E-Paper
Advertisement

OTT Movie : ప్రియుడి కిరాతకం… ఆటో డ్రైవర్ అరాచకం… మర్డర్ కేసులో ఊహించని ట్విస్టులు

OTT Movie : ప్రియుడి కిరాతకం… ఆటో డ్రైవర్ అరాచకం… మర్డర్ కేసులో ఊహించని ట్విస్టులు
Advertisement

OTT Movie : ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ స్టోరీలను ఎక్కువగా చూస్తున్నారు ఆడియన్స్. అందులోను మలయాళం సినిమాలను అస్సలు వదిలిపెట్టడంలేదు. డిజిటల్ స్ట్రీమింగ్ కి ఎప్పుడు వచ్చినా ఓ లుక్ వేస్తున్నారు. ఓ మాదిరిగా ఉన్నా కూడా వీటికి మంచి వ్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాకి థియేటర్లలో అంతగా రెస్పాన్స్ రాకపోయినా, ఓటీటీలో కాస్త నెట్టుకోచ్చింది. ఒక అమ్మాయిపై జరిగే అఘాయిత్యం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. థ్రిల్లర్ ఫ్యాన్స్ ఈ సినిమాను ఓ సారి చూడవచ్చు. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే..

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

ఈ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘కోచిన్ షడ్డీ యాట్ చెన్నై 03’. మంజిత్ దివాకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ బైలింగ్వల్ (మలయాళం-తమిళ) చిత్రంలో ఆర్.కె. సురేష్, అక్షతా శ్రీధర్ శాస్త్రి, నెహా సక్సేనా, వినోత్ కిషన్ ముఖ్య పాత్రల్లో నటించారు. 2020 జనవరి 24న విడుదలైన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ పొందింది. ప్రస్తుతం ఈ సినిమా Amazon Prime Videoలో మలయాళం, తెలుగు, తమిళ డబ్బింగ్‌తో స్ట్రీమింగ్ అవుతోంది. 2 గంటల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమా A సర్టిఫికేట్ తో ఐయండిబిలో 5.7/10 రేటింగ్ పొందింది.

Advertisement

Read Also : అమ్మాయిల బట్టలను దొంగలించి పాడు పని… వదినతో యవ్వారం… మామూలు ఆటగాడు కాదు

స్టోరీలోకి వెళ్తే

కొచ్చిన్ లో ఒక పేద కుటుంబానికి చెందిన అక్షతా అనే యువతి, రిచ్ ప్లేబాయ్ తో ప్రేమలో పడి గర్భవతి అవుతుంది. అతను ఆమెను మోసం చేశాడని తెలుసుకుని చాలా బాధపడ్తుంది. ఈ సమస్యకి పరిష్కారం కడుపు తీయించుకోవడం తప్ప వేరే మార్గం కనిపించదు. ఇంట్లో వాళ్ళకి ఇంటర్వ్యూ కోసం వెళ్తున్నానని చెప్పి, ఒంటరిగా చెన్నైకి అబార్షన్ చేయించుకోవడానికి ట్రైన్‌లో బయలుదేరతుంది. కానీ ఆ జర్నీలో ఆమెకు ఘోర ఆపదలు ఎదురవుతాయి. ట్రైన్‌లో కొంతమంది ఆమెను వేధిస్తారు. ట్రైన్ దిగి ఆటో ఎక్కి హాస్పిటల్ కి వెళ్తుంటుంది. అయితే ఆటో డ్రైవర్ ఆమెను కిడ్నాప్ చేసి ఒక పాడు బడిన ఇంట్లోకి తీసుకెళ్తాడు. అతనితో పాటు, అతని ఫ్రెండ్స్ కూడా ఆమెపై దారుణంగా అఘాయిత్యం చేస్తారు. ఆ తరువాత స్టోరీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ తో ఊహించని మలుపులు తిరుగుతుంది. చివరికి అక్షతా ఆ దాడి నుంచి కోలుకుంటుందా ? ఇన్వెస్టిగేషన్ లో ఎలాంటి నిజాలు బయటికి వస్తాయి ? ఈ కథ ఎలా ముగుస్తుంది ? అనే విషయాలను, ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

 

 

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×