E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu Day 80 : ప్రేరణతో ఆడి ఓడిన తనూజా… మానస్ తో డెమోన్, హారికతో సుమన్ ఫైట్… గెలిచిందెవరు ?

Bigg Boss 9 Telugu Day 80 : ప్రేరణతో ఆడి ఓడిన తనూజా… మానస్ తో డెమోన్, హారికతో సుమన్ ఫైట్… గెలిచిందెవరు ?
Advertisement

Bigg Boss 9 Telugu Day 80 : బిగ్ బాస్ సీజన్ 9లో ఎక్స్ కంటెస్టెంట్స్ కు, ఇప్పుడు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కు మధ్య కెప్టెన్సీ యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు ఎపిసోడ్ లో బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ ప్రేరణ కంబం అడుగు పెట్టారు. గత సీజన్ లో ఆవిడ చేసిన హడావిడి అంతా ఇంతాకాదు. ఇక తాజాగా హౌస్ లో అడుగు పెట్టాక పంచ్ లతో అదే జోష్ చూపించింది. అందరూ టాప్ 5 లో ఉండడానికి ట్రై చేయాలని, వాళ్ళ గురించి స్వయంగా బిగ్ బాస్ స్పెషల్ వీడియోతో మాట్లాడతారని, ఆ ఎక్స్పీరియన్స్ ను లైఫ్ లో ఒక్కసారే పొందగలమని చెప్పి, అందరిలో ఎనర్జీ నింపింది.

‘నువ్వు చాలా టఫ్ ప్లేయర్. నాకు నీతో ఆడాలని ఉంది’ అని తనూజా అడగడంతో ఆమెనే సెలెక్ట్ చేసింది ప్రేరణ. బిగ్ బాస్ వాళ్ళిద్దరికీ ‘క్రాస్ ఇట్ క్లయింబ్ ఇట్ రోప్ ఇట్’ అనే టాస్క్ పెట్టారు. స్టార్ట్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు రోప్ వేలో నడుస్తూ వెళ్ళి, బాల్స్ ను అందుకుని వచ్చి, స్లోప్ లో నుంచి హోల్స్ లో వేయాలన్నది ఈ టాస్క్.  ఇందులో చివరి నిమిషంలో తనూజా చేజారింది కంటెండర్షిప్. ఈ టాస్క్ కు దివ్య సంచాలక్ గా వ్యవహరించింది. అయితే ఓడిపోవడంతో 5 సెకండ్స్ లో మిస్ అయ్యాను అని తనూజా ఎమోషనల్ అయ్యింది.

సుమన్ శెట్టితో హారిక యుద్ధం

Advertisement

ఆ తర్వాత ‘ముట్టుకోకుండా గెస్ చేయండి. సీజన్ 4లో టాప్ 5 కంటెస్టెంట్స్ లో నేనూ ఒకదాన్ని’ అంటూ హింట్ ఇచ్చింది దేత్తడి హారిక. వెంటనే దేత్తడి అంటూ ఇమ్మూ ఎగిరి గంతేశాడు. ‘డెమోన్ ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు. అంటే రీతూ లేదు కదా… దివ్య నేను భరణి గారితో మాట్లాడొచ్చా… వచ్చిందమ్మా వయ్యారి రీతూ’ అంటూ హౌస్ మేట్స్ పై పంచుల వర్షం కురిపించింది. అలాగే ఇమ్మూను అద్దంలాగా, మిగతా వాళ్ళు తమను తాము అద్దంలో చూసుకుంటున్నప్పుడు అది ఎలా రియాక్ట్ అవుతుందో చెప్పాలని ఫన్నీ స్కిట్ వేయించింది.

హారికతో యుద్ధం చేయడానికి ‘టవర్ ఆఫ్ పవర్’ అనే టాస్క్ లో సుమన్ శెట్టి పాల్గొన్నాడు. దీనికి భరణి సంచాలక్ గా వ్యవహరించాడు. ఈ టాస్క్ లో వై ఆకారంలో ఉన్న ఫోర్క్ ను ఉపయోగించి ఫ్రేమ్ లో ఉన్న బాల్, డిస్క్ లను తీసుకెళ్ళి టవర్ లా నిర్మించాల్సి ఉంటుంది. అలా వెళ్లేటప్పుడు టైర్ వేను మాత్రమే వాడాలి. ఈ టాస్క్ లో రెండుసార్లు హారిక ఛాన్స్ ఇచ్చినా సుమన్ శెట్టి వాడుకోలేకపోయాడు.  అంతా అయ్యాక నన్నెవరూ పట్టించుకోవట్లేదు అంటూ సంజన మళ్ళీ దొంగతనం చేసింది.

మానస్ మాస్ ఎంట్రీ

Advertisement

ఇక ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 5 ఫైనలిస్ట్ మానస్ నాగులపల్లి ‘ఆ కుర్చీని మడతబెట్టి’ సాంగ్ తో మాస్ ఎంట్రీ ఇచ్చాడు. హౌస్ మేట్స్ తో ఫన్నీ టాస్క్ ఆడించిన తర్వాత రంగంలోకి దిగారు. మానస్ స్ట్రాంగ్ కాబట్టి మరో స్ట్రాంగ్ కంటెండర్ అయిన డెమోన్ పవన్ ను సెలెక్ట్ చేసుకున్నారు. ‘నెయిల్ ఇట్ టూ విన్ ఇట్’ అనే ఈ టాస్క్ కి కళ్యాణ్ సంచాలక్ గా చేశాడు. ఇందులో జిగ్ జాగ్ వే ద్వారా పరిగెత్తుకుంటూ వెళ్ళి, సంచాలక్ లు వేసే బాల్స్ ను గాల్లోనే అందుకుని, బోర్డుపై ఉన్న నెయిల్స్ కు గుచ్చుకునేలా కొట్టాలి. ఈ టాస్క్ లో డెమోన్ విన్ అయ్యి, కళ్యాణ్ తరువాత రెండవ కెప్టెన్సీ కంటెండర్ గా నిలిచాడు.

Read Also : కూతురికిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయిన భరణి… కెప్టెన్సీ అందని ద్రాక్షే

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×