E-Paper
Advertisement

ప్రియాంక చోప్రా మోస్ట్ అవైటింగ్ హై-ఆక్టెన్ యాక్షన్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ షురూ

ప్రియాంక చోప్రా మోస్ట్ అవైటింగ్ హై-ఆక్టెన్ యాక్షన్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ షురూ
Advertisement

Citadel Season 2 OTT : గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సిటాడెల్ 2’ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పటికే మొదటి సీజన్ రిలీజ్ కాగా, దానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక ఈ సమ్మర్ లో ఇంట్లోనే కూర్చుని అదిరిపోయే యాక్షన్ ఎంటర్టైనర్ ను చూడాలి అనుకునే వారికి ఈ సిరీస్ సీజన్ 2 బెస్ట్ ఆప్షన్. మరి ఇది ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన అమెజాన్ ప్రైమ్ వీడియో స్పై యాక్షన్ సిరీస్ సిటాడెల్ (Citadel) సీజన్ 2. మేసన్ కేన్ (రిచర్డ్ మాడెన్), నాడియా సిన్హా (ప్రియాంక చోప్రా) చుట్టూ తిరుగుతుంది ఈ సిరీస్ కథ. ఈ సిరీస్ ప్రస్తుతం Amazon Prime Video లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంది. భారీ యాక్షన్ సీక్వెన్సులు, చేజింగ్ సీన్లు, హై-టెక్ గ్యాడ్జెట్లు ఈ సీజన్‌ లో మెయిన్ హైలెట్. దీనికి అనుబంధంగా వచ్చిన ‘సిటాడెల్: హనీ బన్నీ’ (ఇండియా), ‘సిటాడెల్: డయానా’ (ఇటలీ) సిరీస్‌లతో కూడా ఈ కథకు లింక్ ఉండడం మరో ఇంట్రెస్టింగ్ విషయం. స్పై థ్రిల్లర్లను ఇష్టపడేవారు వెంటనే ఈ సిరీస్ పై ఒక లుక్కేయండి.

కథలోకి వెళ్తే…

Advertisement

మొదటి సీజన్ చివర్లో మేసన్ కు పూర్తిగా తన గతం గుర్తొస్తుంది. తన తల్లి అయిన డెలియా స్కాట్ (మాంటికోర్ నాయకురాలు) అని తెలుస్తుంది. అలాగే స్వయంగా తానే సిటాడెల్‌ ను నాశనం చేశాననే నిజాన్ని మేసన్ అంగీకరించాల్సి వస్తుంది. ఇక సీజన్ 2 విషయానికొస్తే… దుష్ట సంస్థ మాంటికోర్ ప్రపంచాన్ని తన చేతుల్లోకి తెచ్చుకోవడానికి సిద్ధమవుతుంది. అయితే దీన్ని అడ్డుకోవడానికి సిటాడెల్ ఏజెంట్లను ఏకం చేయాలని నిర్ణయించుకుంటారు. అందుకోసం మేసన్, నాడియా, బెర్నార్డ్ ఓర్లిక్ కలిసి ప్లాన్ చేస్తారు. అందరూ కలిసి మాంటికోర్ కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలని అనుకుంటారు.

Also Read : నగరాన్ని వల్లకాడుగా మార్చే మాయరోగం… కట్ చేస్తే ఒకే ఒక్క వ్యక్తి ఒంటరి పోరాటం

Advertisement

ఇక ఈ సీజన్లో నాడియా సిన్హా గతం గురించి ఊహించని విషయాలు బయటకు వస్తాయి. ముఖ్యంగా ఆమె తండ్రి (రాయ్ కపూర్), ఆమె కూతురి రక్షణ కోసం చేసే పోరాటం కంటి రెప్ప వేయనివ్వదు. మేసన్ పట్ల అప్పటికే నమ్మకం కోల్పోయిన ఆమె, లోకాన్ని కాపాడటం కోసం అతడితోనే తిరిగి కలిసి పని చేస్తుంది.

మరోవైపు మాంటికోర్ సంస్థ ప్రపంచ దేశాల మధ్య యుద్ధాన్ని సృష్టిస్తుంది. దీన్ని క్యాష్ చేసుకోవడానికి అత్యంత ప్రమాదకరమైన బయో-వెపన్‌ టెక్నాలజీని వాడతారు. ఈ కుట్రను మేసన్ – నాడియా ఎలా ఛేదించారు ? ఎండింగ్ లో ఏం జరిగింది ? అన్నది చూసి తెలుసుకోవలసిన కథ.

Related News

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

బాడీ షేమింగ్‌ చేస్తూ వేధించిన అమ్మాయిలు… వాళ్లను కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని చూసి కూడా నోరు మెదపని బాధితురాలు! స్పానిష్‌ రివెంజ్‌ థ్రిల్లర్‌

గేమ్‌ ఆడితే మెదడునే కంట్రోల్‌ చేసే డేంజరస్ టెక్నాలజీ… సైకలాజికల్‌ సైఫై థ్రిల్లర్‌ ఓటీటీలోకి

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×