E-Paper
Advertisement

OTT Movie : పేరుకే రొమాంటిక్ థ్రిల్లర్… అన్నీ అవే సీన్లు… ఇంత ఓపెన్ గా ఎలా చూపించారు భయ్యా ?

OTT Movie : పేరుకే రొమాంటిక్ థ్రిల్లర్… అన్నీ అవే సీన్లు… ఇంత ఓపెన్ గా ఎలా చూపించారు భయ్యా ?
Advertisement

OTT Movie : ఉత్కంఠభరితమైన మలుపులతో వచ్చే థ్రిల్లర్ స్టోరీలను చూడటానికి అందరూ ఆసక్తిని చూపిస్తుంటారు. అలాంటి సిరీస్ లు వస్తే ఆడియన్స్ కూడా వదలకుండా చూస్తుంటారు. సీట్ ఎడ్జ్ కి తెసుకెళ్ళే అలాంటి ఒక మెక్సికన్ ఎరోటిక్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఓటీటీలో టాప్ ట్రెండింగ్ లో నడుస్తోంది. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై గ్లోబల్ హిట్ గా నిలిచింది. 77 దేశాల్లో 35 మిలియన్ వ్యూస్ తో టాప్ 10 సిరీస్ లలో ఇది నెం.1 స్థానం సాధించింది. ఒక్క సారి చూడటం మొదలు పెడితే, క్లైమాక్స్ వరకు చూడకుండా ఆపలేరు. అయితే ఇందులో రోమంటిక్ సీన్స్ కూడా హద్దులు దాటుతాయి. ఒంటరిగా ఈ సిరీస్ ని చూడటం మంచిది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? దీని కథ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

‘Dark Desire’ 2020లో విడుదలైన ఒక మెక్సికన్ ఎరోటిక్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఇది సీజన్ 1 (18 ఎపిసోడ్స్ ) 2020 జులై 15న, సీజన్ 2 (15 ఎపిసోడ్స్ ) 2022 ఫిబ్రవరి 2న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా మంచి ప్రజాదరణ పొందింది. ఇందులో మౌరా సెరానో (అల్మా), అలెజాంద్రో స్పీట్జర్ (దారియో), ఎరిక్ హేసర్ (ఎస్టెబాన్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది హిందీ, తెలుగు, తమిళం, ఇంగ్లీష్‌తో సహా పలు భాషల్లో డబ్ చేయబడింది.

కథలోకి వెళ్తే

Advertisement

అల్మా అనే మహిళ ఒక లా ప్రొఫెసర్ గా, జడ్జిగా విధులు నిర్వహిస్తుంటుంది. తన భర్త ఎస్టెబాన్ కి మరెవరితోనో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తుంది. దీంతో అతనితో దూరమై, ఒక వీకెండ్ ట్రిప్‌ కి వెళ్తుంది. అక్కడ 23 ఏళ్ల దారియోతో ఒక రాత్రి గడుపుతుంది. ఆతరువాత దారియో ఆమె భర్త బెస్ట్ ఫ్రెండ్ కొడుకు అని తెలిసి షాక్ అవుతుంది. ఇంతలోనే అల్మా బెస్ట్ ఫ్రెండ్ బ్రెండా ఆత్మహత్య చేసుకున్నట్టు కనిపించగా, ఆమె డైరీలో దారియోతో లింక్ బయటపడుతుంది. ఇది మర్డర్ మిస్టరీగా మారి అల్మా భర్త, పోలీస్ ఇన్స్పెక్టర్, దారియో వంటి క్యారెక్టర్స్‌తో ట్విస్ట్‌లు స్టార్టవుతాయి.

Read Also : ఇంటికొచ్చిన అబ్బాయిని టెంప్ట్ చేసి ఆ పని… కనక వర్షం కోసం మైండ్ బెండింగ్ క్రైమ్ ప్లాన్

Advertisement

సీజన్ 2లో అల్మా దారియోతో సంబంధం ముగించాలనుకుంటుంది కానీ అతని బిహేవియర్, బ్లాక్‌మెయిల్ వల్ల ట్రాప్ అవుతుంది. దారియో రియల్ ఐడెంటిటీ కూడా బయట పడుతుంది. కథ ముందుకు సాగుతున్న కొద్దీ, అనేక రహస్యాలు, మోసాలు, అబద్ధాలు వెలుగులోకి వస్తాయి. చివరికి బ్రెండా హత్య వెనుక ఎవరున్నారు? డారియో నిజంగా అమాయకుడా, లేక అల్మా జీవితాన్ని నాశనం చేయడానికి పంపబడిన వ్యక్తా ? అల్మా భర్త ఎస్టెబాన్ ఏం దాస్తున్నాడు? అనే ప్రశ్నలకు సమాధానాలు, ఈ మెక్సికన్ ఎరోటిక్ థ్రిల్లర్ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×