E-Paper
Advertisement

కళ్ళు చెదిరే క్లైమాక్స్ తో మెంటలెక్కించే మూవీ… ఐయండిబీలో 8.2 రేటింగ్

కళ్ళు చెదిరే క్లైమాక్స్ తో మెంటలెక్కించే మూవీ… ఐయండిబీలో 8.2 రేటింగ్
Advertisement

Crime Thriller on OTT : ఒక అదిరిపోయే క్రైమ్ థ్రిల్లర్ చూడాలనుకుంటే, వీకెండ్ లో ఈ సినిమాపై ఓ లుక్ వేయండి. దీని క్లైమాక్స్ చూస్తే మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. అలాగే ఇది మనసును కదిలించే ఒక ఎమోషనల్ డ్రామా కూడా. పాతికేళ్ల కిందట జరిగిన ఒక హత్య చుట్టూ తిరిగే ఈ సినిమాలో.. ఒకవైపు హంతకుడిని పట్టుకోవాలనే ఉత్కంఠ, మరోవైపు హీరోకి తన పై ఆఫీసర్ మీద ఉన్న ప్రేమ చాలా నేచురల్‌గా కనిపిస్తాయి. సినిమా మొదట్లో నార్మల్ ఇన్వెస్టిగేషన్ లాగే అనిపించినా, క్లైమాక్స్‌లో వచ్చే ఆ షాకింగ్ ట్విస్ట్ మాత్రం ఎవరూ ఊహించలేరు. ఆస్కార్ గెలిచిన ఈ సినిమాకు ఐయండిబిలో 8.2 రేటింగ్ కూడా ఉంది.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ 

ఈ క్రైమ్ థ్రిల్లర్ అర్జెంటీనా సినిమా పేరు ‘ది సీక్రెట్ ఇన్ దేర్ ఐస్’ (The Secret in Their Eyes). 2009లో వచ్చిన ఈ సినిమాను జువాన్ జోస్ కాంపనెల్లా నిర్మించి దర్శకత్వం వహించారు. ఇందులో రికార్డో డారిన్, సోలెడాడ్ విల్లామిల్, పాబ్లో రాగో, జేవియర్ గోడినో, గిల్లెర్మో ఫ్రాన్సెల్లా నటించారు. ఈ చిత్రం 2010లో ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా (Best Foreign Language Film) అకాడమీ అవార్డును గెలుచుకుంది. ప్రధాన పాత్రధారి రికార్డో డారిన్ తన కళ్ళతోనే భావాలను పలికించి ప్రేక్షకులను కట్టిపడేశారు. ఇక ఈ సినిమాలోని స్టేడియం సీన్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. కిల్లర్ ని పట్టుకునే క్రమంలో ఫుట్‌బాల్ స్టేడియంలో షూట్ చేసిన ఐదు నిమిషాల సింగిల్ టేక్ షాట్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఇదే కథతో 2015లో హాలీవుడ్‌లో జూలియా రాబర్ట్స్, నికోల్ కిడ్మాన్‌లతో ‘Secret in Their Eyes’ పేరుతో రిమేక్ చేశారు. కానీ ఒరిజినల్ సినిమాకే ఎక్కువ ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం ఈ సినిమా ప్రైమ్ వీడియోలో అద్దెకు అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే 

Advertisement

బెంజమిన్ అనే ఒక ఇన్వెస్టిగేటర్ రిటైర్ అయ్యాక, పాతికేళ్ల క్రితం తనను బాగా కలిచివేసిన ఒక యువతి హత్య కేసు గురించి నవల రాయడం మొదలుపెడతాడు. అప్పట్లో ఆ కేసును ఛేదించే క్రమంలో తన పై అధికారి ఐరీన్‌తో ప్రేమలో పడతాడు బెంజమిన్. కానీ అది ఎప్పటికీ ఆమెకు చెప్పలేక పోతాడు. ఆ హత్య వెనుక ఉన్న హంతకుడి కోసం బెంజమిన్ తన తెలివితో ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. అయితే క్లూ ఒక పాత ఫోటోలో కనిపెడతాడు. ఒక వ్యక్తి చనిపోయిన అమ్మాయిని అదేపనిగా చూస్తున్నట్లు అందులో ఉంటుంది. ఇక వాడే హంతకుడని బెంజమిన్ పసిగడతాడు. ఒక ఫుట్‌బాల్ స్టేడియంలో ఉత్కంఠభరితమైన పోరాటం తర్వాత వాడిని పట్టుకుంటారు.

అయితే అప్పటి రాజకీయ ప్రభావం వల్ల ఆ నేరస్థుడు శిక్ష పడకుండానే బయటకు వచ్చి స్వేచ్ఛగా తిరుగుతుంటాడు. ఆ సమయంలో ఏమీ చేయలేక బెంజమిన్ నిరాశతో ఆ ఊరు వదిలి వెళ్ళిపోతాడు. పాతికేళ్ల తర్వాత, ఆ హత్యకు గురైన అమ్మాయి భర్త మొరాలెస్ దగ్గరకు బెంజమిన్ వెళ్తాడు. అప్పుడు ఒక భయంకరమైన నిజం బయటపడుతుంది. ఈ ట్విస్ట్ చూసే ఆడియన్స్ కి కూడా మతిపోయేలా చేస్తుంది. చట్టం శిక్షించలేకపోయినా, మొరాలెస్ ఆ హంతకుడిని సీక్రెట్ గా పట్టుకొని, తన ఇంటి వెనుక ఒక చిన్న గదిలో బందీగా ఉంచుతాడు. చంపకుండా, ఏ ఒక్కరితోనూ మాట్లాడకుండా పాతికేళ్లుగా వాడికి జీవచ్ఛవంలా నరకం చూపిస్తుంటాడు. ఈ క్లైమాక్స్ చూసిన బెంజమిన్ కి కూడా మైండ్ బ్లాక్ అవుతుంది.

Advertisement

Read Also : రెండువందల ఏళ్ల రాక్షసుడితో కాంట్రాక్ట్ మ్యారేజ్… ప్రతి ఎపిసోడ్ పిచ్చెక్కించే రొమాంటిక్ సిరీస్

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×