E-Paper
Advertisement

Comedy Movie OTT : భార్యతో విడాకులు… వద్దు వద్దంటూనే ప్రేమలో… ఔరా అనిపించే స్టోరీ

Comedy Movie OTT : భార్యతో విడాకులు… వద్దు వద్దంటూనే ప్రేమలో… ఔరా అనిపించే స్టోరీ
Advertisement

Comedy Movie OTT : హాలీవుడ్ నటుడు జిమ్ కారీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ‘మాస్క్’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. విభిన్న శైలి అతని సొంతం. మరి ఈ హీరో నటించిన మరో సూపర్ హిట్ సినిమా గురించి చెప్పుకోవాల్సిందే. ఈ సినిమాలో కూడా కామెడీ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ప్రతిదానికీ No చెప్పే వ్యక్తి, ఒక గురువు సలహాతో ఆ తరువాత అన్నిటికీ yes చెప్పడం మొదలు పెడతాడు. ఆ తరువాత ఏం జరిగిందనేదే ఈ సినిమా కథ.

ఎక్కడ చూడవచ్చు ?

పేటన్ రీడ్ దర్శకత్వం వహించిన ఈ హాలీవుడ్ రొమాంటిక్ కామెడీ మూవీ పేరు ‘యెస్ మ్యాన్’ (Yes Man). ఇందులో జిమ్ కారీ లీడ్ రోల్ లో నటించారు. ఇది 2008 డిసెంబర్ 19న యునైటెడ్ స్టేట్స్‌లో విడుదలైంది. చాలా మంది ఈ స్టోరీ క్యారీ గత చిత్రాలలో ఒకటైన ‘లయర్ లయర్‌’ తో పోలి ఉందని అభిప్రాయ పడ్డారు. అయినా కానీ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించి, ప్రపంచవ్యాప్తంగా $223 మిలియన్లు వసూలు చేసింది ఈ సినిమా. ప్రస్తుతం Amazon Prime Video, Apple TV ప్లాట్‌ ఫామ్‌లలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

కార్ల్ అలెన్ (జిమ్ క్యారీ) అనే ఒక బ్యాంక్ ఉద్యోగి లైఫ్‌లో దేనికీ అస్సలు ఇంట్రెస్ట్ చూపించడు. తన భార్యతో విడాకులు అయ్యాక, లోలోపలే బాధపడుతూ ఉంటాడు. ఫ్రెండ్స్ బయటకు రమ్మన్నా కుదరదు (No) అంటూ తప్పించుకుంటూ ఉంటాడు. అలా ఒంటరిగా గడుపుతున్న టైమ్‌లో, ఒక ఫ్రెండ్ సలహాతో ఒక సెల్ఫ్ కౌన్సిలింగ్ మీటింగ్‌కి వెళ్తాడు. అక్కడ ఒక గురువు మాటలకు అతని మనకు కొంచెం మారుతుంది. ఇక నుంచి తన దగ్గరకు వచ్చే ప్రతి క్వశ్చన్‌కి అవును (Yes) అని మాత్రమే చెప్పాలని ఒక ప్రామిస్ చేస్తాడు. ఒకవేళ “కాదు” అని చెబితే తనకి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అవుతుందని భయపడతాడు.

ఇక అప్పటినుంచి కార్ల్ లైఫ్ మొత్తం మారిపోతుంది. ఏది అడిగినా యస్ అనడం వల్ల లైఫ్ లో చాలా వింతలు జరుగుతాయి. చివరికి ఒక అపరిచితుడికి లిఫ్ట్ ఇచ్చి తన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఇచ్చేయడం వరకు వెళ్తాడు. కానీ ఇదే అలవాటు వల్ల అతనికి ఒక గర్ల్‌ఫ్రెండ్ (అల్లిసన్) కూడా దొరుకుతుంది. ఆ తరువాత స్టోరీ మరింత ఆసక్తిగా మారుతుంది. చివరికి అన్నిటికీ యస్ చెప్పడంతో కార్ల్ ఎలాంటి చిక్కుల్లో పడతాడు. వాటినుంచి ఎలా బయట పడతాడు ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also : ఇండియన్ ఫుట్ బాల్ లెజెండ్ బయోపిక్… కట్టిపడేసిన అజయ్ నటన… స్పోర్ట్స్ ప్రియులకు ఫీస్ట్

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×