E-Paper
Advertisement

Romantic comedy OTT : అలాంటి పనోడికి నా కూతురు కావాలా ? ఆటో డ్రైవర్ గంతులు… ప్రియుడికి చెప్పుకోలేని కష్టాలు

Romantic comedy OTT : అలాంటి పనోడికి నా కూతురు కావాలా ? ఆటో డ్రైవర్ గంతులు… ప్రియుడికి చెప్పుకోలేని కష్టాలు
Advertisement

Romantic comedy OTT : కంటెంట్ ఉండాలి కానీ భాషతో సంబంధం లేకుండా రెస్పాన్స్ ఇస్తూంటారు ప్రేక్షకులు. కొన్ని సినిమాలు వందల కోట్లు పెట్టినా రెస్పాన్స్ రాలేక నష్టాలతో కోలుకోలేకపోతుంటారు నిర్మాతలు. అయితే మరికొన్ని సినిమాలు, చాలా తక్కువ బడ్జెట్ తోనే కోట్లు కొల్లగొడుతుంటాయి. ఈ నేపథ్యంలో మనం ఒక గుజరాతి మూవీ గురించి చెప్పుకోవాల్సిందే. ఈ సినిమా తక్కువ బడ్జెట్ తో అక్కడ సూపర్ హిట్ అయింది. పబ్లిక్ టాయిలెట్‌ను నడిపే ఒక యువకుడు, తాను ప్రేమించిన అమ్మాయిని ఎలా గెలుచుకుంటాడనేదే ఈ కథ. ఈ స్టోరీ సరదాగా సాగిపోతూ, కడుపుబ్బ నవ్విస్తుంది కూడా.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

ఈ గుజరాతీ సూపర్ హిట్ రొమాంటిక్ కామెడీ మూవీ పేరు ‘కర్సందాస్ పే & యూజ్’ (Karsandas Pay & Use). దీనికి కృష్ణదేవ్ యాగ్నిక్ దర్శకత్వం వహించగా, నిలయ్ చోటాయ్, వైశాల్ షా నిర్మించారు. ఈ చిత్రంలో మయూర్ చౌహాన్, దీక్షా జోషి, హేమాంగ్ షా ప్రధాన పాత్రలు పోషించారు. ఇది 2017 మే 19న థియేటర్లలో విడుదలైంది. సుమారు ₹1 కోటి బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద ₹8 కోట్లకు పైగా వసూళ్లు సాధించి పెద్ద విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ZEE5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంది

స్టోరీ ఏమిటంటే

Advertisement

తిలోక్ అనే కుర్రాడు తన తమ్ముడితో కలిసి ఒక పబ్లిక్ టాయిలెట్ దగ్గర టిక్కెట్లు ఇస్తూ జీవనం గడుపుతుంటాడు. పొద్దున్నే లేస్తే ఆ కంపులో, ఆ చుట్టుపక్కలే వాళ్ల లోకం. ఊర్లో వాళ్లంతా వీళ్ళని కాస్త తక్కువగా చూసినా, తిలోక్ మాత్రం తన పనేదో తాను చేసుకుంటూ హుందాగా బతుకుతుంటాడు. ఇలాంటి టైంలోనే ఆ ఏరియాలోకి వచ్చిన జయ అనే పిల్లను చూసి మనోడు ఫ్లాట్ అయిపోతాడు. మెల్లగా ఆ పిల్ల కూడా తిలోక్ మంచితనం చూసి ఇష్టపడుతుంది.

కానీ సీన్లోకి జయ తండ్రి ఎంటర్ అవుతాడు. ఆయన ఒక ఆటో రిక్షా డ్రైవర్. మేమే కింది స్థాయిలో ఉన్నాం.. ఇప్పుడు నా కూతుర్ని ఈ పాకీ పని చేసే వాడికి ఇస్తానా అని గొడవ మొదలుపెడతాడు. నీ దగ్గర ఏముందని నా పిల్లని ఇయ్యాలి అని తిలోక్‌ను అందరి ముందు అవమానిస్తాడు కూడా. ఆ మాటలతో తిలోక్ పంతానికి వెళ్తాడు. తన పనిని ఎవరైతే ఛీత్కరించుకున్నారో, అదే పనితో తన గొప్పతనం ఏంటో నిరూపిస్తానని జయ తండ్రికి సవాలు విసురుతాడు. తిలోక్ ఆ తరువాత ఏం చేశాడు ? జయ తండ్రిని ఎలా ఒప్పించాడు ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also : జంటను వెంటాడే పుస్తకం… నెంబర్ గేమ్ తో మలుపులు… ఇంటెన్స్ గా సాగే స్టోరీ

Tags

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×