E-Paper
Advertisement

కష్టాలను జయించిన ఒక పవిత్ర ఆత్మ ప్రయాణం… అవార్డులు, ప్రశంసలతో హోరెత్తిన సినిమా

కష్టాలను జయించిన ఒక పవిత్ర ఆత్మ ప్రయాణం… అవార్డులు, ప్రశంసలతో హోరెత్తిన సినిమా
Advertisement

Historical Musical Drama : ఒకప్పుడు క్రిస్టియన్ మతం కాకుండా అమెరికాలో మరో మతం ప్రాచుర్యం పొందింది. 18వ శతాబ్దానికి చెందిన ఈ మతం పేరు ‘షేకర్స్’. దీని వ్యవస్థాపకురాలు ఆన్ లీ జీవితం ఆధారంగా ఓ సినిమా రూపొందింది. గత ఏడాది క్రిస్మస్ కు వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమాకు ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. ఇది నిజంగా 18వ శతాబ్ధంలో జీవించిన ‘ఆన్ లీ’ అనే మహిళ చరిత్ర. ఆమె స్థాపించిన ‘షేకర్స్’ అనే మతం అమెరికాలో ఒకప్పుడు చాలా ప్రాచుర్యం పొందింది. నేటికీ వాళ్ళు తయారు చేసిన ఫర్నిచర్ ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్. ఇది ఒక మ్యూజికల్ డ్రామాలా ఉంటుంది. అంటే మామూలు పాటలు కాకుండా, షేకర్స్ భక్తితో చేసే వింతైన నాట్యాలు ఇందులో హైలైట్. ఆ కాలంలో వాళ్ళు దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఒళ్లు మరిచి ఊగిపోతూ చేసే డ్యాన్స్ సీక్వెన్సులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

జియో హాట్‌స్టార్ (JioHotstar)లో స్ట్రీమింగ్

ఈ హిస్టారికల్ మ్యూజికల్ డ్రామా పేరు ‘ది టెస్టమెంట్ ఆఫ్ ఆన్ లీ’ (The Testament of Ann Lee). ఈ చిత్రంలో ఆన్ లీ పాత్రను ప్రముఖ నటి అమండా సెయ్‌ఫ్రైడ్ పోషించారు. అమండా నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమా కోసం ఆమె ప్రత్యేకంగా షేకర్స్ హావభావాలు, వాళ్ళ వింతైన ప్రార్థన పద్ధతులు నేర్చుకుంది. ఈ చిత్రానికి మోనా ఫాస్ట్‌వోల్డ్ దర్శకత్వం వహించారు. ఇక షేకర్ల సాంప్రదాయ గీతాలను ఆధునిక పద్ధతిలో ఈ సినిమాలో ఉపయోగించారు. సెలియా రౌల్సన్-హాల్ కొరియోగ్రఫీ అందించగా, డేనియల్ బ్లంబర్గ్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ సినిమా ఇప్పటికే అంతర్జాతీయ వేదికలపై మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా అమండా సెయ్‌ఫ్రైడ్ నటనకు గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ ఛాయిస్ వంటి ప్రతిష్టాత్మక అవార్డుల నామినేషన్లు దక్కాయి. ఈ సినిమా 2025 డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా జియో హాట్‌స్టార్ (JioHotstar)లో అందుబాటులో ఉంది. ఇది ఏప్రిల్ 1, 2026 నుండి స్ట్రీమింగ్ ప్రారంభమైంది. ఈ సినిమాను Apple TV, Amazon Prime Video ప్లాట్‌ఫారమ్‌లలో కూడా రెంట్‌కు తీసుకోవచ్చు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌లో ఒక పేద కుటుంబంలో పుట్టిన ఆన్ లీ జీవితం చాలా కష్టాలతో మొదలవుతుంది. ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తూ, పెళ్లయ్యాక నలుగురు పిల్లలను కన్నా.. దురదృష్టవశాత్తూ ఆ నలుగురూ చనిపోతారు. ఈ బాధలో ఉన్నప్పుడు ఆమెకు కొన్ని దైవిక శక్తులు కనిపిస్తాయి. దేవుడు తనతో మాట్లాడుతున్నాడని, లోకంలో పాపానికి కారణం మనుషుల మధ్య ఉండే శారీరక సంబంధాలేనని ఆమె నమ్ముతుంది. అక్కడి చర్చి పద్ధతులకు వ్యతిరేకంగా కొత్తగా ప్రార్థనలు చేస్తూ, ‘షేకర్స్’ అనే చిన్న టీం తయారు చేసుకుంటుంది. అక్కడ మొదట ఆమె నమ్మకాలను ఒప్పుకోని జనం ఆమెను పిచ్చిది అని తిట్టి, జైల్లో పెట్టి వేధిస్తారు. దీంతో విసిగిపోయిన ఆన్ లీ, తన అనుచరులతో కలిసి మెరుగైన జీవితం కోసం అమెరికాకు పయనమవుతుంది.

అయితే అక్కడ ఒక అడవి లాంటి ప్రాంతంలో స్థిరపడి, అందరూ సమానంగా ఉండే ఒక ఆదర్శ గ్రామాన్ని నిర్మిస్తుంది. ఆస్తిపాస్తులు అందరికీ సమానంగా ఉండాలని, ఆడ-మగ తేడా లేకుండా అందరూ కలిసి పనిచేయాలని ఆమె బోధిస్తుంది. కానీ అక్కడ కూడా స్థానికులు ఆమెను మాంత్రికురాలిగా, బ్రిటిష్ గూఢచారిగా అనుమానించి దాడులు చేస్తారు. ఎన్ని దెబ్బలు తిన్నా, ఎన్ని అవమానాలు ఎదురైనా ఆన్ లీ తన పట్టుదల వదలదు. తన పాటలు, వింతైన నాట్యాల ద్వారా ప్రజల్లో ఆధ్యాత్మికతను నింపుతుంది. చివరికి జైలు శిక్షలు, శారీరక హింస వల్ల ఆమె ఆరోగ్యం దెబ్బతిన్నప్పటికీ, ఆమె స్థాపించిన ఆ ‘షేకర్స్’ మతం అమెరికాలో బలపడటం మొదలవుతుంది. ఒక మామూలు మహిళ ఎలా ఒక ఆధ్యాత్మిక విప్లవానికి నాయకురాలిగా మారిందనేదే ఈ సినిమా క్లైమాక్స్.

Advertisement

Read Also : అర్థరాత్రి వినిపించే అడుగుల సప్పుడు… కనిపించని మనుషుల నీడలు… గుండె గట్టిగున్నోల్లే చూడాల్సిన సిరీస్

Tags

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×