E-Paper
Advertisement

జీహెచ్ఎంసీలో రెనొవేషన్ దందా కలకలం.. ఆఫీసర్ల మోజుకు కోట్లు ఖర్చు!

జీహెచ్ఎంసీలో రెనొవేషన్ దందా కలకలం.. ఆఫీసర్ల మోజుకు కోట్లు ఖర్చు!
Advertisement

GHMC: స్వేచ్ఛ బ్యూరో: కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో అత్యధిక జనాభా అవసరాలకు తగిన విధంగా అభివృద్దితో పాటు పౌర, అత్యవసర సేవలందిస్తున్న జీహెచ్ఎంసీ ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నా, జీహెచ్ఎంసీ అధికారవర్గాల్లో ఆర్థిక క్రమశిక్షణ కొరవడిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గత గులాబీ సర్కారు హయాంలో తాహత్తుకు మంచి అప్పులు చేసిన జీహెచ్ఎంసీ ప్రస్తుతం అప్పుల అసలు మిత్తీలను చెల్లిస్తూనే నూరేళ్ల ఆయుశ్శు దినదిన గండంగా రొటీన్ మెయింటనెన్స్ ను కొనసాగిస్తుంది. ముఖ్యంగా మూడున్నర వేల మంది పర్మినెంట్ ఉద్యోగులకు, దాదాపు 26 వేల మంది ఔట్ సోర్స్ కార్మికులతో పాటు రిటైర్డు ఉద్యోగులకు పెన్షన్లు, కాంట్రాక్టర్లకు అభివృద్ది, మెయింటనెన్స్ పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించేందుకు తలలు పట్టుకుంటున్న అధికారులు దుబారా ఖర్చులను కంట్రోల్ చేయటం లేదన్న వాదనలున్నాయి.

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో..

ముఖ్యంగా జీహెచ్ఎంసీలోకి డిప్యూటేషన్లపై వచ్చే అధికారులకు కోట్లాది రూపాయలు వెచ్చించి, కార్పొరేట్ స్థాయిలో చాంబర్లను ఏర్పాటు చేయటం విమర్శలకు తావిస్తుంది. 2020లో ఎదురైన కరోనా విపత్కర పరిస్థితులకు ముందు నుంచే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఎపుడూ చూసినా ఏదో ఓ చోట రెనొవేషన్ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. బిల్డింగ్ మెయింటనెన్స్ విభాగంలో దశాబ్దాలుగా తిష్ట వేసిన ఓ ఇంజనీర్ తరుచూ ప్రతిపాదనలు తయారు చేస్తున్నా, ఉన్నతాధికారులు ఆర్థిక సంక్షోభం కొనసాగుతున్న సమయంలో గుడ్డిగా మంజూరీలిస్తున్నట్లు సమాచారం. పనులు కూడా సదరు ఇంజనీర్ బినామీలే చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ రకంగా ప్రతి ఏటా సుమారు రూ. పది కోట్ల వరకు రెనొవేషన్ పేరిట ఖర్చు చేస్తున్నట్లు, ఆర్థిక సంక్షోభం సమయంలో ఈ వ్యయభారం అవసరమా? అని కొందరు ప్రధాన కార్యాలయంలో అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఏడాది పొడువున పనులే..

Advertisement

ఏడాది పొడువున ప్రధాన కార్యాలయంలో ఎక్కడో ఓ చోట రెనొవేషన్ పనులను మంజూరీ చేయించుకుంటూ పనులు కొనసాగిస్తున్న ఓ ఇంజనీర్ కోట్లాది రూపాయల అక్రమార్జనకు పాల్పడినట్లు కూడా ఆరోపణలున్నాయి. కనిష్టంగా మూడేళ్లు, గరిష్టంగా నాలుగేళ్ల పాటు డిప్యూటేషన్ పై విధులు నిర్వర్తించే వివిధ విభాగాధిపతులు, అదనపు కమిషనర్ల కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి, అధికారులకు నచ్చిన విధంగా చాంబర్ల రెనొవేషన్ పనులను కొనసాగిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం మూడో అంతస్తులోని ఇద్దరు అదనపు కమిషనర్ల చాంబర్లను రెనొవేట్ చేసిన అధికారులు ఇపుడు రెండో అంతస్తులోని ఫైనాన్షియల్ అడ్వైజర్ చాంబర్ ను కూడా కోట్లాది రూపాయలు వెచ్చించి, కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతున్నారు. కొన్ని సందర్భాల్లో చాంబర్ల రెనొవేషన్ పనులు పూర్తయ్యే దశలో అధికారుల వాస్తు సెంటిమెంట్ లో అదనంగా మరిన్ని పనులు కూడా చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఫైనాన్షియల్ అడ్వైజర్ ఛాంబర్ ను బిల్లుల కోసం కాంట్రాక్టర్లు మినహా ఉన్నతాధికారులు గానీ, సందర్శకులు గానీ ఎవరూ పెద్దగా సందర్శించరు.

