే దర్శకత్వం వహించాడు. థామస్ హారిస్ రాసిన నవల ఆధారంగా తీసిన ఈ సినిమాను ఇంకా చూడకపోతే వెంటనే ఒక లుక్కేయండి.

కథలోకి వెళ్తే…

Advertisement

ఎఫ్‌బీఐ అకాడమీలో యంగ్ ట్రైనీ, ఏజెంట్ క్లారిస్ స్టార్లింగ్ (జోడీ ఫాస్టర్) చాలా స్మార్ట్, బ్రేవ్ గా ఉంటుంది. కానీ ఆమె చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో అదే ట్రామాలో ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఒక సీరియల్ కిల్లర్ బిల్ మహిళలను చంపి, వాళ్ల చర్మాన్ని తీసి సూట్ గా కుట్టుకుంటాడు. ఈ కేసు ఎఫ్‌బీఐకి పెద్ద హెడెక్ గా మారుతుంది. బిల్ లాస్ట్ విక్టిమ్ కాథరిన్ మార్టిన్ (సెనేటర్ కుమార్తె)ని కిడ్నాప్ చేసిన తర్వాత, ఎఫ్‌బీఐ డైరెక్టర్ జాక్ క్రాఫోర్డ్ క్లారిస్‌ని రంగంలోకి దింపుతాడు.

బాల్టిమోర్‌లోని మెంటల్ హాస్పిటల్‌లో ఉన్న మరొక సీరియల్ కిల్లర్ డాక్టర్ హానిబల్ లెక్టర్ (అంథోనీ హాప్కిన్స్)ని కలవమని పంపుతారు. లెక్టర్ చాలా ఇంటెలిజెంట్, మానిప్యులేటివ్, కానిబల్ కూడా. అతను బిల్ గురించి క్లూస్ ఇచ్చినట్టే ఇచ్చి, బదులుగా క్లారిస్ మైండ్‌ని రీడ్ చేస్తాడు. “క్విడ్ ప్రో క్వో” (ఇద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకోవడం) గేమ్ ఆడి తమకు కావలసినవి రాబట్టుకుంటారు. లెక్టర్ బిల్ గురించి ఇచ్చిన హింట్స్ పట్టుకుని బిల్ ఇంటికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది? హీరోయిన్ కిల్లర్ ను పట్టుకుందా ? లేదంటే కిల్లర్ కు దొరికిపోయిందా ? సినిమాలో వచ్చే స్పైన్ చిల్లింగ్ క్లైమాక్స్ ఏంటి? అనేది తెలియాలంటే మూవీని చూడాల్సిందే.

Advertisement

Also Read : ప్రేమ కథల నుంచి గ్రిప్పింగ్ థ్రిల్లర్స్ వరకు… ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు సిరీసులు

Tags

Related News

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

Big Stories

Advertisement
×