Railway Corridors: కేంద్ర కేబినెట్ సమావేశంలో నేడు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సమావేశంలో దేశంలో 7 హై డెన్సిటీ రైల్వే కారిడార్ల అభివృద్ధికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో రైళ్ల రద్దీని తగ్గించేందుకు భారతీయ రైల్వేవవ్యస్థ భారీ ప్రణాళికలు రూపోందించింది. ఢిల్లీ–హౌరా, ఢిల్లీ–ముంబై కారిడార్లకు ఈ సమావేశంలొ అధిక ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో ఢిల్లీ–చెన్నై మార్గంలో విజయవాడ కీలక స్టేషన్‌గా మారనుంది.
Also read: ఏపీలో కొత్త పింఛన్లపై.. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బిగ్ అనౌన్స్‌మెంట్!
హౌరా–చెన్నై కారిడార్‌లో విశాఖపట్నానికి ప్రాధాన్యతనిస్తూ.. ముంబై–చెన్నై మార్గంలో రేణిగుంట, గుంతకల్ అభివృద్ధికి ఊతం లభించనుంది. దీంతో పలు మార్గాల్లో నాలుగో లైన్ పనులు కొనసాగుతున్నాయి. మరికొన్ని కారిడార్లు డీపీఆర్ ఇప్పటికే ఆమోద దశలో ఉన్నాయని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఆ కారిడార్లో భవిష్యత్తులో సరుకు రవాణా, ప్రయాణికుల సేవల సామర్థ్యం ఎక్కువగా పెరగనుందని రైళ్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. వీటితో పాటుగా రైళ్ల సమయపాలన మెరుగుపడుతుందని రైల్వే శాఖ మంత్రి అంచనావేసారు.
Also read: సామాన్యుడిపై సెలబ్రిటీస్ ప్రతాపం.. కప్పు కొట్టేస్తాడని భయమా?