Travis Head On 2023 WC final: 2023 వన్డే ప్రపంచ ఫైనల్ (2023 ODI World Cup Final) విజేతగా ఆస్ట్రేలియా నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్స్ దాకా వెళ్ళిన టీమిండియా.. ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడిపోయింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ లో బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో రాణించిన ఆస్ట్రేలియా ప్రపంచ కప్ విజయతగా నిలిచింది. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ గురించి తాజాగా ఆస్ట్రేలియా డేంజర్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ (Travis Head ) సంచలన వ్యాఖ్యలు చేశారు. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లో టీం ఇండియా గెలిచేలా కొంత మంది కుట్రలు చేసినట్లు తమకు అనిపించిందని బాంబు పేల్చారు. అక్కడ పరిస్థితులను మొత్తం ఇండియాకు అనుకూలంగా మలిచారని అనుమానాలు వ్యక్తం చేశారు (Travis Head On 2023 WC final) ట్రావిస్ హెడ్. కానీ అదృష్టవ శాత్తు ఫైనల్స్ లో తమ జట్టు గెలిచిందని వ్యాఖ్యానించారు. దీంతో ట్రావిస్ హెడ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
2023 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ (2023 ODI World Cup Final) గురించి ఆస్ట్రేలియా డేంజర్ ఆటగాడు ట్రావిస్ హెడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ జరగగా.. లక్షకు పైగా ఇండియన్ అభిమానులు ఉండడం తమ జట్టును ఒత్తిడిలోకి తీసుకువెళ్లిందని హాట్ కామెంట్స్ చేశారు. అక్కడ పరిస్థితులు కూడా టీమిండియాకు అనుకూలంగా మార్చినట్లుగా తమకు అనుమానాలు వచ్చాయని వ్యాఖ్యానించారు. దానికి తోడు ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా… ఫైనల్స్ దాకా టీమిండియా దూసుకు వచ్చిందని గుర్తు చేశారు.
ఈ దెబ్బకు టీమిండియానే గెలుస్తుందని అనుమానాలు తమ జట్టులో మొదలయ్యాయని హాట్ కామెంట్స్ చేశారు ట్రావిస్ హెడ్. ఐసీసీ కూడా టీమిండియా కు అనుకూలంగా వ్యవహరించినట్లు తమ జట్టులో చర్చ కూడా జరిగినట్లు బాంబు పేల్చారు. కానీ చివరి వరకు పోరాడాలన్న కసితో తాము బరిలోకి దిగామని గుర్తు చేశారు. టాస్ గెలిస్తే మొదట బౌలింగ్ చేసి… టీమిండియాను ఒత్తిడిలోకి తీసుకురావాలని ప్లాన్ వేసుకున్నామని వివరించారు.
దానికి తగ్గట్టుగానే మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియాను 240 పరుగులకే కట్టుడి చేశామని వివరించారు. ఇక ఇదే మ్యాచ్లో 137 పరుగులతో తాను అద్భుతంగా రాణించి టీమిండియాను ఓడించినట్లు గుర్తు చేశారు. ఆరంభంలో 47 పరుగులకే 3 వికెట్లు కోల్పోయినప్పటికీ.. ఆ తర్వాత పుంజుకున్నామని వెల్లడించారు హెడ్. దీంతో ట్రావిస్ హెడ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కాగా, 2023 వన్డే వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా పరిస్థితి దారుణంగా తయారువుతోన్న సంగతి తెలిసిందే.