Also read: తెలంగాణ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. మళ్లీ దళిత్ వర్సెస్ దొరలు.. కాంగ్రెస్ ప్లాన్ వర్కౌట్ అయ్యేనా!

రెనొవేషన్ పనులు..

Advertisement

సందర్శకులు ఎక్కువగా రాకపోకలు సాగించే చీఫ్ మెడికల్ ఆఫీసర్, అదనపు కమిషనర్ (శానిటేషన్), ఆరవ అంతస్తులోని మెయింటనెన్స్, ప్రాజెక్టుల విభాగం సూపరింటెండెంట్ ఇంజనీర్ల చాంబర్లు దశాబ్దాలుగా అరకొర వసతుల మధ్యనే కొనసాగుతున్నాయి. అయిదో అంతస్తులోని చీఫ్ ఇంజనీర్ ఆఫీసు కార్పొరేట్ లుక్ లో ఉండగా, ఆరవ అంతస్తులోని ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ఏ చాంబర్ ను కూడా ఇప్పటి వరకు రెనొవెట్ చేయకపోవటంతో పాత లుక్ లోనే దర్శనమిస్తున్నాయి. దీనికి తోడు ప్రస్తుతం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏ యూనియన్ కూడా గుర్తింపు చెల్లుబాటులో లేకపోయినా, యూనియన్లు అడగటమే ఆలస్యం యూనియన్ల ఆఫీసు రెనొవేషన్ కు కూడా అధికారులు మంజూరీలివ్వటం చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎస్సీఎస్టీ ఉద్యోగుల అసోసియేషన్ లో రెనొవేషన్ పనులు చేపట్టిన కొద్ది నెలలకే వర్షపు నీరు లికేజీ అయ్యేలా నాసిరకం పనులు చేపట్టిన సదరు ఇంజనీర్ రూపకల్పన చేసిన ప్రతి ప్రతిపాదనకు అధికారులు గడ్డిగా మంజూరీ ఇవ్వటం వెనకా అసలు ఆంతర్యమేమిటీ? అన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి.

అక్రమార్జన కోసమే రెనొవేషన్ పనులా?

గత సంవత్సరం నవంబర్ చివరలో కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని 27 పట్టణ స్థానిక సంస్థలను విలీనం చేయటంతో పెరిగిన జీహెచ్ఎంసీ పరిధిని జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్లుగా పునర్విభజించిన సంగతి తెల్సిందే. దీంతో అంతకు ముందే సెకండ్ ఫ్లోర్ లో రెనొవెట్ చేసిన ఓ అదనపు కమిషనర్ చాంబర్ ను అప్పటి బిగ్ అర్బన్ జీహెచ్ఎంసీకి అదనపు కమిషనర్ గా విధులు నిర్వర్తించిన ప్రస్తుతం మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి కేవలం కొద్దిరోజుల పాటు ఈ చాంబర్ లో విధులు నిర్వర్తించారు. గత ఫిబ్రవరి 10న పాలక మండలి గడువు ముగియటంతో 11వ తేదీ నుంచి జీహెచ్ఎంసీ పరిధిని మూడు కార్పొరేషన్లుగా విభజించటంతో, అందులో వినయ్ కృష్ణా రెడ్డి మల్కాజ్ గిరి మున్సిపల్ కమిషనర్ గా నియమితులు కావటంతో కార్పొరేషన్ కు కేటాయించిన తార్నాకలోని హెచ్ఎండీఏ ఆఫీసులోకి ఆయన మారారు. దీంతో రెండో ఫ్లోర్ లోని చాంబర్ ఖాళీగా ఉంది. ఇక ప్రతి సంవత్సరం స్వచ్ఛ సర్వేక్షన్ కోసం ప్రయత్నాలు చేస్తూ, స్వచ్ఛతపై ప్రజల్లో అవగాహను పెంపొందించే కార్యక్రమాలను నిర్వహించే ఆరవ అంతస్తు లోని జాయింట్ కమిషనర్ (శానిటేషన్) ఛాంబర్ కూడా అరకొర వసతుల మధ్య కొనసాగుతుంది. పైన పై కప్పుు అట్టలతో కప్పబడి ఉన్నందున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉన్నతాధికారులతో జూమ్ మీటింగ్ లో మాట్లాడేందుకు అధికారులెన్నో ఇబ్బందుల పాలు కాక తప్పటం లేదు.

