E-Paper
Advertisement

రష్యాలో ఇండియన్ ఏజెంట్స్ సీక్రెట్ ఆపరేషన్‌… ఓటీటీలోకి వచ్చేసిన తమిళ స్పై యాక్షన్ థ్రిల్లర్

రష్యాలో ఇండియన్ ఏజెంట్స్ సీక్రెట్ ఆపరేషన్‌… ఓటీటీలోకి వచ్చేసిన తమిళ స్పై యాక్షన్ థ్రిల్లర్
Advertisement

Spy Action Thriller movie on OTT : ఓటీటీలో కంటెంట్ ఉండాలేగాని భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇప్పుడు తెలుగులో కూడా పర భాషా చిత్రాలు స్ట్రీమింగ్ అవుతుండటంతో మరింత క్రేజీగా వీటిని చూస్తున్నారు. మలయాళ సినిమాల తరువాత ఆ ప్లేస్ తమిళ సినిమాలు ఆక్రమించాయి. ఈ నేపథ్యంలో రీసెంట్ గా ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్ ఓటీటీలో సందడి చేస్తోంది. ఈ మధ్య వచ్చిన స్పై మూవీ ‘ధురంధర్’ ఎలాంటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ధురంధర్ 2 కూడా ఓటీటీలోకి సందడి చేయబోతోంది. ఈ సమయంలో ఓటీటీలోకి ‘మిస్టర్ ఎక్స్’ (Mr. X) తమిళ థ్రిల్లర్ సందడి మొదలైంది. అంతర్జాతీయ స్పై మిషన్ నేపథ్యంలో సాగే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లను రాబట్టింది.

ఎక్కడ చూడచ్చు అంటే

తమిళ నటుడు ఆర్య ప్రధాన పాత్రలో నటించిన ‘మిస్టర్ ఎక్స్’ (Mr. X) ఒక హై ఓల్టేజ్ స్పై యాక్షన్ థ్రిల్లర్. సీనియర్ నటుడు శరత్ కుమార్, మంజు వారియర్, గౌతమ్ కార్తీక్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 17న థియేటర్లలో రిలీజైన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ నెల రోజులు తిరక్కుండానే మే 14 నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. హాలీవుడ్ రేంజ్ లో యాక్షన్ సీక్వెన్స్ లు ఉన్నాయి ఇందులో. అందుకే ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీని చూస్తూ ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

చెన్నై నగరంలో ప్రపంచ దేశాల ప్రతినిధులు పాల్గొనే ప్రతిష్టాత్మక జి20 (G20) సదస్సు ఏర్పాట్లు జరుగుతుంటాయి. సరిగ్గా అదే సమయంలో అమరన్ చక్రవర్తి (గౌతమ్ కార్తీక్) అనే ఒక మాజీ ఏజెంట్ దేశానికి ద్రోహం చేసి, అత్యంత ప్రమాదకరమైన అణు పరికరాన్ని దొంగిలిస్తాడు. ఆ అణు బాంబును చెన్నై సదస్సులోనే పేల్చి భారీ వినాశనాన్ని సృష్టించాలని వాడు ప్లాన్ చేస్తాడు. ఈ కుట్రను పసిగట్టిన ‘రా’ సంస్థ చీఫ్ ఇందిరా వర్మ (మంజు వారియర్), ఈ ముప్పు నుండి దేశాన్ని కాపాడే బాధ్యతను సమర్థుడైన ఆఫీసర్ గౌతమ్ (ఆర్య)కు అప్పగిస్తుంది. అక్కడి నుండి హీరో గౌతమ్, విలన్ అమరన్ మధ్య నడిచే మైండ్ గేమ్ మొదలవుతుంది. రష్యా నుండి ఇండియా వరకు సాగే ఈ పోరాటంలో, సమయం తక్కువగా ఉన్నప్పటికీ హీరో చాకచక్యంతో విలన్ ప్లాన్స్‌ను ఎలా తిప్పికొట్టాడు? ప్రాణాలకు తెగించి ఆ అణు బాంబును ఎలా స్వాధీనం చేసుకుని చెన్నై నగరాన్ని, దేశాన్ని కాపాడాడు? అనేదే ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా కథ.

Read Also : హత్య చూసిన తర్వాత ఊపిరి బిగబట్టే ఉత్కంఠ… ఊహించని మలుపులతో వణుకు పుట్టిస్తున్న మూవీ

Related News

ఓటీటీలోకి రవితేజ బ్లాక్ బస్టర్ ‘ఇరుముడి’.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

మానవులకు, సైబోర్గ్స్‌కి మధ్య బ్లడీ బ్లడ్ బాత్… భవిష్యత్ ప్రపంచంలో మైండ్ బ్లోయింగ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

గ్రహశకలం ఢీకొట్టడంతో తెలియని గ్రహంపై క్రాష్ ల్యాండ్… డ్రాగన్లు, రాక్షస డైనోసార్లతో ఊపిరి పీల్చుకోనివ్వని పోరాటం

అరేబియన్ నైట్స్ ఫాంటసీకి భయపెట్టే ట్విస్ట్… ఎపిక్ హర్రర్ సిరీస్ స్ట్రీమింగ్ తెలుగులోనే

ట్రిప్ పేరుతో ఇదేం ట్విస్ట్… కార్పొరేట్ ఆఫీస్ పాలిటిక్స్ కల్చర్‌ను ఎండగట్టిన సినిమా

పెళ్లి ఒకరితో ప్రేమ మరొకరితో… హృదయాన్ని హత్తుకునే కొరియన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ

అవయవాల అక్రమ రవాణా కుట్రను ఛేదించే ఆత్మ… మెంటలెక్కించే మెడికల్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ సిరీస్

అమాయకపు బొమ్మ రక్తాన్ని తాగే రాక్షసిగా మారితే… తెలుగులోనే ఈ హడలెత్తించే డార్క్ డెమోనిక్ హర్రర్ ఫిల్మ్

Big Stories

Advertisement
×