E-Paper
Advertisement

లాగ్ ప్రాబ్లం ఉండదు.. సూపర్‌ఫాస్ట్ రెస్పాన్స్ ఇచ్చే బెస్ట్ వైర్‌లెస్ కీబోర్డ్ కాంబోస్ ఇవే!

లాగ్ ప్రాబ్లం ఉండదు.. సూపర్‌ఫాస్ట్ రెస్పాన్స్ ఇచ్చే బెస్ట్ వైర్‌లెస్ కీబోర్డ్ కాంబోస్ ఇవే!
Advertisement

Best Gaming Accessories: డెస్క్‌టాప్ మీద చిందర వందరగా పడివున్న వైర్లను చూసినప్పుడు చాలాసార్లు చిరాకు పడుతుంటాం. గదిని ఎంత నీట్‌గా ఉంచినా.. గేమ్స్ ఆడేటప్పుడు మాత్రం కేబుల్స్ గోల వల్ల మైండ్ డిస్టర్డ్ అవుతుంటుంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకే ఇప్పుడు వైర్‌లెస్ గేమింగ్ కీబోర్డ్ అండ్ మౌస్ కాంబోస్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు వైర్‌లెస్ కీబోర్డ్స్ అంటే లేటెన్సీ ప్రాబ్లమ్స్ ఉండేవి. కానీ ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది. అసలు వైర్డు కీబోర్డ్‌లాగే సూపర్ ఫాస్ట్ రెస్పాన్స్ ఇచ్చే వైర్‌లెస్ గ్యాడ్జెట్స్ వచ్చేశాయి. కేవలం గేమింగ్ మాత్రమే కాకుండా రోజువారీ పనికి కూడా ఇవి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాయి.

గేమ్స్ ఆడేటప్పుడు మౌస్ మూవ్‌మెంట్ చాలా ముఖ్యం. దీనికోసం చిన్న సైజు కీబోర్డ్స్ బాగా హెల్ప్ అవుతాయి. 60% లేఅవుట్ ఉన్న కీబోర్డ్స్ చాలా తక్కువ స్థలం తీసుకుంటాయి. దీంతో మౌస్‌ని ఇష్టమొచ్చినట్లు మూవ్ చేయొచ్చు. ఒకవేళ నెంబర్ కీస్ అవసరం లేదు కానీ యారో కీస్ కావాలనుకుంటే 75% లేదా టీకేఎల్ మోడల్స్ బెస్ట్ ఆప్షన్. మీ డెస్క్ సైజును బట్టి దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి.

Advertisement

మార్కెట్లో కీబోర్డ్స్ చూసేటప్పుడు మెకానికల్ స్విచ్‌లు ఉన్నాయా లేదా అని చెక్ చేయడం ముఖ్యం. నిజమైన మెకానికల్ కీబోర్డ్స్ ప్రెషర్ తక్కువగా తీసుకొని చాలా ఫాస్ట్‌గా రెస్పాండ్ అవుతాయి. బడ్జెట్ తక్కువలో కావాలనుకునేవారికి మెకానికల్ ఫీల్ ఇచ్చే నార్మల్ కీబోర్డ్స్ దొరుకుతాయి. ఇవి చూడటానికి మెకానికల్లాగే ఉంటాయి కానీ, పనితీరులో కాస్త తేడా ఉంటుంది. కాబట్టి.. మీ అవసరాన్ని బట్టి దీన్ని డిసైడ్ అవ్వండి.

Also Read: ఫోన్ మార్చాలనుకుంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా ధర తగ్గిన Vivo V40e 5Gపై ఓ లుక్కేయండి!

Advertisement

గేమింగ్‌లో మిల్లీసెకన్లు కూడా చాలా కీలకం. టూ పాయింట్ ఫోర్ గిగాహెర్ట్జ్ వైర్‌లెస్ టెక్నాలజీ ఉన్న కాంబోస్ అయితే ఎలాంటి లాగ్ లేకుండా వైర్డు డివైస్ లాగే పనిచేస్తాయి. కొన్ని మోడల్స్‌లో బ్లూటూత్ ఆప్షన్ కూడా వస్తుంది. దీనివల్ల లాప్‌టాప్‌లు లేదా ట్యాబ్‌లకు కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకే యూఎస్‌బీ రిసీవర్‌తో కీబోర్డ్, మౌస్ రెండూ పనిచేసే మోడల్స్ అయితే చాలా కన్వీనియెంట్‌గా ఉంటాయి.

వైర్‌లెస్ గ్యాడ్జెట్స్‌లో బ్యాటరీ ఎంత వస్తుంది అనేది మెయిన్ పాయింట్. మార్కెట్లో 3000mah నుంచి 4000mah బ్యాటరీ కెపాసిటీ ఉన్న కాంబోస్ దొరుకుతున్నాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజుల తరబడి ఎలాంటి టెన్షన్ లేకుండా వాడొచ్చు. ముఖ్యంగా టైప్-సీ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న మోడల్స్‌ని ఎంచుకుంటే త్వరగా ఛార్జ్ అయిపోతాయి. పదే పదే కేబుల్స్ వెతుక్కాల్సిన పని ఉండదు.

మార్కెట్లో రెడ్ థండర్ వంటి బ్రాండ్స్ నుంచి ఆలా ఎఫ్ సెవెన్టీ ఫైవ్ లాంటి ప్రీమియం మోడల్స్ వరకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కాకపోతే ఏది పడితే అది కొనేయకుండా.. మీ బడ్జెట్ ఎంత? మీకు ఏ సైజు కీబోర్డ్ కంఫర్ట్ ఇస్తుంది? అనేది చూసుకోవాలి. గేమింగ్ సీరియస్‌గా ఆడేవాళ్లు మంచి స్విచ్‌లు ఉన్నవి చూసుకోవడం మంచిది. అన్నీ సరిగ్గా కుదిరితే మీ గేమింగ్ అనుభవం నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తుంది.

Also Read: బడ్జెట్ ధరలో సోనీ కొత్త హెడ్‌ఫోన్స్ లాంచ్.. బ్లూటూత్ 6.0, ఏఐ కాల్స్ ప్రత్యేకత!

Tags

Related News

Vi ధమాకా ఆఫర్లు.. రూ.599, రూ. 899 కొత్త ప్లాన్లు వచ్చేశాయ్.. రోజుకి రూ.10తో అపరిమిత బెనిఫిట్స్!

రూ.630కే పోర్టబుల్ జ్యూసర్! క్షణాల్లోనే ఫ్రెష్ జ్యూస్ రెడీ

రూ.699కే అదిరిపోయే బేస్,లాంగ్ బ్యాటరీ బ్యాకప్‌తో హెడ్‌ఫోన్స్

రూ.9,990కే..మైక్రోవేవ్ ఓవెన్!బేకింగ్,గ్రిల్లింగ్,ఎయిర్ ఫ్రైయింగ్ అన్నీ ఒకే చోట

తక్కువ నెట్‌తో హై-క్లారిటీ వీడియోస్.. యూట్యూబ్ తీసుకొస్తున్న కొత్త టెక్నాలజీ ఇదే!

రూ. 2,000లకే ఎయిర్ ప్యూరిఫైయర్.. ఐఐటీ బాంబే రీసెర్చర్ అద్భుత ఆవిష్కరణ!

ఒప్పో నుంచి మరో మాస్టర్‌పీస్.. Find X10 సిరీస్ ఫీచర్లు, ధర వివరాలపై ఓ లుక్కేయండి!

అదుర్స్ అనిపించే సౌండ్..డాల్బీ ఆడియోతో అరిపించే మోడల్

Big Stories

Advertisement
×