Also read: నీళ్లు తాగకుండానే.. జీవితాంతం బతికేసే 6 వింత జంతువులు.. ఇదేం విచిత్రం సామీ!

అధికారులకు కలిసిరాని చాంబర్ల రెనొవేషన్..

ఇప్పటి వరకు మూడు, నాలుగు, రెండో అంతస్తుల్లో రెనొవేట్ చేసిన చాంబర్లు అప్పట్లో అదనపు కమిషనర్లుగా విధులు నిర్వహించిన క్యాడర్, నాన్ క్యాడర్ ఆఫీసర్లకు చాంబర్ల రెనొవేషన్ కలిసి రాలేదు. అదనపు కమిషనర్ (ఐటీ, ఫైనాన్స్) గా విధులు నిర్వహించిన అనురాగ్ జయంతి చాంబర్ నాలుగో అంతస్తులో ఉండేది. కార్పొరేట్ స్థాయిలో ఆయన చాంబర్ ను రెనొవేట్ చేయగానే ఆయనకు జీహెచ్ఎంసీ నుంచి బదిలీ అయింది. అలాగే గతంలో మూడో అంతస్తులోని అదనపు కమిషనర్ (ఫైనాన్స్)గా విధులు నిర్వర్తించిన గీతారాధిక చాంబర్ ను కూడా రెనొవేట్ చేసిన వెంటనే ఆమెను మరో విభాగానికి కమిషనర్ బదిలీ చేశారు. కొన్ని రోజులు ఏ విభాగాన్ని కేటాయించకుండా పక్కన బెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. జీహెచ్ఎంసీ మూడు ముక్కలుగా పునర్విభజించక ముందు ఇదే మూడో అంతస్తులోని అదనపు కమిషనర్( ఫైనాన్స్) చాంబర్ ను వినియోగించిన, అప్పటి బిగ్ అర్బన్ జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ జి.సృజన కూడా కొద్ది రోజులు మాత్రమే ఈ చాంబర్ లో విధులు నిర్వర్తించి, ఫిబ్రవరి 11 నుంచి సైబరాబాద్ కమిషనర్ గా నియమితులయ్యారు.

స్క్రాప్ ను కూడా వదలరా?

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏడాది పొడువున జరిగే చాంబర్ల రెనొవేషన్ తో ఖరీదైన ఫర్నించర్, కంప్యూటర్లు, ఇతర సామాగ్రి స్క్రాప్ గా మారుతుంది. నిబంధనల ప్రకారం ఈ స్క్రాప్ కు టెండర్ల ప్రక్రియ చేపట్టి, డిస్పోజ్ చేయాల్సి ఉండగా, మెయింటనెన్స్ విభాగం అధికారులు ఎలాంటి టెండర్ల ప్రక్రియ చేపట్టకుండా గడిచిన కొద్ది రోజుల నుంచి స్క్రాప్ ను తరలిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ స్క్రాప్ కు తరలింపునకు సంబంధించి మెయింటనెన్స్ విభాగానికి చెందిన ఓ ఇంజనీర్ ను ప్రశ్నించగా, అంతా రూల్స్ ప్రకారమే జరుగుతుందని, టెండర్ల ప్రక్రియ కూడా చేపట్టామని సమాధానమిస్తున్నా, అందుకు సంబంధించి ఎలాంటి పత్రాలు గానీ డాక్యుమెంట్లను గానీ సమర్పించటం లేదు. దాదాపు నెల రోజుల నుంచి సదరు ఇంజనీర్ అంతా రూల్స్ ప్రకారమే జరుగుతుందంటూ సమాధానం చెబుతూ దాటవేస్తున్నారు.

Also read: సైలెంట్‌గా ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. కేసీఆర్ సీరియస్.. కాంగ్రెస్‌కు జై కొడతారా?

Tags

Related News

నడిరోడ్డుపై డెలివరీ బాయ్స్ నరకం.. తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం

పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. క్షణాల్లో ప్రమాదం..!

ఉద్యోగులకు రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి-డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

శామీర్‌పేట్‌లో కాంగ్రెస్ నాయకులు ఫైర్.. BRS ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దుచేయాలని డిమాండ్!

1980s ట్రెండ్.. అచ్చం హీరోలా సీఎం రేవంత్, ఓల్డ్ ఈజ్ గోల్డ్

అదుపు తప్పిన లారీ.. డ్రైవర్‌ సహా 200 గొర్రెలు సజీవదహనం.. మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర ప్రమాదం

మూసీ నది ప్రాజెక్టు.. దసరా రోజు నుంచి పనులకు శ్రీకారం, ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం

Big Stories

Advertisement
×