E-Paper
Advertisement

భార్య మరొకరితో… కూతురు ప్లే బాయ్ తో… క్లైమాక్స్ క్రేజీగా

భార్య మరొకరితో… కూతురు ప్లే బాయ్ తో… క్లైమాక్స్ క్రేజీగా
Advertisement

Romantic Comedy OTT : ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్ ను చూడాలనుకుంటే, ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను చూసేయండి. మైండ్ రీఫ్రెష్ కూడా అయిపోతుంది ఈ సినిమాను చూస్తే. కామెడీ అలా ఉంటుంది మరి ఇందులో. ఈ హాలీవుడ్ మూవీ సూపర్ డూపర్ హిట్ కూడా అయింది. పద్దతిగా ఒక ఫ్యామిలీని చూసుకొనే హీరోకి, భార్యతో పాటు కూతురు కూడా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని షాక్ ఇస్తారు. దీంతో స్టోరీ కామెడీ మలుపులు తీసుకుంటూ, చివరి వరకు సరదాగా సాగిపోతుంది.

ఎక్కడ చూడచ్చు అంటే

2011లో సూపర్ హిట్ అయిన ఈ అమెరికన్ రొమాంటిక్ కామెడీ సినిమా పేరు ‘క్రేజీ, స్టుపిడ్, లవ్’ (Crazy, Stupid, Love). ఇందులో స్టీవ్ కారెల్, ర్యాన్ గోస్లింగ్, జూలియన్ మూర్, ఎమ్మా స్టోన్ ప్రధాన పాత్రల్లో నటించారు. కేవలం 50 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా, బాక్సాఫీస్ దగ్గర దాదాపు 145 మిలియన్ డాలర్లు (సుమారు 1200 కోట్లు) వసూలు చేసి పెద్ద హిట్ అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా JioHotstar సబ్‌స్క్రిప్షన్ ఉంటే నేరుగా చూడవచ్చు. Amazon Prime Videoలో ఈ సినిమా రెంట్ కి తీసుకోవచ్చు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

హీరో కాల్ వీవర్ (స్టీవ్ కారెల్) ఒక పద్ధతైన ఫ్యామిలీ మేన్. పెళ్లయిన పాతికేళ్ల తర్వాత, ఒకరోజు డిన్నర్ టేబుల్ దగ్గర అతని భార్య సడన్‌గా నాకు విడాకులు కావాలి, ఆఫీసులో వేరే అతనితో నాకు ఎఫైర్ ఉందని బాంబు పేలుస్తుంది. దాంతో మనోడి గుండె పగిలిపోయి, దిక్కుతోచక బార్ల వెంట తిరుగుతూ, తన గోడును అందరికీ చెప్పుకుంటూ ఏడుస్తుంటాడు. అక్కడ అతనికి జాకబ్ (ర్యాన్ గోస్లింగ్) అనే యువకుడు పరిచయమవుతాడు. జాకబ్ చాలా స్టైలిష్‌గా ఉంటూ అమ్మాయిలను ఇట్టే పడేస్తుంటాడు. క్లారిటీగా చెప్పాలంటే అతనొక ప్లే బాయ్. కాల్ పరిస్థితి చూసి జాలిపడి, అతనికి డ్రెస్సింగ్ స్టైల్ మార్చుకోవడం, స్టైలిష్ గా మాట్లాడటం వంటివి నేర్పిస్తాడు.

ఇక జాకబ్ ట్రైనింగ్ తో కాల్ కొత్త వాళ్ళతో డేటింగ్ చేయడం మొదలుపెట్టి జీవితాన్ని కొత్తగా ఆస్వాదిస్తాడు. అదే సమయంలో కాల్ కూతురైన హన్నాతో జాకబ్ నిజమైన ప్రేమలో పడతాడు. మరోవైపు కాల్ ఎన్ని చేసినా తన భార్యను మర్చిపోలేకపోతాడు. ఇక క్లైమాక్స్‌లో అందరూ ఒకే చోట కలిసినప్పుడు వచ్చే గొడవలు, ఫైట్లు, కామెడీ మామూలుగా ఉండవు. చివరకు తండ్రి, కూతురు, జాకబ్ అందరూ కలిసి ఈ చిక్కుముడులను ఎలా సెట్ చేసుకున్నారనేదే ఈ సినిమా.

Advertisement

Read Also : పిచ్చోడు అనుకున్నారు.. కానీ ప్రపంచాన్నే గెలిచాడు… క్లైమాక్స్ వరకు చూపు కూడా తిప్పలేరు

Tags

Related News

పెళ్ళయిన వ్యక్తితో రిలేషన్ లో… మెదడును కదిలించే క్లైమాక్స్

లవర్ కు మతిమరుపు వస్తే… కన్నీళ్ళు పెట్టించే తెలుగు రొమాంటిక్ డ్రామా

గర్ల్ ఫ్రెండ్ కోసం కుక్కను తెచ్చి కొత్త చిక్కుల్లో… డాగ్ లవర్స్ డోంట్ మిస్

ఒకరి తర్వాత ఒకరు సైకోలుగా మారి హత్యలు చేసే పేరున్న వ్యక్తులు… మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు

యాక్సిడెంట్, కట్ చేస్తే ప్రేమించిన అమ్మాయి భార్యగా… మెంటలెక్కించే తమిళ సై-ఫై రొమాంటిక్ థ్రిల్లర్

ఏం సిరీస్ గురూ… మనుషుల్ని చంపి పచ్చి మాంసం నోట్లో కుక్కే కిల్లర్

50 రోజులు అందమైన అమ్మాయితో గదిలో కాలు బయట పెట్టకుండా… ఒక్కసారి చూస్తే లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మూవీ

ఏడుగురు ఆవారాగాళ్ల కథ… షార్ట్ కట్ లో కోటీశ్వరులు అవ్వాలనుకునే కామెడీ డ్రామా

Big Stories

Advertisement
×