E-Paper
Advertisement

Comedy adventure OTT : ఓటీటీలోకి విపుల్ విగ్ ఫాంటసీ కామెడీ ‘రాహు కేతువు’… మ్యాజిక్ బుక్ తో నవ్వులే నవ్వులు

Comedy adventure OTT : ఓటీటీలోకి విపుల్ విగ్ ఫాంటసీ కామెడీ ‘రాహు కేతువు’… మ్యాజిక్ బుక్ తో నవ్వులే నవ్వులు
Advertisement

Comedy adventure OTT : ఓటీటీలోకి ఒక సరి కొత్త కామెడీ అడ్వెంచర్ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చింది. థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు డిజిటల్ ఆడియన్స్ ను పలకరిస్తోంది. ఒక మ్యాజిక్ బుక్ చుట్టూ తిరిగే ఈ కథలో కావాల్సినంత కామెడీ కూడా ఉంటుంది. సుమారు 2 గంటల 20 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాకి, ఐయండిబిలో 8.2 /10 రేటింగ్ ఉండటం విశేషం. ఈ బాలీవుడ్ కామెడీ మూవీతో ఈ వీకెండ్ మస్తు మజా చేసుకోవచ్చు.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

విపుల్ విగ్ దర్శకత్వంలో వచ్చిన ఈ హిందీ కామెడీ అడ్వెంచర్ సినిమా పేరు ‘రాహు కేతు’ (Rahu Ketu). 2026 జనవరి16న విడుదలైన ఈ సినిమాలో వరుణ్ శర్మ రాహు పాత్రలో, పుల్కిత్ సామ్రాట్ కేతువు పాత్రలో నటించారు. వీరితో పాటు షాలిని పాండే, చుంకీ పాండే, పియూష్ మిశ్రా ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, బిలైవ్ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో ఉమేష్ కుమార్ బన్సాల్, ప్రగతి దేశ్‌ముఖ్, సూరజ్ సింగ్, వర్ష కుక్రేజా నిర్మించారు.ఈ ఏడాది జనవరి 16 న ఈ సినిమా థియేటర్లలో అడుగుపెట్టి, మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చింది. కానీ ప్రస్తుతం ఇది అద్దెకు అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

చురు లాల్ శర్మ అనే ఒక రచయిత తన మ్యాజిక్ బుక్ లో రాహు, కేతు అనే ఇద్దరు వింత పాత్రలను సృష్టిస్తాడు. అయితే ఊహించని విధంగా ఆ నోట్‌బుక్ లోంచి, ఆ ఇద్దరు పాత్రలు బయటకు వచ్చి నిజమైన మనుషుల మధ్య పడతారు. ఈ ఆధునిక ప్రపంచం గురించి ఏమాత్రం తెలియని ఆ ఇద్దరూ చేసే పనులు, పడే తిప్పలు ప్రేక్షకులకు నవ్వు తెప్పిస్తుంటాయి. కథలో అసలైన మలుపు ఏమిటంటే, ఆ రచయిత దగ్గర ఉన్న మ్యాజిక్ బుక్ ఒక డ్రగ్ మాఫియా గ్యాంగ్ చేతిలో పడుతుంది. ఆ పుస్తకం లేకపోతే రాహు-కేతులిద్దరూ తిరిగి తమ లోకానికి వెళ్లలేరు.

దీంతో ఆ రచయిత, ఈ ఇద్దరు కలిసి ఆ పుస్తకాన్ని తిరిగి దక్కించుకోవడానికి ఒక సాహస యాత్ర మొదలుపెడతారు. దారి పొడవునా రౌడీల నుండి తప్పించుకుంటూ, ఆ పుస్తకం కోసం వీర ప్రయత్నం చేస్తారు. చివరికి తమలో కూడా కొన్ని అద్భుతమైన శక్తులు ఉన్నాయని రాహు-కేతు గ్రహిస్తారు. ఆ శక్తులతో విలన్లను ఎలా ఎదుర్కొన్నారు ? చివరకు రచయిత తన మ్యాజిక్ బుక్‌ను తిరిగి ఎలా దక్కించుకున్నాడు ? అనే విషయాలతో ఈ సినిమా ఆసక్తికరమైన ముగింపును ఇస్తుంది.

Advertisement

Read Also : అలాంటి పనోడికి నా కూతురు కావాలా ? ఆటో డ్రైవర్ గంతులు… ప్రియుడికి చెప్పుకోలేని కష్టాలు

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×