E-Paper
Advertisement

ఊళ్ళో ఉత్సవం… కట్ చేస్తే ఖతర్నాక్ ట్విస్టులున్న కన్నడ రివేంజ్ క్రైమ్ డ్రామా

ఊళ్ళో ఉత్సవం… కట్ చేస్తే ఖతర్నాక్ ట్విస్టులున్న కన్నడ రివేంజ్ క్రైమ్ డ్రామా

Peter movie OTT : ఇటీవల విడుదలైన ఒక కన్నడ సినిమా తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకుంటోంది. ఆ సూపర్ థ్రిల్లర్ సినిమానే ‘పీటర్’. సుకేష్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ రివేంజ్ క్రైమ్ మిస్టరీ డ్రామా 2026 ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలై మంచి స్పందన అందుకుంది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీ ప్రీమియర్ అయింది.

కొడగు అందాల మధ్య దాగిన పాత పగలు

సినిమా నేపథ్యం కర్ణాటకలోని అందమైన కొడగు – కూర్గ్ ప్రాంతంలో ఉంటుంది. మడికేరి, భాగమండల పచ్చని కొండలు, మంచు కప్పిన ఆకుపచ్చ అడవులు, కురిసే వర్షాలు… ఈ అపూర్వమైన లొకేషన్ల మధ్యే తీవ్రమైన రివేంజ్ కథ సాగుతుంది. పీటర్ (రాజేష్ ధ్రువ) ఒక చెండే వాయిద్యకారుడు. జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు ఎదుర్కొని చాలా సంవత్సరాల తర్వాత తన సొంత ఊరికి తిరిగి వస్తాడు. అతను వచ్చిన సమయంలోనే ఊరిలో ప్రముఖ దేవాలయ ఉత్సవం జరుగుతుంది. ఆ ఉత్సవం సందర్భంగా అతని గతం నుంచి పాత జ్ఞాపకాలు నెమరేసుకోవాల్సి వస్తుంది. చేదు అనుభవాలతో పాటు నమ్మక ద్రోహాలు మళ్లీ ఎదురవుతాయి. ఒకప్పుడు తనను నమ్మి మోసం చేసిన వ్యక్తులు, ఊరంతా వ్యాపించిన రహస్య నేరాల నెట్‌వర్క్, హింస, పగ… అన్నీ ఒకేసారి అతని జీవితాన్ని తారుమారు చేస్తాయి. ఈ నేపథ్యంలోనే పీటర్ తన గత బాధలకు ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. కానీ ఈ ప్రయాణం అతనికి ఊహించని మలుపులు తీసుకు వస్తుంది. సస్పెన్స్, హారర్, ఎమోషన్ అన్నీ ఇందులో మిక్సయ్యి ఉంటాయి. మరి ఇంతకీ హీరో ఎలా రివేంజ్ తీర్చుకున్నాడు ? ఇంతకీ అతని గతం ఏంటి ? అనేది తెరపై చూడాల్సిన కథ.

ఈ రివేంజ్ డ్రామాలో కుటుంబం, ప్రేమ, నమ్మకం, ద్రోహం, మానవ సంబంధాల సంక్లిష్టతలను అందమైన కొడగు ల్యాండ్‌స్కేప్‌ల మధ్య చాలా సినిమాటిక్‌గా చూపించారు. హారర్ ఎలిమెంట్స్, భయపెట్టే సన్నివేశాలు, ఉద్రిక్తమైన సస్పెన్స్, యాక్షన్ సీన్స్‌తో పాటు లోతైన భావోద్వేగాలు కూడా ఇందులో ఉన్నాయి. క్లాస్ అండ్ మాస్ అంశాలు సమానంగా ఉండటం వల్ల అన్ని రకాల ప్రేక్షకులు ఈ సినిమాను ఆస్వాదించవచ్చు. రాజేష్ ధ్రువ టైటిల్ రోల్‌ లో మంచి పర్ఫార్మన్స్ ఇచ్చింది. జాన్వి రాయల్ (రాధ), రవీక్ష శెట్టి (మీరా) ముఖ్య మహిళా పాత్రలు పోషించారు. ఇతర కీలక పాత్రల్లో రామ్ నాదగౌడ, ప్రతిమా నాయక్, భరత్, వరుణ్ పటేల్, రఘు పాండేశ్వర్ తదితరులు కన్పిస్తారు.

ఏ ఓటీటీలో ఉంది ?

ఈ సినిమా థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. IMDbలో 9.2 రేటింగ్ సాధించిన ఈ మూవీ ఓటీటీలో కూడా ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది. జూన్ 5 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం కన్నడ భాషలో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది. సస్పెన్స్, మిస్టరీ, రివేంజ్, హారర్ ఎలిమెంట్స్ ఇష్టపడేవాళ్లకు ఇది సూపర్ ఛాయిస్. కొడగు అందాలు, మంచి కథ, స్ట్రాంగ్ యాక్టింగ్… మూడూ కలిసి మంచి అనుభూతి ఇస్తుంది.

Read Also : రెండేళ్ల కొడుకు ముందే తల్లి దారుణ హత్య… ఈ మినీ సిరీస్ ను డోంట్ మిస్

Related News

డివోర్స్ మహిళతో రెండో పెళ్లి… మరో మహిళతో సన్నిహితంగా… ఇదేం ఫ్యామిలీ భయ్యా

బార్‌లో మద్యం తాగుతూ భార్యలు చేసే రచ్చ… ఏ ఓటీటీలో ఉందంటే ?

‘ఏపెక్స్’ నుండి ‘ది రిప్’ వరకు… 2026లో విడుదలైన 5 కొత్త సస్పెన్స్ థ్రిల్లర్స్

ఫేక్ నోట్ల యాపారం… ప్రింటింగ్ ప్రెస్ పేరుతో వీళ్ళు చేసే పని చూస్తే బుర్రపాడు

ఉపాధ్యాయులపై దాడులు… విద్యార్థులకు బుద్ధి చెప్పే ఊర మాస్ టీచర్

Bharat Bhhagya Viddhaata OTT : 26/11 దాడి అన్ టోల్డ్ స్టోరీ… కంగనా మూవీ స్ట్రీమింగ్ డేట్

Avatar 3 OTT Release : 12,000 కోట్ల విజువల్ వండర్ ఓటీటీలోకి… రెడీ అవ్వండమ్మా

Big Stories

×