E-Paper
Advertisement

బాయ్స్ టీమ్‌కు కెప్టెన్ గా అమ్మాయి… క్రేజీ యూత్ ఫుల్ స్పోర్ట్స్ డ్రామా

బాయ్స్ టీమ్‌కు కెప్టెన్ గా అమ్మాయి… క్రేజీ యూత్ ఫుల్ స్పోర్ట్స్ డ్రామా
Advertisement

Teen Sports Drama OTT : ఒక టీనేజర్‌ లైఫ్ లో నుంచి ఉన్నట్టుండి అన్నీ పోతే ఎలా ఉంటుంది ? లగ్జరీ లైఫ్, మంచి స్కూల్, పెద్ద కలలు… ఒక్క క్షణంలో ఇవన్నీ దూరమైతే ? పైగా కుటుంబం చేసిన తప్పుకు తానే అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తే ? ఇలాంటి పరిస్థితుల్లోనూ తనకు ఇష్టమైన రోయింగ్ క్రీడను వదలకుండా ముందుకు సాగిన 16 ఏళ్ల అమ్మాయి కథే ‘Crew Girl Season 1’. స్పోర్ట్స్, టీనేజ్ రొమాన్స్, ఫ్యామిలీ డ్రామాను కలిపిన ఈ సిరీస్‌ లో అసలు టీగన్ తావో ఎదుర్కొన్న కష్టాలేంటి ? తన టీమ్‌ను గెలిపించేందుకు ఆమె చేసిన పోరాటం ఎలా సాగింది ? అనేది తెలుసుకుందాం.

కథలోకి వెళ్తే…

లాస్ ఏంజిల్స్‌లో సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతున్న టీగన్ తావోకు చిన్నప్పటి నుంచే రోయింగ్‌ పై విపరీతమైన ఆసక్తి ఉంటుంది. భవిష్యత్తులో ఒలింపిక్స్‌ లో పాల్గొని దేశానికి ప్రాతినిధ్యం వహించాలన్నది ఆమె కల. కానీ ఒక రేస్ జరుగుతున్న సమయంలోనే టీగన్ జీవితంలో ఊహించని కుదుపు వస్తుంది. ఆమె తండ్రి భారీ ఆర్థిక మోసానికి పాల్పడి, ఇన్వెస్టర్ల డబ్బుతో కనిపించకుండా పోతాడు. ఒక్కసారిగా కుటుంబం ఆస్తులను కోల్పోతుంది. సమాజంలో పరువు పోతుంది. పరిస్థితులు భరించలేక టీగన్ తన తల్లి ఎల్లాతో కలిసి లాస్ ఏంజిల్స్‌ను విడిచి ఈగిల్స్ కోవ్ అనే చిన్న తీరప్రాంత పట్టణానికి వెళ్తుంది.

Advertisement

అక్కడి ప్రతిష్టాత్మకమైన ఈటన్ ప్రెప్ లో టీగన్ కొత్త జీవితం మొదలు పెడుతుంది. అయితే రోయింగ్‌ పై ఉన్న ఆమె కలకు అక్కడ మరో అడ్డంకి ఎదురవుతుంది. స్కూల్లో అమ్మాయిల కోసం ప్రత్యేక రోయింగ్ టీమ్ ఉండదు. అయినా వెనక్కి తగ్గని టీగన్.. అబ్బాయిల టీమ్‌లో లీడర్ గా చేరుతుంది. పడవలో ఆటగాళ్లను సమన్వయం చేస్తూ జట్టుకు దిశానిర్దేశం చేసే ఈ బాధ్యతలో తన సత్తా నిరూపించుకోవాల్సి వస్తుంది. ఒక్క అమ్మాయిగా టీమ్‌ లో అడుగు పెట్టిన టీగన్‌ కు అక్కడ పోటీ, వివక్ష రెండూ ఎదురవుతాయి.

అదే సమయంలో స్కూల్‌లో ఫేమస్ అయిన జోష్ రెగిస్, లోకల్ బాయ్ క్యామ్ డిల్లింజర్‌ తో ఆమెకు ఏర్పడే పరిచయాలు మరో ఆసక్తికరమైన మలుపు తీసుకొస్తాయి. కుటుంబ సమస్యలను ఎలా సాల్వ్ చేసింది ? ఆమెకు స్కూల్ రాజకీయాల వల్ల వచ్చిన సమస్యలు ఏంటి ? టీమ్‌ లోని పోటీని ఎలా ఎదుర్కొంది ? ఆ అమ్మాయి టీనేజ్ ప్రేమ ఎలా సాగింది ? చివరకి టీగన్ తన లక్ష్యాన్ని ఎలా చేరుకుంది ? అనేదే మిగతా కథ.

Advertisement

Also Read : భూతాలు లేవు, దెయ్యాలు లేవు… అయినా గుండెల్లో రైళ్లు పరిగెత్తించే హారర్ థ్రిల్లర్… 7.9 రేటింగ్

తెలుగులో చూడొచ్చా ?

‘క్రూ గర్ల్ సీజన్ 1’ ప్రస్తుతం Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. సిరీస్‌లో మొత్తం 8 ఎపిసోడ్లు ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి తెలుగు ఆడియో అందుబాటులో లేదు. ఇంగ్లిష్ ఒరిజినల్‌తో పాటు హిందీ ఆడియోలో చూడొచ్చు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో పాటు టీనేజ్ ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామా, రొమాన్స్ ఇష్టపడేవారికి ఈ సిరీస్ మంచి వన్‌టైమ్ వాచ్‌ అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఓ అమ్మాయి తనకు ఎదురైన అడ్డంకులను దాటుకుని తన కల కోసం పోరాడే కోణం ఈ సిరీస్‌లో అదిరిపోతుంది.

Tags

Related News

అపార్ట్‌మెంట్ మెట్లపై అబ్బాయి మిస్సింగ్… ఒక్కో ట్విస్ట్ ఉంటది భయ్యా

పక్కింటి గోలతో కడుపుబ్బా నవ్వించే కామెడీ… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న హిందీ కామెడీ డ్రామా

రియాలిటీ షోస్ నుండి యానిమేషన్ వరకు… జియోహాట్‌స్టార్ లో ఈ వారం సిరీసుల సందడి

రాచరిక ముసుగులో రాజద్రోహం… చాట్ జీపీటీ, నానో బనాన వంటి ఏఐలతో తీసిన సిరీస్

అందమైన అమ్మాయిలతో ట్రాప్ చేయించి ఇదేం పాడు పని… అనుమానంతో అరాచకం

పెళ్లి కాకుండానే పేరెంట్స్… వియ్యంకుల మధ్య మొదలైన వింత బంధం… ఫీల్ గుడ్ కొరియన్ సిరీస్ తెలుగులో

భూతాలు లేవు, దెయ్యాలు లేవు… అయినా గుండెల్లో రైళ్లు పరిగెత్తించే హారర్ థ్రిల్లర్… 7.9 రేటింగ్

Big Stories

Advertisement
×