Trisha: దక్షిణాది సినీ పరిశ్రమలో ప్రముఖ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన త్రిష ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. సినిమాల వల్ల మాత్రమే కాకుండా, ఆమె వ్యక్తిగత జీవితం కూడా అభిమానుల దృష్టిని ఆకర్షిస్తుంది. ముఖ్యంగా ఆమెకు పెంపుడు జంతువులపై ఉన్న ప్రేమ గురించి చాలామందికి తెలిసిందే.
త్రిష చాలా కాలంగా కుక్కలను ఎంతో మమకారంతో పెంచుకుంటోంది. వాటిని తన కుటుంబ సభ్యుల్లా భావిస్తూ, ప్రత్యేకమైన అనుబంధాన్ని కలిగి ఉంటుంది. ఆమె పెంచుకున్న జోరో అనే కుక్క మరణించడంతో త్రిష చాలా బాధపడింది. ఆ సమయంలో ఆమె సోషల్ మీడియాలో చేసిన పోస్టులు చూస్తే, ఆ అనుబంధం ఎంత ఎమోషనల్ గా ఉందో అర్థమవుతుంది. తనకు ఎంతో ప్రియమైన జంతువు దూరమవడం ఆమెను తీవ్రంగా కలచివేసింది అని చెప్పుకొచ్చింది.
ఆ బాధ నుంచి నెమ్మదిగా బయటకు వచ్చిన త్రిష, తరువాత ఇజ్జీ అనే మరో కుక్కను దత్తత తీసుకుంది. దానిని కూడా చాలా ప్రేమగా చూసుకుంటూ, తన జీవితంలో మరో ముఖ్యమైన భాగంగా మార్చుకుంది. ఇటీవల ఇజ్జీకి స్నానం చేయిస్తున్న వీడియోను ఆమె సోషల్ మీడియాలో పంచుకుంది. ఆ వీడియోలో కనిపించిన ప్రేమ, ఆప్యాయత చాలా మందిని ఆకట్టుకుంది.
అదే సమయంలో త్రిష చేసిన ఒక భావోద్వేగ పోస్ట్ షేర్ చేసింది. కుక్కలు మనుషుల కంటే తక్కువ కాలం జీవిస్తాయని తెలిసినా, వాటిని మన జీవితంలోకి ఆహ్వానిస్తామని, అవి దూరమైతే మనసు ముక్కలైపోతుంది కానీ.. ఏం చేయగలము అంటూ ఆమె చెప్పుకొచ్చింది. అయినప్పటికీ, ఆ ప్రేమను మళ్లీ అనుభవించడానికి మనం సిద్ధపడతామని ఎమోషనల్ వ్యాఖ్యలు చేసింది ఈ హీరోయిన్. ప్రస్తుతం ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతుంది.
సినిమాల విషయానికి వస్తే, త్రిష ఇప్పటికే తెలుగు, తమిళం వంటి భాషల్లో అనేక హిట్ చిత్రాల్లో నటించింది. టాలీవుడ్‌లో కూడా చాలా మంది స్టార్ హీరోలతో కలిసి పని చేసింది. మధ్యలో కొంత విరామం తీసుకున్నా, ఇప్పుడు మళ్లీ వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవల కొన్ని సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోయినా, ఆమెకు ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు.
ప్రస్తుతం త్రిష తమిళం, తెలుగు భాషల్లో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో నటిస్తున్న సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. అలాగే మరికొన్ని ఆసక్తికరమైన సినిమాలు కూడా ఆమె చేతిలో ఉన్నాయి. ఇలా వ్యక్తిగత జీవితం, కెరీర్ రెండింటినీ సమతుల్యం చేస్తూ త్రిష ముందుకు సాగుతోంది.
ALSO READ: Niharika Konidela: నాగబాబు సినిమాల పై నిహారిక షాకింగ్ కామెంట్స్…మోసం చేశారంటూ!