E-Paper
Advertisement

Family Drama OTT : శరీరాలను మార్చే ఆత్మలు… గందరగోళంలో పడే ఫ్యామిలీ… మనసుకు హత్తుకునే క్లైమాక్స్

Family Drama OTT : శరీరాలను మార్చే ఆత్మలు… గందరగోళంలో పడే ఫ్యామిలీ… మనసుకు హత్తుకునే క్లైమాక్స్
Advertisement

Family Drama OTT : ఓటీటీలో ఎన్నో సినిమాలు స్ట్రీమింగ్ కి వస్తుంటాయి. అయితే పిల్లలు, ఫ్యామిలీతో కలిసి చూడడానికి పర్ఫెక్ట్ గా కొన్ని సినిమాలు మాత్రమే ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా అలాంటిదే. ఇందులో ఒక అరుదైన గ్రహాల కలయిక వల్ల ఒక ఫ్యామిలీలో ఉండే వ్యక్తుల శరీరాల ఆత్మలు మారిపోతాయి. ఆతరువాత అసలు కథ ఉంటుంది. ఇది పిల్లలు, అమ్మానాన్నలు ఒకరి లైఫ్ ఎలా ఉంటుందో అర్థం చేసుకునే స్టోరీ. ఈ సినిమా పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

ఈ అమెరికన్ ఫాంటసీ ఫ్యామిలీ కామెడీ మూవీ పేరు ‘ఫ్యామిలీ స్విచ్’ (Family Switch). ఇది McG దర్శకత్వంలో రూపొందింది. హీరోయిన్ జెన్నిఫర్ గార్నర్ ఈ సినిమాను నిర్మించింది. ఈ సినిమా 2023 నవంబర్ 30న Netflixలో రిలీజ్ అయింది. జెన్నిఫర్ గార్నర్, ఎడ్ హెల్మ్స్ ఇందులో నటించారు. ఈ చిత్రం 2010లో అమీ క్రౌస్ రోసెంతల్ రచించిన ‘బెడ్ టైమ్ ఫర్ మమ్మీ’ అనే పిల్లల పుస్తకం ఆధారంగా రూపొందింది. 1 గంట 45 నిమిషాల స్టోరీ భలే సరదాగా, ఆసక్తికరంగా సాగిపోతుంటుంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈ నిమా స్టోరీ చాలా సరదాగా ఉంటుంది. వాకర్ ఫ్యామిలీలో తల్లిదండ్రులు అయిన జెస్, బిల్, వాళ్ళ పిల్లలు ఒకరినొకరు అర్థం చేసుకోకుండా ఎప్పుడూ గొడవపడుతుంటారు. ఒకరోజు రాత్రి వీరంతా కలిసి ఒక ప్లానిటోరియంకి వెళ్ళినప్పుడు, అక్కడ ఒక వింత గ్రహాల వల్ల అనూహ్యంగా వాళ్ళ శరీరాలు మారిపోతాయి. అంటే తల్లి బాడీలోకి కూతురి, తండ్రి బాడీలోకి కొడుకు మారిపోతారు. ఆఖరికి పెంపుడు కుక్క కూడా చిన్న బాబు బాడీలోకి మారిపోతుంది. పొద్దున్నే లేచి చూసుకునేసరికి ఈ వింత చూసి అందరూ షాక్ అవుతారు.

అయితే సరిగ్గా అదే రోజు ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యమైన పనులు ఉంటాయి. జెస్‌కు ఆఫీసులో ప్రమోషన్ ఇంటర్వ్యూ, బిల్ కు తన బ్యాండ్ మ్యూజిక్ షో, కూతురు సీసీకి సాకర్ ట్రయల్స్, కొడుకు వ్యాట్‌కు యూనివర్సిటీ ఇంటర్వ్యూ ఉంటాయి. ఒకరి బాడీలో ఉన్న మరొకరు ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నారు ? ఒకరి కష్టాలు ఒకరు తెలుసుకుని ఎలా మళ్ళీ దగ్గరయ్యారు ? చివరకు అసలు రూపంలోకి ఎలా వస్తారు ? అనేదే మిగిలిన కథ.

Advertisement

Read Also : ఫ్యూచర్ నుంచి వచ్చే పెళ్ళాం… భర్తకి షాకింగ్ ట్విస్టులు… ఇన్స్టా లో ట్రెండ్ అవుతున్న మాస్టర్ పీస్

Tags

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×