E-Paper
Advertisement

నిద్రలో వచ్చే నిజమైన కలలు… ఫ్యూచర్‌ ముందే చూస్తూ విలన్లకు చుక్కలు చూపించే మైండ్ బ్లోయింగ్ కే డ్రామా

నిద్రలో వచ్చే నిజమైన కలలు… ఫ్యూచర్‌ ముందే చూస్తూ విలన్లకు చుక్కలు చూపించే మైండ్ బ్లోయింగ్ కే డ్రామా
Advertisement

Fantasy Romantic thriller OTT : కొరియన్ సిరీస్ లు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ పెంచుకున్నాయి. మన తెలుగు ప్రేక్షకులైతే మేము కూడా కొరియా వాళ్ళమే అన్నట్లు, వీటిని తెగ చూసేస్తున్నారు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే కొరియన్ సరీస్ ను చూస్తే వీటికి అతుక్కుపోవడంలో తప్పులేదనిపిస్తుంది. దీనికి ఐయండిబిలో 8.3 రేటింగ్ కూడ ఉంది. భవిష్యత్తులో జరిగే సంఘటనలను ముందే కలలో చూడటం అనే ఫాంటసీ పాయింట్‌తో కథ నడుస్తుంది. ఆ కలలను ఆపడానికి హీరో, హీరోయిన్లు చేసే ప్రయత్నాలు ప్రతి ఎపిసోడ్ లో ఉత్కంఠను కలిగిస్తాయి. ఒక ప్రమాదం నుండి తప్పించుకుంటే అది మరొకరికి ఎలా షిఫ్ట్ అవుతుందనే అంశం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సీరియస్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌ను అందమైన ప్రేమకథతో కలిపి చూపించిన సిరీస్ ఇది.

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ ఫాంటసీ రొమాంటిక్ థ్రిల్లర్ సిరీస్ పేరు ‘వైల్ యు వర్ స్లీపింగ్’ (While You Were Sleeping). 2017 లో వచ్చిన ఈ సిరీస్ లో లీ జోంగ్-సుక్, బే సుజీ, జంగ్ హే-ఇన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ వెనుక ఉన్న క్రేజ్ అంతా దాని రైటర్ పార్క్ హే-ర్యూన్, హీరో లీ జోంగ్-సుక్ కాంబినేషన్ వల్లే వచ్చింది. వీరిద్దరూ కలిసి అంతకుముందు చేసిన ‘పినోచియో’, ‘ఐ హియర్ యువర్ వాయిస్’ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో, ఈ డ్రామాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అలాగే ఇందులో పోలీస్ ఆఫీసర్‌గా నటించిన జంగ్ హే-ఇన్ కి ఈ డ్రామా ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. ఈ సిరీస్ విడుదలయ్యాక అతనికి “సెకండ్ లీడ్ సిండ్రోమ్” (ప్రేక్షకులు మెయిన్ హీరో కంటే సెకండ్ హీరోని ఎక్కువగా ఇష్టపడటం) తో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. 16 ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్ Viki, Netflix లో చూడవచ్చు.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

హీరోయిన్ హాంగ్-జూకి ఒక వింత సమస్య ఉంటుంది. ఆమెకు నిద్రలో వచ్చే కలలన్నీ నిజమైపోతుంటాయి. ముఖ్యంగా ఎవరైనా చనిపోతారంటే అది పక్కాగా జరిగిపోతుంది. కానీ ఆ చావులను ఆపలేక ఆమె చాలా బాధపడుతుంటుంది. అప్పుడే ఆమె లైఫ్‌లోకి హీరో జే-చాన్ వస్తాడు. అతను ఒక ప్రాసిక్యూటర్. అనుకోకుండా హీరోకి కూడా ఇలాంటి కలలు రావడం మొదలవుతాయి. వీరిద్దరితో పాటు ఒక పోలీస్ ఆఫీసర్ కూడా తోడవుతాడు. ఈ ముగ్గురికీ భవిష్యత్తులో జరగబోయే ప్రమాదాలు ముందుగానే కలలో కనిపిస్తుంటాయి.

ఈ ముగ్గురూ కలిసి తమ కలలో కనిపించే చావులను, యాక్సిడెంట్లను ఆపడానికి గట్టిగా ట్రై చేస్తారు. ఒకరు ప్రాసిక్యూటర్, ఒకరు పోలీస్, ఒకరు రిపోర్టర్ కావడంతో ఇన్వెస్టిగేషన్ ఈజీ అవుతుంది. అయితే ఒకసారి జరగాల్సిన దాన్ని వీళ్ళు మార్చేస్తే, దాని వల్ల ఇంకొకరికి ప్రమాదం వచ్చే ఛాన్స్ ఉంటుందని అర్థమవుతుంది. అయినా సరే వెనక్కి తగ్గకుండా, ఆ ప్రమాదాల వెనుక ఉన్న కారణాలను కనిపెట్టి, విధిని మార్చడానికి వీళ్ళు చేసే ప్రయత్నాలు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి.

Advertisement

ఇక కథలో అసలైన విలన్ ఒక లాయర్. అతను చాలా తెలివైనోడు, తప్పు చేసినోళ్లను కూడా తన తెలివితేటలతో కాపాడేస్తుంటాడు. వాడు చేసే కుట్రల వల్ల హీరో, హీరోయిన్లు చాలా ఇబ్బందులు పడతారు. ఈ ప్రాసెస్ లోనే హీరో, హీరోయిన్ల మధ్య లవ్ స్టోరీ కూడా నడుస్తుంది. చివరికి వీళ్ళు ఆ విలన్‌కి ఎలా బుద్ధి చెప్పారు ? ఆ వింత కలల నుండి ఎలా బయటపడ్డారు ? అనేదే ఈ క్లైమాక్స్.

Read Also : ఇళయరాజా సంగీత సారథ్యంలో వివాదాస్పద రొమాంటిక్ సినిమా… అన్నీ అలాంటి సీన్లే

Tags

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×