E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode May 12th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్ కు దగ్గర అయిన మనోహరి 

Nindu Noorella Saavasam Serial Today Episode May 12th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్ కు దగ్గర అయిన మనోహరి 
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: అమర్‌తో తాము కాదని ఎప్పుడూ చాలా రోజుల నుంచి పక్కనే ఉన్న రాథోడే వెళ్లి మాట్లాడాలని మిస్సమ్మ రాథోడ్‌కు చెప్తుంది. మేమ వెళ్లి మాట్లాడటం కన్నా నువ్వు వెళ్లి మాట్లాడితేనే బెటర్‌ అని చెప్తుండగానే.. అప్పటికే పైకి వెళ్లిన మనోహరి అమర్‌తో మాట్లాడి కిందకు తీసుకుని వస్తుంది. అమర్‌ అందరినీ విచిత్రంగా చూస్తుంటాడు. అందరూ అమర్‌ను బాధగా చూస్తుంటారు.  మనోహరి వెంటనే యాదమ్మ నేను అమర్‌ లాన్‌లో కూర్చుంటాము వెళ్లి ఒక మంచి కాఫీ తీసుకురా అని చెప్పగానే.. అమర్‌ యాదమ్మా..? అని అడగ్గానే.. అయ్యో చెప్పడం మర్చిపోయాను  తను యాదమ్మ ఇంట్లో పని మనిషి నువ్వు వెళ్లు యాదమ్మ అంటూ అమర్‌ తీసుకుని బయటకు వెళ్తుంటే.. అమర్‌, మిస్సమ్మ, పిల్లలను విచిత్రంగా చూస్తుంటాడు. వీళ్లెవరు..? ఇక్కడ ఎందుకు ఉన్నారు అని అడగ్గానే.. అందరూ ఎమోషనల్‌ అవుతారు.

మనోహరి తర్వాత అన్ని చెప్తాను అమర్‌. ఇక నుంచి నీకు అన్ని నేనే అంతా నేను చూసుకుంటాను పద వెళ్దాం అంటూ అమర్‌ ను తీసుకుని లాన్ లోకి వెళ్తుంది. మిస్సమ్మ, రాథోడ్‌, పిల్లలు ఏడుస్తూ.. చూస్తుంటారు. రాథోడ్ వెళ్లబోతుంటే.. మిస్సమ్మ ఆగు రాథోడ్‌ ఇప్పుడు ఏం మాట్లాడినా ఆయన కన్ఫీజ్‌ అవుతారు. డిస్టర్బ్‌ అవుతారు. నువ్వు అన్నట్టు మనం కొంచెం లేటు అయ్యాం. అయినా పర్వాలేదు. ఆయన రికవరీ అవ్వడం ముఖ్యం అనగానే.. రాథోడ్‌ కోపంగా సార్‌ పరిస్థితి అడ్డం పెట్టుకుని మనోహరి ఓవర్‌ చేస్తుంది మిస్సమ్మ. కావాలనే మనకంటే ముందుగానే వెళ్లింది అనగానే.. మిస్సమ్మ మాత్రం తను ఎదురుచూడని అవకాశం దొరికింది కదా..? ఎందుకు వదిలిపెడుతుంది రాథోడ్‌ అంటూ చెప్తుండగానే.. యాదమ్మ బయటకు కాఫీ తీసుకెళ్తుంది. వెనకాలే అందరూ బయటకు వెళ్లి లాన్‌లో కూర్చున్న అమర్‌ను గమనిస్తుంటారు.

Advertisement

వాళ్లను చూసిన మనోహరి.. అమర్‌ ఈ లాన్‌లో గార్డెన్‌ అంతా మనం పెంచిందే.. చాలా అందంగా ఉంది కదా..? అని చెప్పగానే.. అమర్‌ మనమా..? అంటే.. మనోహరి అవును నువ్వు నేను కలిసి పెంచాం అని చెప్తుంది. దీంతో అమర్‌ నాకేవీ గుర్తు రావడం లేదు అనగానే.. మనోహరి డోంట్ వర్రీ అమర్‌.. నీకు అన్ని నేను గుర్తు చేస్తాను కదా..? నువ్వు  రిలాక్స్‌ తీసుకో అంటూ.. మిస్సమ్మ వైపు చూస్తూ.. ఒసేయ్‌ భాగీ నీ రేపటి బతుకు ఇదేనే.. ఇలా నేను అమర్‌ కలిసిపోతాం. మీరు దూరం అయిపోతారు. ఈరోజు మిమ్మల్ని ఇంటి గుమ్మం దాటించాను. రేపు ఇంటి గేటు దాటిస్తాను. అని మనసులో అనుకుంటూ.. అమర్‌ తో క్లోజ్‌గా మాట్లాడుతుంది. అంతా చూస్తున్న పిల్లలు, రాథోడ్‌, మిస్సమ్మ ఏడుస్తూ లోపలికి వెళ్లిపోతారు. లోపలికి వెళ్లగానే.. అంజు కోపంగా ఏంటి మిస్సమ్మ, మనోహరి ఆంటీ డాడ్‌ను తీసుకెళ్తుంటే.. నువ్వు చూస్తూ ఉండిపోయావు..అంటుంది.

