E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు మరో టెన్షన్.. ప్రభావతికి దిమ్మతిరిగే షాక్.. తల్లి కోసం రోహిణి షాకింగ్ నిర్ణయం..?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు మరో టెన్షన్.. ప్రభావతికి దిమ్మతిరిగే షాక్.. తల్లి కోసం రోహిణి షాకింగ్ నిర్ణయం..?
Advertisement

Gundeninda GudiGantalu Today episode February 7th: నిన్నటి ఎపిసోడ్ లో.. మీనా ప్రభావతి కోసం బిర్యాని తీసుకొని వెళుతుంది. అక్కడున్న పిల్లలు ఇద్దరు లవర్స్ మాత్రం ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు కానీ ప్రభావతికి మాత్రం ఎక్కడా అనుమానం రాదు. అయితే మీనా ప్రభావతి కోసం తెచ్చిన బిర్యానిని కామాక్షి కూడా తినాలని అనుకుంటుంది. అయితే కామాక్షి చేసిన వంటని పక్కనపెట్టి మీనా వడ్డించిన బిర్యానీని ఇద్దరు ఫుల్లుగా లాగించేస్తారు.. బయట ఉన్న లవర్స్ ని చూసి మీనా జాగ్రత్తగా డాన్స్ నేర్చుకోండి లేదంటే మాత్రం బాగోదు అని వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది.. ప్రభావతి ఇంటికి వచ్చిన తర్వాత బిర్యాని ఫుల్లుగా తినడంతో ఇబ్బంది పడిపోతూ ఉంటుంది.

మీనా రాగానే బిర్యానీ ఎక్కడ నుంచి తెచ్చావు ఇదిగో హోటల్ బిల్లు అంటూ అంటుంది.. రోహిణి మాత్రం అత్తయ్య గారిని చంపాలనుకుంటున్నావా అని మీనాతో అనడంతో మీనా షాక్ అవుతుంది.. ఇప్పటివరకు బాగానే ఉన్నా అత్తయ్య గారిని నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో మీనా అని అడుగుతుంది.. అయితే ఈ బిల్లు చూడండి ఇది హోటల్ నుంచి తెచ్చిన బిర్యాని అని ప్రభావతి అంటుంది.. అయితే మీనా తప్పేమీ లేదని తెలుసుకున్న రోహిణి క్షమాపణ కూడా చెప్పకుండా అక్కడి నుంచి మెల్లగా జారుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. మనోజ్ కి వచ్చిన లెటర్ గురించి అర్ధరాత్రి కలకంటూ ఉంటాడు. ఈ విషయాన్ని ఎలాగైనా సరే అమ్మతో చెప్పాలి ఏదో ఒక సలహా ఇస్తుంది అని మనోజు అనుకుంటాడు. ప్రభావతికి మనోజ్ ఫోన్ చేసి అర్జెంటుగా పైకి రమ్మని అడుగుతాడు. ఏంటి నువ్వు అప్పుడే పైకి ఎందుకు వెళ్లావు అంటే ఏం మాట్లాడుతున్నావ్ అమ్మ పైనే చచ్చాను. ఇంకా చావలేదు రా అనేసి అంటాడు. ఎందుకురా ఈ టైంలో ఫోన్ చేసి రమ్మన్నావు. ఏం జరిగిందిరా ఏం చేసావ్ మళ్ళీ అని అడుగుతుంది ప్రభావతి.. నువ్వు ఏదైనా చేయడానికి చేసావా నన్ను మళ్ళీ ఇరికించేసావా అని ప్రభావతి టెన్షన్ పడిపోతూ అడుగుతుంది..

