E-Paper
Advertisement

నిజం మాట్లాడితే డ్యూటీ బంద్ చేస్తారా? పద్మదేవేందర్ రెడ్డి!

నిజం మాట్లాడితే డ్యూటీ బంద్ చేస్తారా? పద్మదేవేందర్ రెడ్డి!
Advertisement

RTC Driver: స్వేచ్ఛ బ్యూరో: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపడుతున్న మంత్రి, ఎమ్మెల్యేలకు ముందు రైతుల వడ్లు కొనుగోలు చేయాలని సూచించినందుకు ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌పై చర్యలు తీసుకోవడం అన్యాయమని మాజీ డిప్యూటీ స్పీకర్ యం. పద్మ దేవేందర్ రెడ్డి విమర్శించారు.కార్మికులకు ప్రజల పక్షాన మాట్లాడే హక్కు ఉందనే విషయాన్ని గుర్తించకుండా అధికారులు మూర్ఖంగా వ్యవహరించడం బాధాకరమని పేర్కొన్నారు.

జగిత్యాలలో నిరసన..

పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై జగిత్యాలలో నిరసన చేపడుతున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు “ముందు వడ్లు కొనండి” అని చెప్పినందుకు జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్ డ్రైవర్ అశోక్‌కు డ్యూటీకి రావద్దంటూ రిమూవల్ లెటర్ ఇవ్వడం తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. డ్రైవర్ అశోక్ తాను ఏ రాజకీయ పార్టీని లేదా నాయకుడిని విమర్శించలేదని, రైతుల సమస్యల గురించి మాత్రమే మాట్లాడానని స్పష్టం చేసినప్పటికీ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ రిమూవల్ లెటర్ జారీ చేయడం కార్మిక హక్కుల ఉల్లంఘన కాదా అని ప్రశ్నించారు.

Advertisement

Also read: బాబీ సినిమా మొదలైంది కానీ.. ‘విశ్వంభర’ అప్‌డేట్ ఎక్కడ? ఫైర్ అవుతున్న చిరు ఫ్యాన్స్

డ్రైవర్ అశోక్‌..

తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికుల పాత్ర ఎంతో కీలకమని, ప్రజా సమస్యలపై స్పందించడం ప్రతి ఉద్యోగి కనీస బాధ్యత అని పేర్కొన్నారు. రైతుల తరఫున మాట్లాడిన డ్రైవర్ అశోక్‌ను అభినందిస్తున్నామని తెలిపారు. వెంటనే డ్రైవర్ అశోక్‌పై తీసుకున్న చర్యలను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వానికి, ఆర్టీసీ అధికారులను డిమాండ్ చేశారు.

Advertisement

Also read: సింగరేణి ఆఫీస్‌ని తగలబెట్టండి అంటూ.. సంచలన వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్!

Related News

తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల.. చివరి తేది..?

రాజ్యాంగానికి తీవ్ర ముప్పు..13 కోట్ల ఓట్లు మాయం.. కేంద్రంపై విరుచుకుపడ్డ మధుయాష్కి!

‘కేసీఆర్ ఫామ్ హౌస్ నీళ్లను రైతులకు ఇస్తాం’.. ఎంపీ చామల సంచలన హామీ!

అనిరుధ్ – కావ్యా మారన్ పెళ్లి రిసెప్షన్.. సీఎం రేవంత్, కేటీఆర్‌కు ఆహ్వానం!

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

Big Stories

Advertisement
×