E-Paper
Advertisement

7 పెళ్లిళ్ల నేపథ్యంలో సాగే సిరీస్… ప్రియా ప్రకాష్ వారియర్ ఫ్యామిలీ డ్రామా ఏ ఓటీటీలో అంటే ?

7 పెళ్లిళ్ల నేపథ్యంలో సాగే సిరీస్… ప్రియా ప్రకాష్ వారియర్ ఫ్యామిలీ డ్రామా ఏ ఓటీటీలో అంటే ?
Advertisement

Malayalam Family Drama on OTT : మలయాళ హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. కరోనా టైమ్ లో ‘ఒరు అదార్ లవ్’ మూవీతో వింక్ గర్ల్ గా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు ఆ తరువాత వివాదాలతో కన్పించకుండా పోయింది. తాజాగా ఈ అమ్మడు మెయిన్ లీడ్ గా నటిస్తున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ సిరీస్ రిలీజ్ కు సిద్ధం అవుతోంది. మరి ఆ సిరీస్ పేరేంటి ? ఎక్కడ, ఎప్పుడు చూడవచ్చు ? అనే వివరాల్లోకి వెళ్తే…

మరో మూడు రోజుల్లో స్ట్రీమింగ్

కేరళ కుటుంబ నేపథ్యంలో సాగే సరికొత్త మలయాళ ఒరిజినల్ ఫ్యామిలీ డ్రామెడీ సిరీస్ Cousins & Kalyanams (2026). దర్శక ద్వయం విష్ణు చంద్రన్ – కణ్ణన్ తామరక్కులం తెరకెక్కించిన లాంగ్-ఫార్మాట్ సిరీస్ ఇది. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన కజిన్స్ మధ్య ఉండే అనుబంధాలు, అల్లరిని మనసుకు హత్తుకునే విధంగా చూపించబోతున్నారు. మొత్తం 60 ఎపిసోడ్లు ఉన్న ఈ భారీ సిరీస్ మే 29 నుండి ఓటీటీలోకి రానుంది. ఈ మేరకు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ JioHotstar నుంచి అఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. అయితే ఒకేసారి మొత్తం ఎపిసోడ్స్ కాకుండా, వీక్షకుల కోసం ప్రతి శుక్రవారం నాలుగు ఎపిసోడ్లను విడుదల చేయనున్నారు. వీకెండ్‌ లో కుటుంబ సభ్యులందరితో కలిసి హాయిగా నవ్వుకుంటూ, భావోద్వేగాలను ఆస్వాదిస్తూ చూసే పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఈ సిరీస్.

Advertisement

ఈ సిరీస్ ద్వారా ‘ఒరు అదార్ లవ్’ ఫేమ్ ఐకానిక్ ‘వింక్ గర్ల్’ ప్రియా ప్రకాష్ వారియర్, రోషన్ అబ్దుల్ రహూఫ్ చాలా ఏళ్ల తర్వాత మళ్లీ జంటగా స్క్రీన్‌పై పలకరించబోతున్నారు. వీరితో పాటు మనస్విని కె. రామ్, సిద్ధార్థ్ బాబు, నందితా మీనన్, కృష్ణ విజయచంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సిరీస్ లో నిరంజ్ సురేష్ అందించిన ‘కల్యాణ మేళం’ వెడ్డింగ్ సాంగ్ ఇప్పటికే ట్రెండ్ అవుతోంది. ప్రతి పెళ్లి వేడుకలో కనిపించే అటెన్షన్ సీకర్లు, డ్రామా క్వీన్లు, అమాయకపు కసిన్స్ మధ్య జరిగే గొడవలు, కామెడీ సీన్లు ప్రేక్షకులకు పెళ్లి జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తాయి. నాస్టాల్జియాను గుర్తు చేసే ఈ సిరీస్ ను డోంట్ మిస్.

Also Read : రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యే ప్లాన్… ఓటీటీలోకి కొత్త సిరీస్

కథలోకి వెళ్తే…

Advertisement

కేరళలోని ఒక పెద్ద సంప్రదాయ కుటుంబానికి చెందిన ఆరుగురు కసిన్స్ చుట్టూ ఈ సిరీస్ తిరుగుతుంది. 26 ఏళ్ల వ్యవధిలో వాళ్ళ కుటుంబంలో జరిగే ఏడు పెళ్లిళ్లు, వాటి ఇతివృత్తంతో సాగే అందమైన ప్రేమకథే ఈ సిరీస్. చిన్నప్పుడు అమాయకంగా, అల్లరిగా తిరిగిన ఈ ఆరుగురు పిల్లలు పెద్దయ్యే కొద్దీ బాధ్యతగల వ్యక్తులుగా ఎలా మారారు ? పెళ్ళిళ్ళలో వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోని మానసిక గాయాలు బయట పడడం, తరువాత ఏం జరిగింది ? అన్నది చూడాల్సిందే.ఈ ఆరుగురిలో మను, దిత్య అలియాస్ దియా క్యారెక్టర్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఓ నిమిషం పీక్స్‌లో ప్రేమించుకుంటే, మరో క్షణంలో తీవ్రంగా గొడవ పడతారు. వాళ్ళ ప్రేమాయణం ఎలా సాగింది ? అన్నది కథ.

Tags

Related News

ఒలింపిక్స్ వివాదం వెనుక అసలు కథ… 6.2 రేటింగ్ ఉన్న మైండ్ బెండింగ్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ

20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసిన పళ్లబురుసు .. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

వీళ్ళకు చావులేదు… తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న హై-వోల్టేజ్ ఫాంటసీ యాక్షన్ సీక్వెల్

సముద్రం ఎడారిగా మారితే ? మనిషి మాంసం కోసం అగాధపు జీవుల అరాచకం… థ్రిల్లింగ్ సర్వైవల్ అడ్వెంచర్

ZEE5లో సెప్టెంబర్ సినిమాల జాతర… మైండ్ బ్లాక్ చేసే మల్టీ-లాంగ్వేజ్ మూవీస్ సిరీస్ల లిస్ట్

1300 కోట్ల థ్రిల్లర్ తెలుగులో… కేక పుట్టిస్తున్న మైండ్ బ్లాక్ క్రైమ్ కామెడీ

2600 కోట్ల కలెక్షన్లు… 7.9 IMDb రేటింగ్… తెలుగులో అందుబాటులో ఉన్న ఆల్ టైమ్ క్లాసిక్ మిస్టరీ థ్రిల్లర్

ఈ వారం ఓటీటీలో పండగే పండగ… తెలుగులో ఏకంగా 6 సూపర్ హిట్ సినిమాలు

Big Stories

Advertisement
×