MI VS RR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటు ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో ముంబై ఇండియన్స్ అత్యంత చెత్త ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. 14 మ్యాచులు ఆడిన ముంబై ఇండియన్స్, కేవలం నాలుగింటిలో మాత్రమే విజయం సాధించింది. మొత్తం 10 మ్యాచ్లలో దారుణంగా ఓడిపోయింది ముంబై ఇండియన్స్. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా అలాగే సూర్య కుమార్ యాదవ్ ( Suryakumar Yadav ) లాంటిది క్రికెటర్లు ఉన్నప్పటికీ కూడా ముంబై ఇంటిదారి పట్టాల్సి వచ్చింది. ఇక తన లీగ్ దశలో చివరి మ్యాచ్ లో కూడా చిత్తుగా ఓడిపోయింది.
ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ( Mumbai Indians vs Rajasthan Royals) మధ్య మే 24వ తేదీన వాంఖడే స్టేడియం ( Wankhede Stadium, Mumbai) వేదికగా బిగ్ ఫైట్ జరిగింది. ఈ మ్యాచ్ లో సింపుల్ గెలిచే ముంబై ఇండియన్స్, చెత్త ప్రదర్శన కనబరిచి ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ 60 పరుగులు చేసి ఆదుకునే ప్రయత్నం చేశాడు. కానీ కీలకమైన సమయంలో వికెట్ సమర్పించుకొని, ముంబై ఇండియన్స్ ను ముంచాడు. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ముంబై ఇండియన్స్ డేంజర్ ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ కు ఘోర అవమానం ఎదురైంది. ఈ మ్యాచ్ లో మొదటి రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ చేయగా… ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ చేసింది. అయితే ఈ క్రమంలో బౌండరీ గేటు దగ్గర సూర్యకుమార్ యాదవ్ ఫీల్డింగ్ చేశాడు. ఇదే ఛాన్స్ అనుకోని ముంబై ఇండియన్స్ అభిమానులు రెచ్చిపోయారు. బండ బూతులు తిడుతూ… సూర్య కుమార్ యాదవ్ పై రాళ్ళు విసిరారు.
తమతో తీసుకువచ్చిన గట్టి వస్తువులను కూడా విసిరారు. ఆ వస్తువులు నేరుగా సూర్య కుమార్ యాదవ్ ను తగిలాయి. ముంబై ఇండియన్స్ చిత్త ప్రదర్శన నేపథ్యంలో అభిమానులు ఈ విధంగా నిరసన తెలిపారు. అయితే అది అర్థం చేసుకున్న సూర్య కుమార్ యాదవ్.. స్టేడియంలో పడ్డ రాళ్లను, ఇతర వస్తువులను ఏరి మళ్ళీ బయటపడేసాడు. అయినప్పటికీ అభిమానులకు కోపం మాత్రం తగ్గలేదు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే దీనిపై క్రీడా విశ్లేషకులు సీరియస్ అవుతున్నారు. సూర్య కుమార్ యాదవ్ ను ఒక్కడినే టార్గెట్ చేసి ఇలా అభిమానులు దాడి చేయడం అన్యాయం అన్నారు. టీమ్ ఎఫర్ట్ ఉంటేనే ముంబై ఇండియన్స్ విజయం సాధిస్తుందని చురకలు అంటిస్తున్నారు. ఇలా ప్లేయర్లపై దాడులు చేసే వాళ్లను స్టేడియాలలోకి రానివ్వకూడదని.. కోరుతున్నారు. దీనిపై వెంటనే బీసీసీఐ యాక్షన్ తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.
Shameful behavior by some Wankhede fans towards Suryakumar Yadav 😭
During the MI vs RR match, Surya was fielding near the boundary line when a few people in the crowd reportedly started throwing stone-like objects towards him.
The saddest part? He didn’t react angrily… he… pic.twitter.com/SxgN6FM5TV
— Jara (@JARA_Memer) May 25, 2026