E-Paper
Advertisement

10 కేసులు గెలవమని కూతురికి తండ్రి సవాల్… తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న లీగల్ డ్రామా

10 కేసులు గెలవమని కూతురికి తండ్రి సవాల్… తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న లీగల్ డ్రామా
Advertisement

Court Room Drama OTT : చట్టం ముందు అందరూ సమానమే అనే మాటను తరచుగా వింటూ ఉంటాము. కానీ నిజ జీవితంలో అది ఎక్కడా నిజంలా కనిపించదు. డబ్బు, అధికారం, పలుకుబడి ఉన్నవాళ్లకు మాత్రం చట్టం చుట్టంలా కన్పిస్తుంది. ఇక న్యాయం విషయానికి వస్తే… కోర్టు రూముల్లో జరిగే న్యాయం కోసం జరిగే పోరాటం చాలా క్లిష్టంగా ఉంటుంది. అలాంటి వ్యవస్థలో నిజం కోసం ఇద్దరు మహిళలు కలిసి చేసిన పోరాటమే ఈరోజు మన మూవీ సజెషన్. ‘System’ అనే టైటిల్ తో రూపొందిన ఈ కోర్ట్ రూమ్ డ్రామా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? స్టోరీ ఏంటి ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ 

Ashwiny Iyer Tiwari దర్శకత్వంలో రూపొందిన మూవీ ‘సిస్టం’. ఇందులో Sonakshi Sinha, Jyothika మెయిన్ లీడ్స్ గా నటించారు. కుటుంబ కథలు, భావోద్వేగాలతో పాటు సమాజంలోని వాస్తవ సమస్యలను బలంగా చూపించడంలో ప్రత్యేక గుర్తింపు పొందారు దర్శకుడు అశ్విని అయ్యర్ తివారీ. ఆమె ఈసారి న్యాయ వ్యవస్థలో దాగి ఉన్న చీకటి కోణాలను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.

Advertisement

ఈ చిత్రాన్ని థియేటర్లలో కాకుండా, నేరుగా ఓటీటీలో విడుదల చేశారు. Amazon Prime Video లో ఈ సినిమాను వీక్షించొచ్చు. 2026 మే 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా అవైలబుల్ గా ఉంది. లీగల్ డ్రామాలు, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్, సామాజిక సమస్యలపై తెరకెక్కిన సినిమాలు అంటే ఇష్టం ఉన్నవారు ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సిందే.

కథలోకి వెళ్తే…

కథలో నేహా రాజ్‌వంశ్ అనే యువ లాయర్ పాత్రలో సోనాక్షి సిన్హా… ఆమె తండ్రిగా, దేశంలోనే ప్రముఖ లాయర్లలో ఒకరిగా రవి రాజ్‌వంశ్ నటించారు. ఆయన లా ఫర్మ్‌లో పార్ట్‌నర్ కావాలని నేహా కలలు కంటుంది అయితే తండ్రి మాత్రం అలా జరగాలంటే తాను చెప్పింది చేయాలంటూ ఓ కండిషన్ పెడతాడు. వరుసగా పది కేసులు గెలిస్తేనే ఆ అవకాశం ఇస్తాననే తండ్రి షరతుకు ఆమె కూడా ఒప్పుకుంటుంది.

Advertisement

చివరి కేసుగా ఆమె తీసుకున్న ఒక హైప్రొఫైల్ మర్డర్ కేసు నేహా జీవితాన్ని మార్చేస్తుంది. అందులో దాగి ఉన్న షాకింగ్ నిజాలు బయటకు రావడం మొదలవుతుంది. ఒకవైపు తండ్రి ప్రభావం, మరోవైపు న్యాయం కోసం పోరాటం మధ్య నేహా ఎదుర్కొనే సంఘర్షణ సినిమాలో హైలెట్ గా ఉంటుంది. ముఖ్యంగా కోర్టులో జరిగే క్రాస్ ఎగ్జామినేషన్ సన్నివేశాలు ప్రేక్షకులను సక్సెస్ ఫుల్ గా ఆకట్టుకుంటాయి. ఈ కేసులో ప్రధాన నిందితులకు బిగ్గెస్ట్ రియల్ ఎస్టేట్ సామ్రాజ్యంతో సంబంధాలు ఉండడంతో సాక్ష్యాలను తారుమారు చేస్తారు. ఇక్కడే సారికా రావత్ అనే కోర్టు స్టెనోగ్రాఫర్ రోల్ కీలకంగా మారుతుంది. సారికా ఇంట్లో అనారోగ్యంతో ఉన్న భర్తను చూసుకుంటూనే, కోర్టులో తక్కువ జీతానికి పనిచేసే మహిళ. కానీ కోర్టులో జరిగే ప్రతి చిన్న విషయాన్ని గమనించే ఆమె నేహాకు పెద్ద ఆయుధంగా మారుతుంది. మరి చివరికి ఈ కేసు ఎలాంటి మలుపు తిరిగింది ? అన్నది మూవీని చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : 8 ఏళ్ల తర్వాత 3,000 ఏళ్ల నాటి పురాతన శవపేటికలో… గుండె జారిపోయే సీన్లు

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×