Comedy Movie OTT : ఓటీటీలోకి కపిల్ శర్మ నటించిన కామెడీ సినిమా ‘కిస్ కిస్కో ప్యార్ కరూన్ 2’ (Kis Kisko Pyaar Karoon 2) వచ్చేసింది. ఇది కామెడీతో ఆడియన్స్ ను గారడీ చేస్తోంది. దీని కోసం ప్రేక్షకులు కూడా చాలా కాలం నుంచి ఎదురుచూశారు. ఇక థియేటర్లలో మిస్ అయిన వాళ్ళు ఈ సినిమాని ఎంచక్కా చూడచ్చు. ఈ గందరగోళ కామెడీకి పొట్ట చక్కలయ్యేలా నవ్వుతారు. ఇందులో హీరో పరిస్థితుల ప్రభావంతో ముగ్గురు వేర్వేరు మతాలకు చెందిన అమ్మాయిలను పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఈ ముగ్గురు భార్యల మధ్య దొరక్కుండా అతను చేసే ప్రయత్నాలు, దానివల్ల కలిగే గందరగోళం చుట్టూ ఈ కామెడీ తిరుగుతుంది. ఈ సినిమాను ఎక్కడ చూడచ్చు ? దీని కథ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
2015లో వచ్చిన హిట్ మూవీ ‘కిస్ కిస్కో ప్యార్ కరూన్’కు సీక్వెల్ గా వచ్చిందే ‘కిస్ కిస్కో ప్యార్ కరూన్ 2’. ఇది మొదట 2025 డిసెంబర్ 12న థియేటర్లలోకి వచ్చింది. ధురంధర్ ప్రభావంతో బాక్సాఫీస్ వద్ద ఇబ్బంది పడింది. ఇది 2026 ఫిబ్రవరి 6నుంచి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ లో ఉంది. OTTplay ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ద్వారా కూడా యాక్సెస్ చేయవచ్చు ఈ సినిమాని. ఈ సీక్వెల్‌లో కపిల్ శర్మ ప్రధాన పాత్రలో నటించారు. వారినా హుస్సేన్, పరుల్ గులాటి, త్రిధా చౌదరి, ఆయేషా ఖాన్ కథానాయికలుగా నటించారు. మొదటి చిత్రానికి దర్శకత్వం వహించిన అబ్బాస్ మస్తాన్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. అనుకల్ గోస్వామి దీనికి దర్శకత్వం వహించారు.
భోపాల్‌లో రెస్టారెంట్ నడుపుతున్న మోహన్ శర్మ (కపిల్ శర్మ) తన కాలేజీ స్నేహితురాలు సానియాను ప్రేమిస్తాడు. అయితే వీరిద్దరి మతాలు వేరు కావడంతో కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి అంగీకరించరు. సానియాను పెళ్లి చేసుకోవడం కోసం మోహన్ ఇస్లాం మతంలోకి మారి ‘మెహమూద్’ అనే పేరు పెట్టుకుంటాడు. కానీ విధి విచిత్రమైన ఆట ఆడుతుంది. కొన్ని ఊహించని పరిస్థితుల వల్ల మోహన్ వేర్వేరు మతాలకు చెందిన మరో ముగ్గురు మహిళలను పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది.
ఈ పెళ్ళిళ్ళ గురించి భార్యలకు చప్పకుండా, వాళ్ళని మేనేజ్ చేస్తూ మోహన్ చేసే గారడీ నవ్వులు పోయిస్తుంది. ముగ్గురు భార్యలతో రహస్యంగా సంసారం సాగిస్తూనే, తన అసలు ప్రేయసి అయిన సానియాతో నాలుగో పెళ్లికి ప్లాన్ చేస్తాడు. ఈ లోపు ఒక పోలీసు అధికారి కూడా ఎంట్రీ ఇవ్వడంతో క్లైమాక్స్ మరింత గందరగోళంగా మారుతుంది. చివరికి మోహన్ ఈ చిక్కుల నుండి ఎలా తప్పించుకున్నాడు అనేది ఈ సినిమాలో కామెడీగా చూపించారు.
Read Also : లెక్కల మాస్టారుకి ఫ్యామిలీ డెడ్లైన్… లెక్క తప్పే కొత్తకారు మోజు… మిడిల్ క్లాస్ మెమొరీస్