E-Paper
Advertisement

Mrithyunjay: శ్రీవిష్ణు సినిమా నుంచి హీరోయిన్ లుక్కొచ్చింది.. మేడమ్ చాలా స్ట్రిక్ట్!

Mrithyunjay: శ్రీవిష్ణు సినిమా నుంచి హీరోయిన్ లుక్కొచ్చింది.. మేడమ్ చాలా స్ట్రిక్ట్!
Advertisement

Mrithyunjay: టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ శ్రీవిష్ణు (Sree Vishnu) ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరించే ఆయన, ఇప్పుడు ‘మృత్యుంజయ్’ (Mrithyunjay) అనే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. హుస్సేన్ షా కిరణ్ (Hussain Sha Kiran) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. రీసెంట్‌గా ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని ప్రకటిస్తూ, హీరో శ్రీవిష్ణు లుక్‌ని మేకర్స్ వదిలిన విషయం తెలిసిందే. ఆ పోస్టర్ బాగా వైరలైంది. తాజాగా ఈ సినిమా నుంచి హీరోయిన్ రెబా మోనికా జాన్ (Reba Monica John) ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read- Niharika Konidela: కొత్త పయనం వైపు నిహారిక అడుగులు.. పసుపు రంగు బట్టల్లో ఆకట్టుకున్న మెగా డాటర్

ఐపీఎస్ ఆఫీసర్‌గా మేడమ్ ఎంట్రీ

Advertisement

ఈ పోస్టర్‌ని గమనిస్తే.. బ్లాక్ బస్టర్ మూవీ ‘సామజవరగమన’ తర్వాత శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్ జోడీ మళ్లీ ఈ సినిమా కోసం కలిశారు. అయితే ఆ సినిమాలో నవ్వించిన ఈ జంట, ఇక్కడ మాత్రం చాలా సీరియస్‌గా ఉండబోతున్నారు. తాజా పోస్టర్‌లో రెబా జాన్ ఐపీఎస్ సీతా పరశురామ్ (IPS Seetha Parasuram) పాత్రలో నటిస్తున్నట్లుగా మేకర్స్ తెలిపారు. ఖాకీ యూనిఫామ్ ధరించి, తీక్షణమైన చూపులతో ఉన్న ఆమె లుక్ చూస్తుంటే.. సినిమాలో మేడమ్ చాలా స్ట్రిక్ట్‌గా ఉండబోతున్నట్లు అర్థమవుతోంది. అందం, అభినయంతో ఆకట్టుకునే రెబా, ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌లో పవర్‌ఫుల్ పాత్రను పోషిస్తుందనే విషయాన్ని ఈ పోస్టర్ క్లారిటీ ఇస్తోంది. సీతా పరశురామ్ పాత్రలో రెబా జాన్ చేసే ఇన్వెస్టిగేషన్ ఎలాంటి మలుపులు తిరుగుతుందో తెలియాలంటే మాత్రం ఫిబ్రవరి 27 వరకు వెయిట్ చేయాల్సిందే!

Also Read- Pawan Kalyan: రోడ్డు లేక విద్యార్ధుల ఇక్కట్లు.. కదిలిన డిప్యూటీ సీఎం.. ఆగమేఘాలపై ఆదేశాలు

ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్

Advertisement

శ్రీవిష్ణు కెరీర్‌లోనే ఇదొక విభిన్నమైన సినిమా కాబోతోందని ఇప్పటికే వచ్చిన కంటెంట్ తెలియజేస్తోంది. లైట్‌బాక్స్ మీడియా, పిక్చర్ పర్‌ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ చాలా డిఫరెంట్‌గా సాగుతున్నాయి. తాజాగా విడుదలైన రెబా జాన్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచింది. ఒక పక్క శ్రీవిష్ణు మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటూనే, మరోపక్క ఇన్వెస్టిగేటివ్ అంశాలు ప్రేక్షకులను థ్రిల్ చేయనున్నాయని టీమ్ కూడా తెలుపుతోంది. ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ కాల భైరవ సంగీతం అందిస్తుండగా, లెజెండరీ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ పని చేస్తున్నారు. విద్యాసాగర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఫిబ్రవరి 27న ఈ సినిమాను గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Also Read- Rashmika Mandanna: డార్క్ పాత్రలో రష్మిక.. AA24 సినిమాలో ఎప్పుడూ లేనంత వైలెంట్‌గా..!

Related News

రాజకీయాలపై అక్కినేని కోడలు హాట్ కామెంట్స్!

జిమ్ వర్కౌట్స్ తో ఆశ్చర్యపరుస్తున్న స్టార్ హీరో తల్లి.. ఎవరంటే?

ప్రదీప్ రావత్ జీవితంలో భయంకరమైన రోజు అదే!

తేజెస్వి మదివాడ రియల్ స్టోరీ.. కన్నీళ్లు తెప్పించే ట్విస్టులు..

రాంబాయి గ్లామర్ డోస్ పెంచిందిగా.. కుర్రాళ్లకు నిద్రపట్టదు..!

71 ఏళ్లకీ జిమ్‌లో దుమ్మురేపిన హృతిక్ తల్లి..వైరల్ వీడియో

కన్నుమూసిన ఛత్రపతి విలన్ ..ఇండస్ట్రీలో విషాదం !

ప్రేమ కథల లవర్స్‌కు పండగ.. ‘వన్స్ మోర్’ వచ్చేస్తుంది!

Big Stories

Advertisement
×