E-Paper
Advertisement

 పత్రిక మూతపడే ముప్పులో పడ్డా వెనక్కి తగ్గని రిపోర్టర్లు… న్యూస్‌రూమ్‌ థ్రిల్లర్ ను డోంట్ మిస్

 పత్రిక మూతపడే ముప్పులో పడ్డా వెనక్కి తగ్గని రిపోర్టర్లు… న్యూస్‌రూమ్‌ థ్రిల్లర్ ను డోంట్ మిస్
Advertisement

Comedy Journalism Series: ఒకప్పుడు పేపర్ అమ్మకాలు పడిపోవడంతో మూతపడే పరిస్థితికి వచ్చిన ఓ లోకల్ న్యూస్‌ పేపర్‌ కి అవార్డు వస్తే ? ఆ విజయంతో మరింత పెద్ద వార్తను బయట పెట్టాలని జర్నలిస్టులు రంగంలోకి దిగితే ? కానీ వాళ్లు తవ్వుతున్న కథ వెనుకే ఊహించని ప్రమాదం దాగి ఉంటే ? మరోవైపు ఆఫీస్‌ లో బాస్ చేసే హంగామా, ఉద్యోగుల మధ్య గొడవలు, ప్రేమాయణాలు అన్నీ కలిస్తే ? ఇలాంటి కామెడీ, జర్నలిజం, ఆఫీస్ డ్రామాను కలిపి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్న సిరీసే The Paper Season 2. మరి ఈసారి Toledo Truth Teller టీమ్ ఎలాంటి కథను బయటకు తీసుకొచ్చింది ? తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

అమెరికాలోని ఒహియోలో ఉన్న టోలేదో ట్రూత్ టెల్లర్ అనే లోకల్ వార్తాపత్రికే ఈ కథకు కేంద్రం. నష్టాల్లో నడుస్తున్న ఈ పేపర్‌ ను నిలబెట్టడానికి అక్కడి ఉద్యోగులు పడే పాట్లు ఇప్పటికే కామెడీగా సాగుతుంటాయి. అయితే సీజన్ 2లో ఈ టీమ్‌ కు అనుకోని గుర్తింపు వస్తుంది. వారి జర్నలిస్టిక్ పనికి Ohio Journalism Awards దక్కుతాయి. ఈ విజయం పేపర్‌ పై అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

Advertisement

ఇక ఎడిటర్ – ఇన్ – చీఫ్ నెడ్ సాంప్సన్‌ కు ఇదే సరైన అవకాశం అనిపిస్తుంది. పేపర్‌ కు మరింత పేరు తీసుకురావాలంటే ఒక పెద్ద ఇన్వెస్టిగేటివ్ స్టోరీ కావాలని నిర్ణయించుకుంటాడు. అలా స్థానికంగా ప్రభావం ఉన్న ఓ ప్రైవేట్ క్లబ్‌ పై అతని దృష్టి పడుతుంది. అక్కడ జరుగుతున్న వ్యవహారాల వెనుక ఏదో అనుమానాస్పద సంఘటన ఉందని భావించిన నెడ్ టీమ్‌ తో కలిసి అసలు నిజాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తాడు.

కానీ పెద్ద సంస్థలపై లేదా ప్రభావవంతమైన వ్యక్తులపై జర్నలిజం చేయడం అంత ఈజీ కాదు. నిజం కోసం వెతుకుతున్న కొద్దీ రిస్క్ కూడా పెరుగుతుంది. ఇదే సమయంలో న్యూస్‌ రూమ్‌ లోని వ్యక్తిగత సమస్యలు కూడా కథకు కామెడీని జోడిస్తాయి. ఆఫీస్ హెడ్ ఎస్మెరాల్డా గ్రాండ్ తనదైన స్టైల్లో చేసే హంగామా ఒకవైపు నవ్విస్తే… రిపోర్టర్ మేర్‌ తో నెడ్‌ కు చిగురించే ప్రేమ మరోవైపు కొత్త చిక్కులు తెస్తుంది. ఇలా ఇన్వెస్టిగేషన్, ఆఫీస్ పాలిటిక్స్, వ్యక్తిగత సంబంధాలు అన్నీ ఒకేసారి నడుస్తుండటంతో ‘ది పేపర్ సీజన్ 2’ మరింత ఎంటర్‌టైనింగ్‌ గా మారుతుంది. ఆధునిక మీడియా వ్యవస్థ, జర్నలిస్టుల పని విధానం, న్యూస్‌ రూమ్‌ లోని పరిస్థితులను సీరియస్‌ గా కాకుండా వ్యంగ్యంగా చూపించడం ఈ సీజన్ ప్రత్యేకత.

తెలుగులో చూడొచ్చా ?

Advertisement

‘ది పేపర్ సీజన్ 2’ ప్రస్తుతం JioHotstarలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది ది ఆఫీసు ఫ్రాంచైజీ నుంచి వచ్చిన స్పిన్-ఆఫ్ సిరీస్. గ్రెగ్ డానియల్స్, మైఖేల్ కోమన్ రూపొందించిన ఈ సీజన్‌ లో మొత్తం 10 ఎపిసోడ్లు ఉన్నాయి. అయితే భారతదేశంలో ఈ సిరీస్‌ కు తెలుగు ఆడియో అందుబాటులో లేదు. ఇంగ్షీషు ఆడియోతో పాటు ఇంగ్షీషు సబ్ టైటిల్స్ సహాయంతో చూడాల్సి ఉంటుంది. ‘ది ఆఫీస్’ తరహా మాక్యుమెంటరీ కామెడీ, ఆఫీస్ హ్యూమర్, జర్నలిజంతో ఈ సిరీస్ మంచి టైంపాస్ అవుతుంది.

Read Also: పెళ్లి కాకుండానే పేరెంట్స్… వియ్యంకుల మధ్య మొదలైన వింత బంధం… ఫీల్ గుడ్ కొరియన్ సిరీస్ తెలుగులో

Tags

Related News

కారు సీటు కిందే బాంబు… డ్రైవింగ్ ఆపితే ప్రాణాలు గాల్లో… 90 నిమిషాల సీట్ ఎడ్జ్ యాక్షన్ థ్రిల్లర్

అపార్ట్‌మెంట్ మెట్లపై అబ్బాయి మిస్సింగ్… ఒక్కో ట్విస్ట్ ఉంటది భయ్యా

బాయ్స్ టీమ్‌కు కెప్టెన్ గా అమ్మాయి… క్రేజీ యూత్ ఫుల్ స్పోర్ట్స్ డ్రామా

పక్కింటి గోలతో కడుపుబ్బా నవ్వించే కామెడీ… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న హిందీ కామెడీ డ్రామా

రియాలిటీ షోస్ నుండి యానిమేషన్ వరకు… జియోహాట్‌స్టార్ లో ఈ వారం సిరీసుల సందడి

రాచరిక ముసుగులో రాజద్రోహం… చాట్ జీపీటీ, నానో బనాన వంటి ఏఐలతో తీసిన సిరీస్

అందమైన అమ్మాయిలతో ట్రాప్ చేయించి ఇదేం పాడు పని… అనుమానంతో అరాచకం

Big Stories

Advertisement
×