E-Paper
Advertisement

ఈ ఏడాది ఓటీటీలో దుమ్ము లేపుతున్న దమ్మున్న సిరీస్ లు… టీవీలకే అతుక్కుపోతున్న జనాలు

ఈ ఏడాది ఓటీటీలో దుమ్ము లేపుతున్న దమ్మున్న సిరీస్ లు… టీవీలకే అతుక్కుపోతున్న జనాలు
Advertisement

Web Series OTT : ఈ ఏడాది ఓటీటీ ప్రపంచం సరికొత్త సంచలనాలకు వేదికైంది. వెండితెరను మించి వినోదాన్ని పంచుతున్న వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను టీవీలకే హత్తుకుపోయేలా చేస్తున్నాయి. క్రైమ్ థ్రిల్లర్స్ నుండి కోర్టు రూమ్ డ్రామా వరకు ప్రతి ఒక్క సిరీస్ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ దూసుకుపోతోంది. ఈ ఏడాది దుమ్ము రేపుతున్న ఆ టాప్ సిరీస్‌ల వివరాల గురించి ఓ లుక్ వేద్దాం పదండి.

1. చిరైయా (Chiraiya)

సామాజిక అంశాల నేపథ్యంలో సాగే ఈ పవర్‌ఫుల్ డ్రామా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. 2026 మార్చి 20న JioHotstarలో విడుదలైన ఈ సిరీస్, వైవాహిక జీవితంలోని సున్నితమైన అంశాలను, ముఖ్యంగా ‘మారిటల్ రేప్’ వంటి తీవ్రమైన సమస్యను బలంగా ప్రశ్నిస్తుంది. దివ్యా దత్తా, సంజయ్ మిశ్రా వంటి దిగ్గజ నటుల నటన ఈ సిరీస్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది.

2. కోహ్రా సీజన్ 2 (Kohrra Season 2)

Advertisement

మొదటి సీజన్ సృష్టించిన ప్రభావాన్ని కొనసాగిస్తూ 2026 ఫిబ్రవరి 11న ‘కోహ్రా 2’ నెట్‌ఫ్లిక్స్‌లో అడుగుపెట్టింది. పంజాబ్ నేపథ్యంలో సాగే ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌లో బరుణ్ సోబ్తీ, మోనా సింగ్ తమ నటనతో మాయ చేశారు. మర్డర్ మిస్టరీని ఛేదించే క్రమంలో వచ్చే ఉత్కంఠభరితమైన మలుపులు ఈ సిరీస్‌ను ఒక మస్ట్ వాచ్ గా మార్చాయి.

3. తస్కరీ: ది స్మగ్లర్స్ వెబ్ (Taskaree: The Smuggler’s Web)

ఎమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ 2026 జనవరి 14న Netflix విడుదలైంది. నీరజ్ పాండే సృష్టించిన ఈ హై-స్టేక్స్ క్రైమ్ థ్రిల్లర్, అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠాలను పట్టుకునే కస్టమ్స్ ఆఫీసర్ల చుట్టూ తిరుగుతుంది. ఎమ్రాన్ హష్మీ తన కెరీర్ లోనే అత్యంత వైవిధ్యమైన పాత్రలో కనిపించి ప్రేక్షకులను అలరించారు.

4. మామ్లా లీగల్ హై సీజన్ 2 (Maamla Legal Hai Season 2) –

Advertisement

పట్పర్‌గంజ్ జిల్లా కోర్టులోని వింతైన కేసులు, నవ్వులు పూయించే సంఘటనలతో సాగే ఈ కోర్టు రూమ్ కామెడీ సీజన్ 2, 2026 ఏప్రిల్ 3న Netflix లో విడుదలైంది. వి.డి. త్యాగి పాత్రలో రవి కిషన్ తనదైన మేనరిజమ్స్‌తో మరోసారి మెప్పించారు. సీరియస్ కోర్టు డ్రామాలకు భిన్నంగా, సెటైరికల్ గా సాగుతూ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తోంది.

5. ఆస్పిరెంట్స్ సీజన్ 3 (Aspirants Season 3)

యూపీఎస్సీ (UPSC) అభ్యర్థుల చుట్టూ తిరిగే ఈ సిరీస్ మూడవ సీజన్ కోసం ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూశారు. మొదటి రెండు సీజన్లు సృష్టించిన ఇంపాక్ట్ తో, ఈ కొత్త సీజన్ కూడా ఓటీటీలో ప్రభంజనం సృష్టిస్తోంది. మార్చ్ 13 నుంచి ఈ సిరీస్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది.

కంటెంట్ లో దమ్ముంటే భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ సిరీస్‌లు నిరూపిస్తున్నాయి. ఇప్పుడు ఇంటి వద్దే కూర్చుని జనాలు తమ వీకెండ్స్‌ను ఈ అద్భుతమైన సిరీస్‌లతో గడిపేస్తున్నారు.

Read Also : కళ్ళముందే మాయమైన కొడుకు… ఓటీటీ చరిత్రలోనే అత్యంత భారీ విజయాన్ని అందుకున్న జర్మన్ యాక్షన్ థ్రిల్లర్

Tags

Related News

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

Big Stories

Advertisement
×