E-Paper
Advertisement

Gautam Gambhir: సొంత‌గ‌డ్డ‌పై 2 సిరీస్ లు వైట్ వాష్‌..గంభీర్ రాజీనామా, కొత్త కోచ్ ఎవ‌రంటే ?

Gautam Gambhir: సొంత‌గ‌డ్డ‌పై 2 సిరీస్ లు వైట్ వాష్‌..గంభీర్ రాజీనామా, కొత్త కోచ్ ఎవ‌రంటే ?
Advertisement

Gautam Gambhir :   దక్షిణాఫ్రికా చేతిలో టీమిండియా టెస్ట్ సిరీస్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. 2-0 తేడాతో టెస్ట్ సిరీస్ కోల్పోయింది టీమిండియా. అంటే ఈ సిరీస్ లో వైట్ వాష్ అయింది. గతంలో కూడా న్యూజిలాండ్ చేతిలో టీమిండియా వైట్ వాష్ అయింది. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అతన్ని హెడ్ కోచ్ పదవి నుంచి తొలగించి, మహేంద్ర సింగ్ ధోనీకి కోచ్ బాధ్యతలు ఇవ్వాలని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

Also Read: T20 World Cup 2026 Schedule: టీ20 వ‌రల్డ్ క‌ప్ 2026 షెడ్యూల్…4 గ్రూప్ లు, 20 జ‌ట్లు..పాకిస్తాన్‌, భార‌త్ మ్యాచ్ ఎప్పుడంటే

గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలో రెండు సిరీస్ లు పాయే

Advertisement

టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు తీసుకున్నప్పటినుంచి ఇప్పటివరకు రెండు టెస్టు సీరియస్ లలో వైట్ వాష్ అయింది టీమ్ ఇండియా. గతంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ కూడా జరగలేదు. 36 సంవత్సరాల తర్వాత న్యూజిలాండ్ చేతిలో మూడు టెస్టుల సిరీస్ ను టీమిండియా కోల్పోయింది. 3- 0 తేడాతో మన టీమ్ ఇండియాను వైట్ వాష్ చేసింది న్యూజిలాండ్. ఇక ఇప్పుడు దక్షిణాఫ్రికా చేతిలో కూడా 2-0 తేడాతో రెండు టెస్టుల సిరీస్ ను సొంత గడ్డపై కోల్పోయింది టీమిండియా. అలాగే శ్రీలంక చేతిలో 27 సంవత్సరాల తర్వాత వన్డే సిరీస్ ను కోల్పోయిన టీమిండియా, చెత్త రికార్డును నెలకొల్పింది. ఇక మొన్న ఆస్ట్రేలియా గడ్డపై 1-3 తేడాతో మరో టెస్ట్ సిరీస్ కూడా గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలోనే కోల్పోయింది. ఇంగ్లాండ్ గడ్డపై ఓ టెస్టు సిరీస్ ను డ్రా చేసుకుంది.

గెలవాల్సిన ఆ సిరీస్ లో కూడా డ్రా దాకా తెచ్చుకుంది. అయితే గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలో ఇండియా గడ్డపై బంగ్లాదేశ్ పైన 2- 0 ఒకే ఒక్క సిరీస్ గెలిచింది టీమిండియా. అలాగే మొన్న వెస్టిండీస్ పైన కూడా రెండు టెస్టుల సిరీస్ ను 2-0 తేడాతో వైట్ వాష్‌ చేసింది టీమిండియా. ఈ రెండు సిరీస్ లు మినహా అన్నిటిలోనూ టీమిండియా ఓడిపోయింది. ఇదంతా జరిగింది గౌతమ్ గంభీర్ కోచ్ గా ఉన్నప్పుడే. హర్షిత్ రాణా లాంటి ప్లేయర్లను జట్టులోకి తీసుకోవడం, గిల్ కు కెప్టెన్సీ ఇవ్వడం, వాషింగ్టన్ సుందర్ లాంటి వారితో ప్రయోగాలు చేయడం, మహమ్మద్ షమీ, సిరాజ్, బుమ్రా లాంటి ప్లేయర్లకు పెద్దగా అవకాశాలు ఇవ్వకపోవడం గౌతమ్ గంభీర్ చేసిన మిస్టేక్స్. ఇలా అనేక రకాల తప్పిదాలు చేసిన గౌతమ్ గంభీర్ ను కోచ్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

ధోనికి కోచ్ ప‌ద‌వి ?

Advertisement

టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ విఫలమైన నేపథ్యంలో మహేంద్ర సింగ్ ధోనీ కి ఆ బాధ్యతలు ఇవ్వాలని ఫాన్స్ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. దానికి తగ్గట్టుగానే భారత క్రికెట్ నియంత్రణ మండలి ఈ నెల 30వ తేదీన అత్యవసర సమావేశం నిర్వహించబోతుందట. ఆ సందర్భంగా గౌతమ్ గంభీర్ భవితవ్యం పై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ధోనిని తీసుకుంటే కచ్చితంగా టీమిండియా కు ఫలితాలు పాజిటివ్ గా వస్తాయని అంచనా వేస్తోంది బీసీసీఐ.

Also Read: Smriti Mandhana Wedding: స్మృతి మంధానకు మరో షాక్… ఆస్పత్రిలో చేరిన కాబోయే భర్త ముచ్చల్!

 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×