E-Paper
Advertisement

OTT Movie: ఒక హత్య ట్విస్టులు మాత్రం బోలెడు… సినీ నటుడి కేసులో కిరాక్ ఇన్వెస్టిగేషన్… ఉత్కంఠ రేపుతున్న సిరీస్

OTT Movie: ఒక హత్య ట్విస్టులు మాత్రం బోలెడు… సినీ నటుడి కేసులో కిరాక్ ఇన్వెస్టిగేషన్… ఉత్కంఠ రేపుతున్న సిరీస్

OTT Movie : కొన్ని పెద్ద సీక్రెట్‌లు ఎప్పుడైనా ఒక వైరల్ వీడియోతో బయటపడితే ఏమవుతుంది? ఇదే భయంకరమైన కాన్సెప్ట్‌తో వచ్చిన సిరీస్ ‘బుకర్ మొధ్ధ్యే అగున్’. ఈ బెంగాలీ సిరీస్ ఒక స్టార్ హీరో మర్డర్ చుట్టూ తిరుగుతుంది. 20 సంవత్సరాల క్రితం సూసైడ్ అనుకున్న స్టార్ హీరో కేసు, ఒక వైరల్ వీడియోతో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇన్వెస్టిగేషన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఒక్కసారి ఈ సిరీస్ ని చూడటం స్టార్ట్ చేస్తే ఆపడం కష్టమే. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఏ ఓటీటీ ఉంది ? అనే వివారాల్లోకి వెళ్తే …

ఎందులో స్ట్రీమింగ్ అంటే

‘బుకర్ మొధ్ధ్యే అగున్’ 2023లో విడుదలైన బెంగాలీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. టానీమ్ రహ్మాన్ ఆంగ్షు డైరెక్షన్లో ఇది తెరకెక్కింది. ఇందులో యాష్ రోహన్, తౌక్వీర్ అహ్మద్, తారిఖ్ అనామ్ ఖాన్, తానియా అహ్మద్ మెయిన్ రోల్స్ లో నటించారు. 2023 మార్చి 3న ఇది Hoichoi ఓటీ టీలో రిలీజ్ అయింది. 8 ఎపిసోడ్స్ తో ఐయండిబిలో 7.0/10 రేటింగ్ ని పొందింది. Amazon Primeలో కూడా ఇది అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

20 సంవత్సరాల క్రితం ధాకా సినిమా ఇండస్ట్రీలో ఒక సూపర్‌స్టార్ హీరో ఖాలెద్ మౌలా తన ఇంట్లో ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంటాడు. అప్పట్లో ఈ కేసు సంచనం అయింది. అయితే పోలీసులు ఈ కేసును సూసైడ్ అని క్లోజ్ చేసేశారు. ప్రస్తుతం అతని డెత్ కి సంబంధించి సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఖాలెద్ ఒక్కడే కెమెరా ముందు కూర్చుని ఏడుస్తూ మాట్లాడతాడు. నేను సూసైడ్ చేసుకోవట్లేదు, నన్ను చంపబోతున్నారని, ఆ పేర్లు నేను ఇప్పుడు చెప్తాను అనే లోపే వీడియో కట్ అయిపోతుంది. పబ్లిక్ ఫుల్ షాక్ అవుతుంది. ఆ వీడియో ఎవరు పోస్ట్ చేశారు? ఎక్కడి నుంచి వచ్చింది? అనే అనుమానాలు వస్తాయి. పబ్లిక్ ప్రెషర్ వల్ల పోలీసులు మళ్లీ కేసు రీ ఓపెన్ చేస్తారు. కేసు ASP మమూన్ అనే ఆఫీసర్ తీసుకుంటాడు. అతను చాలా షార్ప్, ఒక్కసారి కేసు పట్టుకుంటే వదలని ఆఫీసర్. మమూన్ మొదట ఖాలెద్ భార్య, బెస్ట్ ఫ్రెండ్, పాలిటీషియన్ లతో సహా అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఈ సమయంలో ఖాలెద్ నిజంగానే మర్డర్ అయ్యాడు. ఉరి వేసుకున్నట్టు హంతకులు సీన్ క్రియేట్ చేశారు.

Read Also : దొంగ గేమ్స్ ఆడి డబ్బు కొల్లగొట్టే కేటుగాళ్లు… చూసేకొద్దీ చూడాలనిపించే కొరియన్ మూవీ

ఆ వైరల్ వీడియోని ఖాలెద్ మరణించే ముందే రికార్డ్ చేసి, ఒక సీక్రెట్ ప్లేస్‌లో దాచాడు. ఎవరో ఇప్పుడు దాన్ని బయట పెట్టారు. .మమూన్ ఇన్వెస్టిగేషన్ లో బిత్తరపోయి నిజాలు బయటకి వస్తాయి. ఖాలెద్ ఒక పెద్ద స్కాండల్ ఫిల్మ్ తీయాలనుకున్నాడని తెలుస్తుంది. బెంగాలీ ఫిల్మ్ ఇండస్ట్రీలో డబ్బు మోసాలు, సెక్స్ రాకెట్, పాలిటికల్ లింక్స్… అన్నీ బయటపెట్టే స్క్రిప్ట్ కూడా రాసుకోవడంతో చాలా మంది భయపడినట్లు ఆఫీసర్ కనిపెడతాడు. ఆ స్క్రిప్ట్ బయటకు వస్తే చాలా మంది పెద్దవాళ్లు జైలుకి కూడా వెళ్తారు. అందుకే అతన్ని పక్కాగా ప్లాన్ చేసి చంపేశారు. చివరికి హంతకున్ని ASP పట్టుకుంటాడా ? కిల్లర్ ఎవరు ? వీడియో వైరల్ చేసింది ఎవరు ? అనే ప్రశ్నలకు సమాధానాలను, ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ని చూసి తెలుసుకోండి.

 

Related News

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

Big Stories

×