E-Paper
Advertisement

ఒకే ఒక వైరుతో నగరాన్ని వణికించిన సైకో… చావు అంచున సాగే ప్రతీ నిమిషం

ఒకే ఒక వైరుతో నగరాన్ని వణికించిన సైకో… చావు అంచున సాగే ప్రతీ నిమిషం
Advertisement

Crime Thriller Movie on OTT : సినిమాల కంటే ఎక్కువ థ్రిల్ ఇచ్చే నిజ జీవిత సంఘటనలు కొన్ని ఉంటాయి. కోపం, నిరాశ, అన్యాయం అనేవి మనిషిని ఎంతటి ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తాయో ఎన్నో ఇప్పటికే ఎన్నో సార్లు చూశాం మనం. అలాంటి వాస్తవ ఘటనల నుంచి పుట్టిన ఓ సినిమానే ఈరోజు మన మూవీ సజెషన్. అమెరికన్ క్రైమ్ థ్రిల్లర్ Dead Man’s Wire గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాము. మరి ఈ మూవీని ఎక్కడ చూడొచ్చు ? స్టోరీ ఏంటి ? అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో

ఈ సినిమాకు Gus Van Sant దర్శకత్వం వహించారు. Good Will Hunting సినిమాతో పాపులర్ అయినా ఆయన 1977లో అమెరికాను షాక్‌కు గురి చేసిన ఒక నిజమైన లైవ్ కిడ్నాప్ ఘటన ఆధారంగా మూవీని తీశారు. మీడియా శక్తి, కార్పొరేట్ వ్యవస్థలపై ప్రజల కోపం, ఓ మనిషి నిస్సహాయత వంటి అంశాలను ఇందులో ఇంట్రెస్టింగ్ గా చూపించారు. Bill Skarsgård ఇందులో హీరోగా నటించాడు. Al Pacino, Colman Domingo, Dacre Montgomery కీలక పాత్రల్లో నటించారు. 2025 చివర్లో వెనిస్, టొరంటో వంటి అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రీమియర్ అయిన ఈ మూవీని 2026 జనవరిలో థియేటర్లలో రిలీజ్ చేశారు. ఇప్పుడు Amazon Prime Video లో ఈ మూవీ అందుబాటులో ఉంది. అయితే ఈ మూవీ ఫ్రీగా కాకుండా రెంట్ లేదా బై ఆప్షన్ ద్వారా అవైలబుల్ గా ఉండడం గమనార్హం.

కథలోకి వెళ్తే…

Advertisement

టోనీ కిరిట్సిస్ అనే వ్యక్తి చుట్టూ ఈ మూవీ స్టోరీ నడుస్తుంది. ఇండియానా పోలిస్‌ లో చిన్న స్థాయి వ్యాపారిగా ఎదగాలనేది అతని కల. అయితే ఆ కోరికలు నిజం కాకుండానే ఆర్థిక మోసాల వల్ల కల్లలైపోతాయి. ‘మెరిడియన్ మార్టిగేజ్’ అనే లోన్ సంస్థ అతన్ని మోసం చేసి ఆస్తిని లాగేసుకుంటుంది. అయితే ఆ సమయంలో అతని నిస్సహాయ స్థితిలో ఉంటాడు. అయితే అదే కోపం చివరకు హీరో ఒక భయంకరమైన నిర్ణయం తీసుకునేలా చేస్తుంది. 1977 ఫిబ్రవరి 8న టోనీ నేరుగా కంపెనీ ప్రెసిడెంట్ రిచర్డ్ హాల్ ఆఫీసులోకి దూసుకెళ్తాడు. అక్కడితో ఆగకుండా అతన్ని కిడ్నాప్ చేస్తాడు.

ఈ సినిమా టైటిల్‌కు కారణమైన ‘డెడ్ మ్యాన్స్ వైర్’ ట్విస్ట్ ఇక్కడే వస్తుంది. టోనీ గన్ ట్రిగ్గర్‌ ను ఒక వైర్ ద్వారా తన మెడకు కట్టుకోవడమే ఆ స్పెషల్. పోలీసులు కాల్పులు జరిపినా, అతను కిందపడినా ట్రిగ్గర్ లాగినట్టుగా అయ్యి, కిడ్నాప్ చేసిన వ్యక్తి అక్కడికక్కడే చనిపోయే ప్లాన్ అది. ఈ ఒక్క సెటప్ తోనే సినిమా అంతా నరాలు కట్టయ్యే ఉత్కంఠతో సాగుతుంది. రిచర్డ్ హాల్‌ను తన అపార్ట్‌మెంట్‌ లో కిడ్నాప్ చేసి పెట్టి అతను పోలీసుల నుంచి పెట్టే డిమాండ్స్ మైండ్ బెండింగ్ గా ఉంటాయి. అప్పుల రద్దు, కంపెనీ నుంచి లిఖితపూర్వక క్షమాపణ, తన భద్రతపై హామీ వంటి డిమాండ్స్ అతని లిస్ట్ లో ఉంటాయి.

Advertisement

అయితే ఈ తతంగాన్ని అంతటిని లోకల్ టీవీ, రేడియో వంటివి లైవ్ స్ట్రీమింగ్ చేస్తాయి. ఇంకేముంది టోనీ టాక్ ఆఫ్ డి టౌన్ అవ్వడానికి ఎక్కువ టైం ఏమీ పట్టదు. అప్పటికే కార్పొరేట్ సంస్థలపై అసంతృప్తితో ఉన్న జనాలు అతడిని తిరుగుబాటు నాయకుడిలా భావించి, సపోర్ట్ చేస్తారు. ఈ 63 గంటల కిడ్నాప్ డ్రామా చివరకు ఎలా ముగిసిందనేది తెలియాలంటే మూవీని చూడాల్సిందే.

Read Also : మగాళ్లు మాత్రమే ఉండే ఇంట్లో పెళ్లి తెచ్చిన గందరగోళం… నవ్వించి చంపేస్తున్న మలయాళం సినిమా ఓటీటీలోకి

Related News

పెళ్ళయిన వ్యక్తితో రిలేషన్ లో… మెదడును కదిలించే క్లైమాక్స్

లవర్ కు మతిమరుపు వస్తే… కన్నీళ్ళు పెట్టించే తెలుగు రొమాంటిక్ డ్రామా

గర్ల్ ఫ్రెండ్ కోసం కుక్కను తెచ్చి కొత్త చిక్కుల్లో… డాగ్ లవర్స్ డోంట్ మిస్

ఒకరి తర్వాత ఒకరు సైకోలుగా మారి హత్యలు చేసే పేరున్న వ్యక్తులు… మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు

యాక్సిడెంట్, కట్ చేస్తే ప్రేమించిన అమ్మాయి భార్యగా… మెంటలెక్కించే తమిళ సై-ఫై రొమాంటిక్ థ్రిల్లర్

ఏం సిరీస్ గురూ… మనుషుల్ని చంపి పచ్చి మాంసం నోట్లో కుక్కే కిల్లర్

50 రోజులు అందమైన అమ్మాయితో గదిలో కాలు బయట పెట్టకుండా… ఒక్కసారి చూస్తే లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మూవీ

ఏడుగురు ఆవారాగాళ్ల కథ… షార్ట్ కట్ లో కోటీశ్వరులు అవ్వాలనుకునే కామెడీ డ్రామా

Big Stories

Advertisement
×