Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ హౌస్ లో అందరూ మెచ్చిన బాండింగ్స్ లో భరణి – సుమన్ శెట్టిది ఒకటి. కానీ గత రెండు మూడు ఎపిసోడ్లు చూస్తుంటే భరణి ఫ్రెండ్షిప్ పేరుతో సుమన్ ను పప్పెట్ లా వాడుకుంటున్నాడా ? అనే డౌట్ రాకమానదు. భరణి ఏం చెప్తే అది తూ. చా తప్పకుండా పాటిస్తున్నాడు సుమన్.
డే 95 ఎపిసోడ్లో లీడర్ బోర్డులో లీస్ట్ లో ఉన్న సుమన్ ను బిగ్ బాస్ ఇమ్యూనిటీ పోరు నుంచి తప్పించారు. కానీ అతని పాయింట్స్ ను షేర్ చేసుకోమంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా భరణికి ఇస్తాను అన్నాడు సుమన్. మొదటి నుంచి సుమన్ కు ఓన్ స్టాండ్ లేదు అనేది హౌస్ మేట్స్ అనే మాట. ఇప్పుడు కూడా భరణికి ఇవ్వాలనుకున్న పాయింట్స్ ను అతను చెప్పాడని, సంజనాకు ఇచ్చి స్వంత ఆలోచన లేదనే విషయాన్ని ప్రూవ్ చేసుకున్నారు సుమన్. అతను మైండ్ పెట్టి ఆలోచిస్తే సంజన రేంజ్ లో గేమ్ ఛేంజర్ అయ్యిండవచ్చు.
సాధారణంగా హౌస్ మేట్స్ అందరూ కలిసి గేమ్ స్ట్రాటజీ ప్లాన్ చేసుకుంటారు. కానీ భరణి మాత్రం సుమన్ కు ఎవరిని చేయాలో పాయింట్స్ తో సహ చెప్తాడు. అలాగే కళ్యాణ్ ను నామినేట్ చేయమని చెప్పాడు. ఒకరకంగా చెప్పాలంటే భరణి కారణంగానే ఈరోజు సుమన్ గేమ్ లో నుంచి తప్పుకున్నాడు. జంబో ప్యాంట్స్ టాస్క్ లో సుమన్ కు కళ్యాణ్ వేసిన బాల్స్ ను భరణి తీసుకున్నాడు. అప్పటికీ సుమన్ “అన్నా నాకు వేస్తున్న బాల్స్ ను కూడా మీరే క్యాచ్ పడుతున్నారు” చెబుతూనే ఉన్నాడు. ఒకానొక టైమ్ లో సుమన్ అసహనానికి కూడా గురయ్యాడు. అయితే తీరిగ్గా గేమ్ అయిపోయాక “అది ఫ్లోలో జరిగింది. ఇంకెప్పుడూ మనిద్దరం పక్కపక్కనే నిలబడి గేమ్స్ ఆడొద్దు. ఈ హౌస్ లో మనిద్దరి స్నేహం ఒక్క అపార్థం వల్ల పాడవ్వకూడదు” అంటూ సుమన్ మైండ్ ను మార్చేశాడు.
ఇక ఈరోజు అందరూ తననే టార్గెట్ చేస్తున్నారని తనూజను సపోర్ట్ అడిగాడు భరణి. కానీ ఆమె మాత్రం ఇమ్మూకి సపోర్ట్ చేస్తా అనడంతో భరణి మొహం వాడిపోయింది. అంతకు ముందు గేమ్ లో కూడా తన మాట తనూజ వినట్లేదాని, సుమన్ శెట్టితో సందేశం పంపాడు. ఏం చెప్పాలి. ఎలా చెప్పాలి అన్నది వివరంగా చెప్పి, భరణికి సపోర్ట్ చెయ్ అనే మాటను సుమన్ తో చెప్పించాడు భరణి. ఇమ్మూను, డెమోన్ ను తీద్దాం అనుకున్న ప్రతిసారీ తనూజ అడ్డు పడింది. దీంతో ఆ కోపాన్ని భరణి కళ్యాణ్ పై తీశాడు.
“కళ్యాణ్ నీకోసం కొన్ని సందర్భాల్లో నిలబడడం కరెక్ట్ అన్పించడానికైనా నువ్వు నాకోసం ఒక్కసారి అయినా నిలబడాల్సింది” అని డైరెక్ట్ అటాక్ చేశాడు భరణి. “నాకూ అదే బాధగా ఉంది. మీరెప్పుడు రాంగ్ ప్లేస్ లోనే ఉంటున్నారు” అని నెమ్మదిగా సమాధానం చెప్పాడు కళ్యాణ్.
Read Also : భరణి గాలి తీసేసిన తనూజ… ఆడియన్స్ చేతిలో అడ్డంగా బుక్… అంతమాట అనేసిందేంటి భయ్యా