E-Paper
Advertisement

Suspense thriller OTT: నరకం చూపించే మొగుడు… ప్రియుడి కోసం ఎదురుచూపులు

Suspense thriller OTT: నరకం చూపించే మొగుడు… ప్రియుడి కోసం ఎదురుచూపులు
Advertisement

Suspense thriller OTT : ఓటీటీలో ఒక ఒడియా సస్పెన్స్ మూవీ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ఒక కొత్తగా పెళ్లయిన జంట చుట్టూ తిరుగుతుంది. వీళ్ళకి ఒక డైరీ దొరకడంతో కథ ఊహించని మలుపులు తిరుగుతుంది. ఒడియా చిత్ర పరిశ్రమలో గత 80 ఏళ్లుగా వస్తున్న మూస ధోరణిని మార్చడానికి దర్శకులు ఈ సినిమాతో ఒక కొత్త ప్రయత్నం చేశారు. స్టోరీ కూడా అంత కొత్తగా, సస్పెన్స్ తో నడుస్తుంది కూడా. ఇక ఈ సినిమాలోని విజువల్స్, కోరాపుట్ అందాలను చూపించిన విధానంపై కూడా విమర్శకుల నుండి భారీ ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే

ఈ ఒడియా సస్పెన్స్ డ్రామా చిత్రం పేరు ‘చరిత్ర’ (Charitra). శిశిర్ కుమార్ సాహు, పీనాకీ సింగ్ దర్శకత్వంలో ఇది రూపొందింది. అనన్య మిశ్రా, గార్గి మొహంతి, పార్థ సారథి రే, దీపాన్విత్ దాస్ మహాపాత్ర ఇందులో నటించారు. జెర్రీ సిల్వెస్టర్ విన్సెంట్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ చిత్రం 2021 ఏప్రిల్ 25న విడుదల అయింది. ప్రస్తుతం ఈ సినిమా Airtel Xstream Play, Jio Hotstar

స్టోరీ ఏమిటంటే

Advertisement

మధు అనే మహిళ తన భర్తతో కలిసి ఒక కొత్త ఊరికి, పాత ప్రభుత్వ క్వార్టర్స్‌లోకి మారుతుంది. అక్కడ సామాన్లు సర్దుతుండగా ఆమెకు ఒక పాత డైరీ దొరుకుతుంది. ఆ డైరీ అంతకుముందు ఆ ఇంట్లో ఉన్న కల్పన అనే మహిళది. మధు కుతూహలంతో ఆ డైరీ చదవడం మొదలుపెడుతుంది. అందులో కల్పన తన భర్త కిషోర్‌తో గడిపిన రోజులు, వారి మధ్య ఉన్న గొడవలు, ఆమెకు మరొక వ్యక్తితో జరిగిన పరిచయం ఈ విషయాలన్నీ చాలా ఆసక్తికరంగా రాసి ఉంటాయి. ఆ డైరీ చదువుతున్న కొద్దీ మధు ఆ కథలో పూర్తిగా మునిగిపోతుంది. కల్పన జీవితంలో జరిగిన సంఘటనలు మధుని బాగా ప్రభావితం చేస్తాయి.

ఎంతలా అంటే తను కూడా ఆ పాత్రలో ఉన్నట్లు ఫీల్ అవుతుంది. డైరీలో ఉన్న రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతుంటే, మధు తన సొంత వైవాహిక జీవితాన్ని కూడా కొత్త కోణంలో చూడటం మొదలుపెడుతుంది. అసలు కల్పన ఏమైంది? ఆ డైరీలో ఉన్న చివరి నిజం ఏంటి? దీని వల్ల మధు జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుంది ? అనే విషయాలతో కథ ఉత్కంఠంగా నడుస్తుంది.

Advertisement

Read Also : ప్రమాదంలో పడే ప్రేమ జంట… ఫోటోగ్రాఫర్ కి చెమటలు పట్టించే దెయ్యం… వణుకు పుట్టించే థాయ్ హారర్

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×