E-Paper
Advertisement

రాత్రయితే చాలు అమ్మాయి కోసం వచ్చే వింత జీవి… ఇంటెన్స్ మిస్టరీ థ్రిల్లర్

రాత్రయితే చాలు అమ్మాయి కోసం వచ్చే వింత జీవి… ఇంటెన్స్ మిస్టరీ థ్రిల్లర్
Advertisement

Thriller Movie : కొన్ని ఊళ్లు విచిత్రంగా ఉంటాయి. అక్కడి ప్రజలు మనల్ని చూసే చూపులు వింతగా ఉంటాయి. మనం ఏ తప్పూ చేయకపోయినా అందరూ మనల్ని దూరంగా పెడతారు. అలాంటి ఒంటరి జీవితాన్ని గడుపుతున్న ఒక యువతి ఇంట్లోకి ఒక రాత్రి అనుకోని అతిథి వస్తే? అది మనిషి కాదు. జంతువు కాదు. భూమి మీద ఉండే జీవి కూడా కాదు. ఈ ఆసక్తికరమైన ఆలోచనతో రూపొందిన సైన్స్ ఫిక్షన్ మిస్టరీ థ్రిల్లర్ నో వన్ విల్ సేవ్ యు (No one will save you).

2023లో విడుదలైన ఈ చిత్రానికి బ్రియాన్ డఫీల్డ్ దర్శకత్వం వహించారు. కైట్లిన్ డెవర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా విడుదలైన వెంటనే తన విభిన్నమైన కథనం, ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ సినిమా కథేంటి?

Advertisement

కథలో బ్రిన్ అనే యువతి ఒక చిన్న పట్టణంలో ఒంటరిగా  జీవిస్తుంది. బయటకు చూస్తే ఆమె జీవితం ప్రశాంతంగా కనిపిస్తుంది. కానీ ఆ ఊరిలోని ప్రజలు ఆమెను పూర్తిగా దూరం పెడతారు. ఎక్కడికి వెళ్లినా ఆమెను అసహ్యంగా చూసే వాళ్లే కనిపిస్తారు. ఎందుకు ఇలా జరుగుతోందో ప్రేక్షకులకు కూడా మొదట్లో అర్థం కాదు. ఇదే కథలోని మొదటి మిస్టరీ.

ఒక రాత్రి ఇంట్లో విచిత్రమైన శబ్దాలు వినిపిస్తాయి. ఎవరో ఇంట్లోకి చొరబడ్డారని భావించిన బ్రిన్, కొద్దిసేపటికే అది సాధారణ దొంగ కాదని గ్రహిస్తుంది. ఆమె ఎదురుగా కనిపించింది ఒక వింత జీవి. అక్కడి నుంచి మొదలయ్యే ఘటనలు ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. సినిమా ముందుకు సాగే కొద్దీ ఇది కేవలం ఏలియన్ దాడి కథ కాదని తెలుస్తుంది. ఊరంతా ఎందుకు వింతగా ప్రవర్తిస్తోంది? ఆ జీవులు నిజంగా ఏం కోరుకుంటున్నాయి? గతంలో ఏం జరిగిందనే ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ కథ ముందుకు సాగుతుంది. ప్రతి కొన్ని నిమిషాలకు కొత్త మలుపులు రావడం వల్ల ప్రేక్షకుడికి తర్వాత ఏం జరుగుతుందో ఊహించడం కష్టమవుతుంది.

Advertisement

ఈ మూవీలో సంభాషణలు చాలా తక్కువగా ఉంటాయి. అయినప్పటికీ కైట్లిన్ డెవర్ తన నటనతో ప్రేక్షకులను పూర్తిగా కథలోకి లాగేస్తుంది. ఆమె భయం, ఒంటరితనం, పోరాటం అన్నీ మాటలు లేకుండానే అర్థమవుతాయి. సైన్స్ ఫిక్షన్, మిస్టరీ, హారర్, థ్రిల్లర్ అంశాలను కలిపి రూపొందించిన నో వన్ విల్ సేవ్ యు సాధారణ ఏలియన్ సినిమాల కంటే పూర్తిగా భిన్నమైన అనుభూతిని ఇస్తుంది. చివరి వరకు టెన్షన్ కొనసాగించే ఈ చిత్రం థ్రిల్లర్ అభిమానులకు తప్పకుండా నచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఊహించని ముగింపులు ఇష్టపడేవారు ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వకూడదు.

Read Also : నిబ్బా నిబ్బి లవ్ స్టోరీకి ఇంత క్రేజా… మోస్ట్ ఇన్‌స్టా ట్రెండింగ్ మలయాళం మూవీ

Related News

రియాలిటీ షోస్ నుండి యానిమేషన్ వరకు… జియోహాట్‌స్టార్ లో ఈ వారం సిరీసుల సందడి

రాచరిక ముసుగులో రాజద్రోహం… చాట్ జీపీటీ, నానో బనాన వంటి ఏఐలతో తీసిన సిరీస్

అందమైన అమ్మాయిలతో ట్రాప్ చేయించి ఇదేం పాడు పని… అనుమానంతో అరాచకం

పెళ్లి కాకుండానే పేరెంట్స్… వియ్యంకుల మధ్య మొదలైన వింత బంధం… ఫీల్ గుడ్ కొరియన్ సిరీస్ తెలుగులో

భూతాలు లేవు, దెయ్యాలు లేవు… అయినా గుండెల్లో రైళ్లు పరిగెత్తించే హారర్ థ్రిల్లర్… 7.9 రేటింగ్

వింత వింత జంతువులతో క్రేజీ అడ్వెంచర్… తెలుగులోనే ఈ కిడ్స్ అండ్ ఫ్యామిలీ ధమాకా

గంటకి 300 కిలోమీటర్ల వేగం… బుల్లెట్ ట్రెయిన్‌లో డెడ్లీ కిల్లర్స్ వేట… తెలుగులో స్ట్రీమింగ్

రోజుకొకరితో బ్లైండ్ డేట్… ట్రయాంగిల్ లవ్ స్టోరీ… ప్రేమలో గెలవడానికి ప్రాక్టికల్ చిట్కాలున్న కొరియన్ సిరీస్ తెలుగులో

Big Stories

Advertisement
×