E-Paper
Advertisement

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు కవిత రిటర్న్ గిఫ్ట్.. పార్టీలోకి మాజీ ఎమ్మెల్యేల క్యూ..?

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు కవిత రిటర్న్ గిఫ్ట్.. పార్టీలోకి మాజీ ఎమ్మెల్యేల క్యూ..?
Advertisement

Kavitha Jagruthi: స్వేచ్ఛ బ్యూరో: ప్రజలకు సేవ చేసేందుకు అడ్డంకిగా ఉన్న బూర్జువా పార్టీలను వదిలేసి కొత్త రాజకీయ శక్తిగా రాబోతున్న జాగృతిలో చేరాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. బోథ్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు రాథోడ్ బాపూరావు తన అనుచరులతో కలిసి ఆదివారం జాగృతి రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ జాగృతిలో చేరారు. కండువా కప్పి జాగృతిలోకి కవిత ఆహ్వానించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పని చేసిన నాయకులంతా ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి కోసం ఒక్కతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు.

అందరం ఐక్యంగా..

2007లో కుటుంబంతో సహా తాను బోథ్ కు వెళ్లి అక్కడి ఆదివాసీలు, గిరిజనుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయించానన్నారు. వాన పడితే ఆదివాసీ గూడాలు, మన్నెం జ్వర పీడితులతో నిండి ఉండేదని ఆ పరిస్థితి నుంచి మార్పు రావాలనే తెలంగాణ సాధించుకోవాలని అందరం ఐక్యంగా ఉద్యమించామని గుర్తు చేశారు. ఏ స్పిరిట్ తో రాష్ట్ర సాధన కోసం ఉద్యమించామో ఇప్పుడు రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అదే స్ఫూర్తితో పని చేయాల్సి ఉందన్నారు. బాపూరావు తెలంగాణ జాగృతి నుంచే బీఆర్ఎస్ లో చేరి రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారని.. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేయబోయే పార్టీలో చేరుతున్నారన్నారు. కొత్త పార్టీలో చేరడానికి అన్ని జిల్లాల నుంచి నాయకులు ముందుకు వస్తున్నారని తెలిపారు. తెలంగాణ ఉద్యమకారులు జాగృతి పార్టీ వైపు చూస్తున్నారన్నారు.

ఉద్యోగానికి రాజీనామా..

Advertisement

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొత్త పార్టీకి ఆదరణ ఉంటుందన్నారు. సిరిసిల్ల జిల్లా నుంచి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సహా పలువురు నాయకులు జాగృతిలో చేరారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు మాట్లాడుతూ రాష్ట్రానికి కవిత ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. కవిత ఇచ్చిన ధైర్యంతోనే ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యానని తెలిపారు. పార్టీలోకి మధ్యలో వచ్చిన వాళ్లు మంత్రులు అయ్యారని, తనకు మూడోసారి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ లో చేరినా తనకు తగిన ప్రాధాన్యత దక్కలేదన్నారు. కవిత కొత్త పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఇచ్చోడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి తన అనుచరులు, కార్యకర్తలను పార్టీలో చేర్పిస్తానని అన్నారు.

Also Read: హర్మూజ్ జలసంధిలో భారత నౌకపై కాల్పులు.. కమ్యూనికేషన్ గ్యాప్ అన్న‌ ఇరాన్ రాయబారి

మాజీ ఎమ్మెల్యే లింగయ్య దొర భేటీ!

Advertisement

జనగణనలో ఆదావాసీల మతం కోసం ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయాలని కవిత డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా ఆదివాసీ కానిస్ట్యూషనల్ రైట్స్ అండ్ కల్చరల్ ప్రొటెక్షన్ జేఏసీ జాతీయ అధ్యక్షుడు, ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య దొర ఆధ్వర్యంలో జేఏసీ నాయకులు జాగృతి కార్యాలయంలో కవితతో భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలతో ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను లింగయ్య దొర వివరించారు. కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం పెసా చట్టానికి తూట్లూ పొడుస్తూ ఆదివాసీల హక్కులను హరిస్తోందన్నారు. రాజ్యాంగంలోని 5, 6 షెడ్యూళ్లలో ఆదివాసీలకు ఉన్న రక్షణలను తొలగిస్తోందన్నారు.

జనగణనలో మతం..

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో 3 లక్షల మంది ఆదివాసీలను అడవి నుంచి దూరం చేస్తున్నారని, తిరిగి వారికి అడవిలో అన్ని సౌకర్యాలతో కూడిన పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జనగణనలో మతం కేటగిరిలో ఆదివాసీ అనే కాలమ్ పెట్టలేదని, తో ఆదివాసీలు తామ మతాన్ని సగర్వంగా చెప్పుకునే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ఇది దేశ మూలవాసులైన ఆదివాసీల సంస్కృతిని అవమానించడమేనని మండిపడ్డారు. ఆదివాసీలు తమ మతం చెప్పుకునేలా జనగణనలో ప్రత్యేక కాలమ్ పెట్టాలని డిమాండ్ చేశారు.

జేఏసీ ముఖ్య నాయకులు..

ఆదివాసీల భాష ‘‘కోయతూర్’’ ను భారత రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్ చేర్చాలని డిమాండ్ చేశారు. దేశంలోని 12 కోట్ల మంది ఆదివాసీలు నిజమైన భారత దేశ సంస్కృతికి ప్రతినిధులని వారి గౌరవాన్ని కాపాడేలా తాము ఏర్పాటు చేయబోయే రాజకీయ పార్టీ ఉంటుందని ప్రకటించారు. సమావేశంలో ఆదివాసీ జేఏసీ ముఖ్య నాయకులు పాడూరి శ్రీనివాస్, పాయం సత్యనారాయణ, మాడవి నర్సింగరావు, వట్టం నారాయణ దొర, రమణాల లక్ష్మయ్య, వజ్జ నర్సింహరావు, కబ్బాక శ్రావణ్ కుమార్, కుర్సంగ వేణు, వరియ శ్రీనివాస్, షడమాకి సంజీవ్, ఆత్రం పైకాజీ, పోదెం భార్గవ, తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్. రూప్ సింగ్, ఆదివాసీ జాగృతి అధ్యక్షుడు లోకిని రాజు తదితరులు పాల్గొన్నారు.

Also Read: సైబర్ దొంగలతో బ్యాంకు సిబ్బంది కుమ్మక్కు.. 32 మంది అరెస్టు..!

Related News

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Hyderabad: పైరవీలకు చెక్.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, ముఖ్యనేతలకు కీలక సూచనలు

వారెవ్వా గోల్కొండ! భక్తులతో కిక్కిరిసిన కోట.. అధికారుల ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే?

Big Stories

Advertisement
×