దీంతో ఆనంద్‌ కూడా డాడ్‌ తో ఉండాల్సింది నువ్వు మిస్సమ్మ. డాడ్‌ పక్కన ఉండాల్సింది నువ్వు అంటాడు. అంజు కూడా ఆ మనోహరి ఎవరు మిస్సమ్మ. సార్‌కు ఏమవుతుంది..? అంటూ కోప్పడుతుంది. బుజ్జమ్మ కూడా సార్‌ ఇప్పుడు చూసుకోవాల్సింది మనమే కదమ్మా..? సార్‌ను బాగా చూసుకోవాలని డాక్టర్‌ అంకుల్‌ కూడా చెప్పారు కదా..? పదమ్మా వెళ్లి సార్‌తో మాట్లాడదాం అనగానే.. రాథోడ్‌.. వద్దు బుజ్జమ్మ సార్‌ గతం మర్చిపోయారు. ఇప్పుడు సార్‌కు మనం ఎవరిమో గుర్తు లేదు. బలవంతంగా గుర్తు చేస్తే ప్రమాదం అని డాక్టర్‌ చెప్పారు కదా… అనగానే.. మిస్సమ్మ కూడా అందుకే నేను ఆగిపోయాను. మనోహరి మనకంటే ఒక అడుగు ముందుకేసి ఆయనకు దగ్గర అయింది అంటూ బాధపడుతుంటే.. బయటి నుంచి మనోహరి వస్తుంది.

Advertisement

అంటే నువ్వు ఓడిపోయావు నేను గెలిచాను అని నువ్వే ఒప్పుకుంటున్నావు కదా భాగీ. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను అసలు ఊహించలేదు. నేను ఎక్స్‌ఫెక్ట్‌ చేయకుండానే లక్కీగా టైం అంతా నా వైపు టర్న్‌ అయింది. అదృష్టం అంటే నాదే కదా..? అంటుంది. దీంతో రాథోడ్‌ నిజమేనండి మీలాంటి వాళ్లకు దేవుడు సాయం చేస్తున్నాడు. లేదంటే ఈ పాటికి మీరు జైళ్లో ఉండాల్సింది అంటాడు. మిస్సమ్మ కూడా కోపంగా నీకు దక్కిన ఈ గెలుసు తాత్కాలికమే మనోహరి చివరికి గెలిచేది నేనే.. ఆయనకు గతం గుర్తుకు వచ్చిన మరుక్షణం నీకు ఏమవుతుందో ఆలోచించుకో అంటూ వార్నింగ్‌ ఇవ్వగానే.. మనోహరి నేను అంతా ఆలోచించే ఒక స్టెప్‌ ముందు తీసుకున్నాను.. ఇప్పుడు అమర్‌ నేను ఏం చెబితే అది చేస్తాడు. ఇప్పుడు ఈ సామ్రాజ్యం మొత్తం నాదే అంటూ వార్నింగ్‌ ఇస్తుంటే.. అందరూ భయపడుతుంటారు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

బిగ్ బాస్ 10 నుండి సృష్టి ఎలిమినేటెడ్..4 వారాల్లో సంపాదించింది ఎంతంటే?

Gundeninda GudiGantalu Today episode: రోహిణి కాపురంలో ప్రభా చిచ్చు.. తాయత్తు ప్లాన్.. బాలు దెబ్బకు షాక్…

Ninnu kori Serial Today Episode October 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: దాక్షాయణి గురించి నిజం సామ్రాట్ కు తెలుస్తుందా..? 

Sunday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 4th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్ కు ఫోన్ చేసి రాథోడ్ నిజం చెప్తాడా..? – పార్థును కాపాడతారా..?    

బిగ్ బాస్ 10 లో ఎల్లో కార్డు అందుకున్న ఫస్ట్ కంటెస్టెంట్

బ్లాక్ శారీలో తారక్ సిస్టర్ .. ఇంత స్టైలిష్‌గా ఉందేంటి బాబోయ్!

సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న ఈశ్వర్ సాయి…వివాదాలకు గుడ్‌బై చెప్పినట్టేనా?

Big Stories

Advertisement
×