కానీ మనోజ్ మాత్రం అమ్మ కాసేపు ఆగు నేను చెప్పేది వినవా ఏంటి అని అడుగుతాడు.. ఏంట్రా ఏం చెప్పాలనుకుంటున్నావ్ అని ప్రభావతి అంటుంది.. నాకు ఒక లెటర్ వచ్చింది కదా.. అవును వచ్చింది ఆ తర్వాతే కదా నువ్వు రంగు రంగుల చుక్కలు వేసుకుంటున్నావు అని అంటుంది.. అది కాదమ్మా ఇవాళ మరొక లెటర్ వచ్చింది. దాంట్లో ఏముందో ఒకసారి నువ్వే చదివి చూడు అని అనగానే ప్రభావతి ఆ లెటర్ ని తీసుకుంటుంది.. అవును అందులో ఏముంది అర్థం కావడం లేదు నాకు హార్ట్ ఎటాక్ వస్తుందా నిజంగానే అని భయపడుతుంది ప్రభావతి. నేను ఉరి వేసుకుంటాను అని రాశారు నాకు ఇంకా భయమేస్తుంది అమ్మ అని మనోజ్ అంటాడు.

Advertisement

ఆ తర్వాత రోహిణి పైనుంచి దూకేసి ఆత్మహత్య చేసుకుంటుంది అని రాశారు. అతను నేను పట్టుకోవాలని చూశాను కానీ ఒక దొంగ అని తెలిసి షాక్ అయ్యాను అని మనోజ్ అంటాడు.. అప్పుడే రోహిణి వీళ్లిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు అని పైకి వస్తుంది. ప్రభావతి ఎవరో వస్తున్నారు అని ఇటుకతో కొట్టాలని అనుకుంటుంది. కానీ వచ్చింది నేను అని రోహిణి అనడంతో ఆ ఇటుకని కింద పడేస్తుంది.. ఇక ఏమైంది ఎందుకు మీరిద్దరు ఈ టైం లో ఎక్కడికి వచ్చే టెన్షన్ పడుతున్నారు అని రోహిణి అడుగుతుంది.. అయితే ఆ లెటర్ చూసి లెటర్ లాగా ఉంది అని ఆలోచిస్తుంది.. కొంపదీసి జైలు నుంచి వచ్చాడు అంటే ఆ దినేష్ గాడు ఏమైనా పంపించాడు అని టెన్షన్ పడిపోతుంది..

Also Read : సీక్వెల్స్ కు 41 చిత్రాలు రెడీ..ఆ సినిమాలన్నీ మళ్ళీ వచ్చేస్తున్నాయి..!

ఇక బాలు మీనా నిద్రపోతూ ఉంటే ఒక్కసారిగా బాలు ఉలిక్కిపడి లేస్తాడు. ఏమైంది ఎందుకు లేచావు అని నేను అడుగుతుంది. ఏం లేదు నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో మనిద్దరం కొట్టుకుంటున్నాము అందుకే నేను ఇక్కడ లేచేసాను అని బాలు అంటాడు.. అయితే ఆ కలలో కూడా నేను మాట్లాడేది లేదు కదా అని నేను అడుగుతుంది.. అదేంటి నేను నీకు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వడం లేదని ఫీల్ అవుతున్నావా ఏంటి అని ఇద్దరు కలిసి గొడవపడతారు.. చూశారా కళ నిజమే అయింది మనిద్దరం ఇప్పుడు గొడవ పడుతున్నామని మీనా అంటుంది. ఇకపోతే ఇద్దరి మధ్య కాస్త రొమాంటిక్ టచ్ మొదలవుతుంది.. తర్వాత రోజు రోహిణి విద్య ఇద్దరు కలిసి సుగుణమ్మ కోసం ఒక ఇంటిని వెతకాలని అనుకుంటారు. అక్కడ ఒక ఇల్లు చూసి అక్కడ ఓనర్ తేడాగా ఉన్నాడని విద్య అంటున్న సరే రోహిణి మాత్రం వీళ్లు చాలా బాగుంది నాకు బాగా నచ్చింది అని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. సోమవారం ఎపిసోడ్లో రోహిణి గురించి నిజాలు బయటపడతాయేమో చూడాలి..

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Big Stories

Advertisement
×