E-Paper
Advertisement

Kshetrapati OTT : రైతు ఆత్మహత్యలపై మూవీ… థియేటర్లలో విడుదలైన రెండున్నర ఏళ్ల తర్వాత ఎట్టకేలకు ఓటీటీలోకి

Kshetrapati OTT : రైతు ఆత్మహత్యలపై మూవీ… థియేటర్లలో విడుదలైన రెండున్నర ఏళ్ల తర్వాత ఎట్టకేలకు ఓటీటీలోకి
Advertisement

Kshetrapati OTT : రైతు ఆత్మహత్యల నేపథ్యంలో తెరకెక్కిన కన్నడ సినిమా ‘క్షేత్రపతి’ (Kshetrapati). థియేటర్లలో విడుదలైన రెండున్నర సంవత్సరాల తర్వాత ఓటీటీలోకి అడుగుపెడుతోంది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా విజయం సాధించలేదు. కానీ దేశవ్యాప్తంగా రైతులను పీడిస్తున్న సమస్యలను హైలైట్ చేయడంతో ఈ సినిమా ప్రశంసలు అందుకుంది. పెట్టుబడిపై రాబడి తక్కువగా ఉండటంతో అప్పులు కూడా పెరుగుతున్నందున, పరిస్థితిని తట్టుకోలేక ఎందరో రైతులు ప్రాణాలను తీసుకున్నట్లు వార్తలు అప్పుడప్పుడు వస్తూనే ఉన్నాయి కూడా. మరి ఈ సమస్యలను ఎత్తి చూపే ఈ సోషల్ మెసేజ్ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే..

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

నూతన దర్శకుడు శ్రీకాంత్ కటగి దర్శకత్వం వహించిన ‘క్షేత్రపతి’ లో నవీన్ శంకర్ కథానాయకుడి పాత్రలో నటించారు. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో అర్చన జోయిస్, హర్ష్ అర్జున్, రాహుల్ ఐనాపూర్, అచ్యుత్ కుమార్, కృష్ణ హెబ్బాలే, నాట్య రంగ తదితరులు కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. నవీన్ చివరిసారిగా 2025లో వచ్చిన ‘నోడిదవారు ఎనంటారే’ చిత్రంలో కనిపించాడు. ఈ సినిమాలో కూడా ఆయన నటనకు ప్రశంసలు అందుకున్నారు. యష్ నటించిన టాక్సిక్ సినిమాలో ఆయన కూడా ఒక పాత్రలో ఉన్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ఇప్పుడు జియో హాట్‌స్టార్ (jiohotstar) తీసుకుంది. 2026 ఫిబ్రవరి 26 నుంచి అంటే ఈ రోజే ఇది స్ట్రీమింగ్ అవుతోంది.

కథ ఏమిటంటే

Advertisement

బసవ (నవీన్ శంకర్) అనే కుర్రాడు ఇంజనీరింగ్ చదువుకుంటూ సిటీలో లైఫ్ ఎంజాయ్ చేస్తుంటాడు. అంతా బాగుందనుకున్న సమయంలో, తన తండ్రి అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసి ఊరికి వస్తాడు. కేవలం తన తండ్రే కాదు, ఊర్లో చాలా మంది రైతులు ఇదే పరిస్థితిలో ఉన్నారని, వ్యవస్థలోని లోపాల వల్ల వాళ్ళు ఎలా మోసపోతున్నారో చూసి బసవ చలించిపోతాడు. దీంతో తన కెరీర్‌ను వదిలేసి, ఆ రైతులకు న్యాయం చేయాలని నిర్ణయించుకుంటాడు. బసవ ఒక సామాన్య యువకుడి నుండి వ్యవస్థను ప్రశ్నించే నాయకుడిగా ఎలా ఎదిగాడనేది ఈ సినిమా కథ. భూమిని నమ్ముకున్న రైతుల కష్టాలను, నాయకులు మరియు కార్పొరేట్ సంస్థల దోపిడీని ఎదిరిస్తూ అతను చేసే పోరాటం చాలా ఆవేశంగా సాగుతుంది. రైతుల పోరాటంలో జర్నలిస్ట్ భూమిక (అర్చన జోయిస్) అతనికి ఎలా తోడైంది ? చివరికి అతను రైతులకు గిట్టుబాటు ధరను అందించగలిగాడా ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : మాఫియాను ముప్పతిప్పలు పెట్టే లాయర్… ఐయండిబిలో 8.4 రేటింగ్…వ్యూస్ లో కూడా టాప్

Tags

Related News

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×