E-Paper
Advertisement

నవల మీద కోర్టులో పోరాటం… చరిత్రను నిరూపించమంటూ ఇదేం పని భయ్యా

నవల మీద కోర్టులో పోరాటం… చరిత్రను నిరూపించమంటూ ఇదేం పని భయ్యా
Advertisement

Court Room Drama OTT : రెండవ ప్రపంచ యుద్దంలో లెక్క లేనన్ని ప్రాణాలు అకారణంగా గాలిలో కలిశాయి. ఈ యుద్ధం పక్కన పెడితే, అదే సమయంలో హిట్లర్ పాలనలో యూదుల ఊచకోత ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. గ్యాస్ ఛాంబర్ లలో లక్షల ప్రాణాలను అకారణంగా తీశారు. ఈ నేపథ్యంలో 1996 నుండి 2000 వరకు బ్రిటన్‌లో జరిగిన ఒక కోర్టు కేసు యధార్థ సంఘటన ఆధారంగా సినిమాను తీశారు. అమెరికన్ ప్రొఫెసర్ డెబోరా లిప్‌స్టాడ్, బ్రిటిష్ రచయిత డేవిడ్ ఇర్వింగ్‌ పై కొన్ని ఆరోపణలు చేశారు. ఇర్వింగ్‌ తన రచనలలో యూదులపై హింస జరగలేదని వక్రీకరించారని ఆమె విమర్శించింది. అందుకు గాను అతను ఆమెపై పరువు నష్టం దావా వేశాడు. బ్రిటీష్ చట్టం ప్రకారం తన వాదన నిజమని నిరూపించాల్సిన బాధ్యత డెబోరాపైనే పడటంతో కోర్టులో వాదనలు బలంగా జరిగాయి. కోర్ట్ రూమ్ డ్రామాలను ఇష్ట పడే వాళ్ళు తప్పక చూడాల్సిన సినిమా ఇది.

ఎక్కడ చూడచ్చు అంటే

2016లో వచ్చిన ఈ బయోపికల్ డ్రామా సినిమా పేరు ‘డినైల్’ (Denial). ఇది డెబోరా లిప్‌స్టాడ్ రాసిన ‘హిస్టరీ ఆన్ ట్రయల్: మై డే ఇన్ కోర్ట్ విత్ ఏ హోలోకాస్ట్ డినైర్’ అనే పుస్తకం ఆధారంగా రూపొందింది. ఈ చిత్రానికి మిక్ జాక్సన్ దర్శకత్వం వహించగా, డేవిడ్ హేర్ స్క్రీన్‌ప్లే అందించారు. ప్రధాన పాత్రల్లో ఆస్కార్ విజేత రేచల్ వైజ్ (డెబోరా లిప్‌స్టాడ్), తిమోతీ స్పాల్ (డేవిడ్ ఇర్వింగ్), టామ్ విల్కిన్సన్ (రిచర్డ్ రాంప్టన్) అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. వీరితో పాటు ఆండ్రూ స్కాట్, జాక్ లోడన్ మరియు కారెన్ పిస్టోరియస్ కీలక పాత్రల్లో నటించారు. ముఖ్యంగా కోర్టు గదిలో రేచల్ వైజ్, తిమోతీ స్పాల్ మధ్య జరిగే వాదనలు ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. ఈ సినిమా ప్రైమ్ వీడియో, ఆపిల్ టివిలలో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ఇందులో కథానాయిక డెబోరా ఒక అమెరికన్ ప్రొఫెసర్. ఆమె ఒక పుస్తకం రాస్తూ, డేవిడ్ ఇర్వింగ్ అనే ఒక బ్రిటిష్ రచయిత పెద్ద మోసగాడని, రెండో ప్రపంచ యుద్ధంలో జరిగిన యూదుల మారణహోమాన్ని వక్రీకరిస్తున్నాడని గట్టిగా చెబుతుంది. దీంతో ఆ ఇర్వింగ్ కి మండుతుంది. అతను కూడా తక్కువోడు కాదు, నీ వల్ల నా పరువు పోయింది అంటూ ఆమె మీద బ్రిటన్‌లో పరువు నష్టం కేసు వేస్తాడు. అక్కడికి వెళ్లి తలపడక తప్పని పరిస్థితి ఆమెకు ఎదురవుతుంది. అసలు చిక్కు ఇక్కడే వస్తుంది. బ్రిటన్ చట్టాల ప్రకారం, ఆమె చేసిన ఆరోపణలు నిజమే అని డెబోరానే కోర్టులో నిరూపించుకోవాలి. లేదంటే ఆ ఇర్వింగ్ గెలిచిపోతాడు. ఆమెకు సహాయంగా కొంతమంది లాయర్లు వస్తారు.

కానీ వాళ్ళు ఒక కండిషన్ పెడతారు. నువ్వు కోర్టులో నోరు విప్పకూడదు, అసలు ఆ మారణహోమంలో బతికి బయటపడ్డ వాళ్ళని సాక్ష్యానికి పిలవకూడదని చెబుతారు. ఎందుకంటే ఆ ఇర్వింగ్ చాలా తెలివైన వాడు, వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు వేసి మానసికంగా వేధించే అవకాశం ఉందని వీళ్ళ ఆలోచన. చివరగా ఆ లాయర్లు ఇర్వింగ్ రాసిన పాత పుస్తకాలు, డైరీలు అన్నీ తిరగేసి అతను ఎలా అబద్ధాలు అల్లాడో కోర్టుకు ఆధారాలతో సహా చూపిస్తారు. కోర్టులో వాదోపవాదాలు హోరాహోరీగా సాగుతాయి. చివరికి చరిత్రను ఎవరూ మార్చలేరని, హోలోకాస్ట్ జరిగింది నిజమని కోర్టు తీర్పు ఇస్తుంది. అలా డెబోరా తన నిజాయితీని గెలిపించుకుంటుంది.

Advertisement

Read Also : ఆట మొదలు పెడితే ప్రత్యర్థుల మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే… ఓటీటీలో చూడాల్సిన తోపు సిరీస్

Related News

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

బాడీ షేమింగ్‌ చేస్తూ వేధించిన అమ్మాయిలు… వాళ్లను కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని చూసి కూడా నోరు మెదపని బాధితురాలు! స్పానిష్‌ రివెంజ్‌ థ్రిల్లర్‌

గేమ్‌ ఆడితే మెదడునే కంట్రోల్‌ చేసే డేంజరస్ టెక్నాలజీ… సైకలాజికల్‌ సైఫై థ్రిల్లర్‌ ఓటీటీలోకి

Big Stories

Advertisement
×