E-Paper
Advertisement

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి
Advertisement

Avatar Controversy:  ‘అవతార్’….వరల్డ్ సినిమాపై దీని ఇంపాక్ట్ అంటా ఇంతా కాదు.2009లో విడుదలైన మొదటి భాగం నుండి 2022లో వచ్చిన ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ వరకు ఈ ఫ్రాంచైజీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా వసూళ్ళ సునామీనే స్ప్రుష్టించింది. అయితే, పదేళ్లు దాటిన తర్వాత ఇప్పుడు ఈ సినిమా కాంట్రవర్సీ లో ఇరుక్కునేలా కనిపిస్తుంది. అవును..సినిమాలో బ్లూ రంగులో దగ దగ మెరిసె అందమైన వీరనారి ‘నేయ్‌తిరి’ క్యారెక్టర్ ని డిజైన్ చేయడంలో పెద్ద మోసం జరిగిందంటూ ఓ నటి కోర్టుకెక్కడం ఇప్పుడు హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా తెగ వైరల్ అవుతుంది.

జేమ్స్ కామెరాన్, వాల్ట్ డిస్నీ సంస్థలపై  కోర్టులో దావా

Advertisement

ప్రముఖ నటి క్వోరియన్కా కిల్చర్ (Q’orianka Kilcher), దర్శకుడు జేమ్స్ కామెరాన్ మరియు వాల్ట్ డిస్నీ సంస్థలపై సెన్సేషన్ కామెంట్స్ చేస్తూ కోర్టులో దావా వేసింది. తన పర్మిషన్ లేకుండా, కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా తన ముఖ కవళికలను (Biometric Identity) వాడి ‘నేయ్‌తిరి’ పాత్రను క్రియేట్ చేశారన్నది ఆమె ఆర్గ్యుమెంట్.మాములుగా సినిమాల్లో మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ వాడి నటుల ఎక్స్ప్రెషన్స్ క్యాప్చర్ చేస్తారు. కానీ ఇక్కడ కిల్చర్ ప్రమేయం లేకుండానే ఆమె పోలికలను వాడేశారనేది ప్రధాన ఆరోపణ.

2005 నాటి ఆ ఫోటోనే అసలు కారణమా?

Advertisement

అయితే ఈ కాంట్రవర్సీమూలాలు 2005వ సంవత్సరంలో ఉన్నాయి. క్వోరియన్కా కిల్చర్ ‘ది న్యూ వరల్డ్’అనే చారిత్రాత్మక చిత్రంలో ‘పోకాహోంటాస్’ పాత్రలో నటించినప్పుడు ఆమె వయసు కేవలం 14 ఏళ్లు. ఆ సమయంలో ఎల్ఏ టైమ్స్ (LA Times)పత్రికలో ప్రచురితమైన ఆమె ఫోటోను చూసిన జేమ్స్ కామెరాన్, దానికి ముగ్ధుడైపోయారట. తన డిజైన్ టీమ్‌ను పిలిచి, ఆ ఫోటోను రెఫరెన్స్‌గా ఇచ్చి “నేయ్‌తిరి ముఖం ఇలాగే ఉండాలి” అని ఆర్డర్ వేశారని కిల్చర్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తన ముఖాన్ని, తన గుర్తింపును ఒక కమర్షియల్ ప్రొడక్ట్ కోసం వాడుకుని, తనకు కనీసం క్రెడిట్ ఇవ్వలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కామెరాన్‌కు చెక్ పెట్టిన ‘సంతకం’ మరియు ‘వీడియో’

సాధారణంగా ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఆధారాలు ఉండవు. కానీ ఇక్కడ స్వయంగా జేమ్స్ కామెరాన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఈ రచ్చకి దారి తీశాయ్.గతంలో ఒక ఈవెంట్‌లో కిల్చర్‌ను కలిసినప్పుడు, నేయ్‌తిరి పాత్రకు ఆమే స్ఫూర్తి అని చెబుతూ ఒక స్కెచ్‌పై కామెరాన్ సంతకం చేసి ఇచ్చాడట కూడా. అలాగే, గతేడాది నెట్టింట హల్‌చల్ చేసిన ఒక ఇంటర్వ్యూలో కామెరాన్ మాట్లాడుతూ.. “నేయ్‌తిరి పాత్రకు మూలం క్వోరియన్కా కిల్చర్ ఫోటోనే. ఆమె ముఖంలోని కింది భాగం (Jawline) చాలా ఆసక్తికరంగా ఉంటుంది” అని ఓపెన్ గా చెప్పిన మాటలనే కిల్చర్‌ తన ఆయుధాలుగా మార్చుకుంది.

ALSO READ :నేను చేసిన ఆ ఒక్క తప్పు చిరంజీవిని నంబర్ వన్ చేసింది! శివకృష్ణ ఓపెన్ స్టేట్‌మెంట్

భారీ పరిహారం మరియు లాభాల్లో వాటా

అవతార్ సినిమా స్థానిక తెగల (Indigenous people) హక్కుల గురించి పోరాటం చేసే కథతో వచ్చింది. కానీ నిజ జీవితంలో ఒక స్థానిక తెగకు చెందిన అమ్మాయి హక్కులనే కాలరాశారని కిల్చర్ తరపు న్యాయవాదుల వాదన.ఆమె తన బయోమెట్రిక్ డేటా వాడినందుకు భారీ మొత్తంలో పరిహారంతో పాటు, ‘అవతార్’ సిరీస్ కి వచ్చిన వేల కోట్ల లాభాల్లో వాటా ఇవ్వాలని డిమాండ్ చేయడం గమనార్హం. అంతేకాదండోయ్.. గుర్తింపును దొంగిలించినందుకు బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పాలట.

టెక్నాలజీ వర్సెస్ పర్సనల్ రైట్స్ 
దీంతో సినిమాలో గ్రాఫిక్స్ అనుకున్నవన్నీ నిజంగా కేవలం కంప్యూటర్ క్రియేట్ చేసింది కాదా ?ఒక మనిషి పోలికలను కాపీ కొట్టి వేల కోట్లు గడించడం కరెక్టేనా? అన్నడిస్కషన్ ఇప్పుడు నెట్టింట్లో గట్టిగానే జరుగుతుంది. ఒకవేళ కోర్టు కిల్చర్ వైపు తీర్పు ఇస్తే, అది హాలీవుడ్ ఫ్యూచర్ పై సాలిడ్ ఇంపాక్ట్ నే చూపిస్తుంది. ఇప్పటికే AI మరియు డిజిటల్ రిప్లికాస్ పై నటులు సమ్మెలు చేస్తున్న ఈ సమయంలో  ఈ ‘అవతార్’ కాంట్రవర్సీ మరింత పాపులర్ అయిపోతుంది.చూడాలి మరి ఎవరికీ అనుకూలంగా తీర్పు వస్తుందో !

ALSO READ :నితిన్ మార్కెట్ అవుట్? భారీ బడ్జెట్‌తో రిస్క్ చేయలేక దర్శకుడికి షాక్!

Related News

పిల్లలకు పుట్టినరోజు బహుమతులు ఇవ్వడమే కాదు.. జీవితాంతం గుర్తుండిపోయేలా ఈ 7 అలవాట్లు నేర్పండి

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Big Stories

Advertisement
×