E-Paper
Advertisement

అందమైన మాటలు.. అంతలోనే ఘోరమైన మోసాలు… అసలైన ‘ఫేక్’ లవ్ స్టోరీ

అందమైన మాటలు.. అంతలోనే ఘోరమైన మోసాలు… అసలైన ‘ఫేక్’ లవ్ స్టోరీ
Advertisement

Thriller Series OTT : ప్రేమలో మోసపోతే ఆ బాధ ఎలా ఉంటుందో అది ప్రేమించిన వాళ్ళకే తెలుస్తుంది. మోసం చేసేవాళ్ళు చాలా తేలిగ్గా చేస్తుంటారు. కానీ దాని ఫలితాలు దారుణంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో వచ్చిన ఒక సిరీస్ ను తెగ చూస్తున్నారు ప్రేక్షకులు. అంతేకాకుండా విమర్శకుల నుండి ఈ సిరీస్‌కు విశేషమైన స్పందన లభించింది. ఐఎండీబీలో 7.0/10 రేటింగ్ సాధించిన ఈ చిత్రం, ఆస్ట్రేలియన్ టెలివిజన్ రంగంలో 2024లో వచ్చిన అత్యుత్తమ డ్రామాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సిరీస్ ఒక జర్నలిస్ట్ రాసిన పుస్తకం ఆధారంగా రూపొందింది. ఇది ఆమె జీవితంలో జరిగిన ఒక రియల్ స్టోరీ. ఇందులో మొత్తం 8 ఎపిసోడ్లు ఉన్నాయి. ఏ ఒక్క ఎపిసోడ్ మిమ్మల్ని డిసప్పాయింట్ చెయ్యదు.

ఏ ఓటీటీలో చూడచ్చు అంటే 

2024లో వచ్చిన ఈ ఆస్ట్రేలియన్ థ్రిల్లర్ సిరీస్ పేరు ‘ఫేక్’ (Fake). సిరీస్‌ను అన్యా బేయర్స్ డోర్ఫ్ సృష్టించగా, ప్రముఖ దర్శకులు ఎమ్మ ఫ్రీమాన్, జెన్నిఫర్ లీసీ, టేలర్ ఫెర్గూసన్ కలసి దర్శకత్వం వహించారు. ఇందులో యాషెర్ కెడ్డీ, డేవిడ్ వెన్హామ్ లీడ్ రోల్స్ లో నటించారు. ముఖ్యంగా కథానాయిక పాత్ర పోషించిన యాషెర్ కెడ్డీ, నటనతో పాటు ఈ సిరీస్‌కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా కూడా బాధ్యతలు నిర్వహించడం విశేషం. ఇది పారామౌంట్+ (Paramount+) లో 2024 జూలై 4 న విడుదలైంది. ఆతరువాత prime videoలో కూడా అందుబాటులోకి వచ్చింది. 2025లో జరిగిన ప్రతిష్టాత్మక AACTA అవార్డుల్లో ఉత్తమ డ్రామా సిరీస్, ఉత్తమ నటి (యాషెర్ కెడ్డీ), ఉత్తమ సహాయ నటి (హీథర్ మిచెల్) వంటి ప్రధాన విభాగాల్లో ఈ సిరీస్ నామినేషన్లను దక్కించుకోవడం విశేషం. ఈ సిరీస్ ‘స్టెఫానీ వుడ్’ అనే జర్నలిస్ట్ రాసిన ‘Fake’ అనే పుస్తకం ఆధారంగా రూపొందింది . దీనిని ఆమె తన జీవితంలో జరిగిన నిజమైన సంఘటనలతో రచించింది. .

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్‌లో బర్డీ బెల్ అనే మహిళ ఒక మ్యాగజైన్ రైటర్‌గా పనిచేస్తుంటుంది. ఒంటరిగా ఉంటున్న ఆమెకు, ఒక డేటింగ్ యాప్ ద్వారా జో బర్ట్ అనే వ్యక్తి పరిచయమవుతాడు. అతను తనను తాను ఒక పెద్ద పశువుల వ్యాపారిగా, చాలా ధనవంతుడిగా పరిచయం చేసుకుంటాడు. మొదట్లో బర్డీకి అతని ప్రవర్తన మీద కొంచెం అనుమానం ఉన్నా, జో చూపించే ప్రేమ, ఆకర్షణ వల్ల నెమ్మదిగా అతని మాయలో పడిపోతుంది. కానీ రోజులు గడిచే కొద్దీ, జో చెప్పే మాటలన్నీ పచ్చి అబద్ధాలని బర్డీకి అర్థమవుతుంది. అతను చూపించే ఆ విలాసవంతమైన జీవితం, ఆస్తులు అన్నీ ఒక పెద్ద మోసం అని తెలుస్తుంది. జో ఒక సీరియల్ స్కామర్ అని, అతను ఇలాగే చాలామంది మహిళలను ప్రేమ పేరుతో మోసం చేస్తూ, వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నాడని బర్డీ గుర్తిస్తుంది. ఒక పక్క అతని మీద ఉన్న ప్రేమ, మరోపక్క నిజం తెలిసిన తర్వాత కలిగే బాధ మధ్య ఆమె ఎలా నలిగిపోతుంది. చివరికి దీని నుంచి బర్డీ ఎలా బయట పడిందనేది అసలైన ముగింపు.

Read Also : రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన కామెడీ థ్రిల్ల‌ర్‌… గే కపుల్స్ కొడుకు స్పై ఏజెంట్ గా

Related News

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

యానిమే ప్రేమికులకు పండగే పండగ… ఓటీటీలోకి అడుగు పెట్టిన భారీ మిలిటరీ సై-ఫై అడ్వెంచర్

బ్రష్ కొనివ్వలేదని కొడుకుపై కేసు… నవ్విస్తూనే కన్నీళ్లు పెట్టించే ఫ్యామిలీ ఎమోషన్

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

Big Stories

Advertisement
×