E-Paper
Advertisement

OTT Movie : ఒకే అమ్మాయితో ఇద్దరబ్బాయిలు… మస్ట్ వాచ్ మలయాళ ట్రయాంగిల్ లవ్ స్టోరీ

OTT Movie : ఒకే అమ్మాయితో ఇద్దరబ్బాయిలు… మస్ట్ వాచ్ మలయాళ ట్రయాంగిల్ లవ్ స్టోరీ
Advertisement

OTT Movie : మరికొన్ని గంటల్లో యూత్ అడియన్స్‌లో ఒక రొమాంటిక్ సిరీస్ బజ్ క్రియేట్ చేయబోతోంది. ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ చుట్టూ తిరిగే కథ. పెళ్లి, ఫ్రెండ్ షిప్ మధ్య జరిగే ఈ ప్రేమ కథ చాలా ఆసక్తిగా ఉంటుంది. ఇద్దరు ప్రాణ మిత్రులు ఒకే అమ్మాయిని ప్రేమించడంతో ఈ స్టోరీ ఆడియన్స్ కి బాగానే కనెక్ట్ అవుతుంది. ఇది వరకు ఇలాంటి స్టోరీలు చాలానే వచ్చాయి. అయితే ఆడియన్స్ మాత్రం ఈ కథలను అదరిస్తూనే వస్తున్నారు. ఈ సిరీస్ కూడా ప్రేక్షకుల మదిలో నిలిచిపోతుందేమో చూడాలి. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది ? అనే వివరాల్లోకి వెళ్తే.

మనోరమ మాక్స్ లో స్ట్రీమింగ్

ఈ మలయాళం రొమాంటిక్ వెబ్ సిరీస్ పేరు “కప్లింగ్”. సార్జానో ఖాలిద్ (కల్మీ), శ్రీనాథ్ బాబు (అర్జున్), వ్యష్ణవి రాజ్ (సౌమ్య), మలవిక స్రీనాథ్ (ప్రియా) ప్రధాన పాత్రల్లో నటించారు. జోసెఫ్ తిమ్మల్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్, 2025 నవంబర్ 14 నుంచి మనోరమ మాక్స్‌లో ప్రీమియర్ అవుతుంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

కల్మీ బెంగళూరులో ఒక ఈవెంట్ ప్లానర్. అతని అర్జున్ అనే ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు. ఇద్దరూ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. స్కూల్ డేస్ నుంచి పార్టీలు, ట్రిప్స్ తో ఎప్పుడూ కలిసి ఎంజాయ్ చేసేవాళ్ళు. అయితే కల్మీకి సౌమ్య అనే యువతి మీద క్రష్. సౌమ్య వాళ్ల కాలేజ్ ఫ్రెండ్, ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. కల్మీ ఆమెతో మాట్లాడాలనుకుంటాడు. కానీ ఫ్రెండ్‌ షిప్ పోతుందేమోననని భయపడతాడు. ఒక రోజు కల్మీకి షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. అర్జున్ సౌమ్యతో ఎంగేజ్‌మెంట్ ఫిక్స్ చేసుకున్నాడు. కల్మీకి గుండె పగిలిపోతుంది కానీ బయటికి “సూపర్ రా!” అని స్మైల్ పెట్టి సపోర్ట్ చేస్తాడు.

Read Also : పేరుకే రొమాంటిక్ థ్రిల్లర్… అన్నీ అవే సీన్లు… ఇంత ఓపెన్ గా ఎలా చూపించారు భయ్యా ?

ఎంగేజ్‌మెంట్ ఫంక్షన్‌లో కల్మీ హోస్ట్ అవుతాడు. డ్యాన్స్, జోక్స్, గిఫ్ట్స్ అన్నీ పర్ఫెక్ట్. కానీ రాత్రి ఒంటరిగా ఏడుస్తుంటాడు. ఈ సమయంలో సౌమ్య ఫ్రెండ్ ప్రియా ఎంట్రీ ఇస్తుంది. కల్మీ బిహేవియర్ గమనిస్తుంది. “నీకు సౌమ్య మీద ఏదో ఉంది కదా?” అని అడుగుతుంది. మ్యారేజ్ కూడా స్టార్ట్ అవుతుంది. బ్యాచిలర్ పార్టీలో డ్రింక్ చేసి ఏడుస్తాడు. మనసులో ఏదన్నా ఉంటే చెప్పు, లేదంటే తరువాత ఇంకా బాధపడతావ్ అని ప్రియా పుష్ చేస్తుంది. కల్మీ ఫైనల్‌గా సౌమ్యతో మాట్లాడతాడు. నాకు నువ్వంటే ఇష్టం అని చెప్పేస్తాడు. దీనికి సౌమ్య రియాక్షన్ ఏంటి ? ఆమె ఎవరిని పెళ్లి చేసుకుంటుంది ? ఈ కథ ఎలా ముగుస్తుంది ? అనే విషయాలను, ఈ మలయాళం రొమాంటిక్ వెబ్ సిరీస్ ను చూసి తెలుసుకోండి.
Advertisement

 

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×