E-Paper
Advertisement

జర్నలిస్ట్ హత్య కేసులో దుమ్ములేపే ఇన్వెస్టిగేషన్… క్లైమాక్స్ వరకు టెన్షన్ పెట్టించే రియల్ క్రైమ్ సిరీస్

జర్నలిస్ట్ హత్య కేసులో దుమ్ములేపే ఇన్వెస్టిగేషన్… క్లైమాక్స్ వరకు టెన్షన్ పెట్టించే రియల్ క్రైమ్ సిరీస్
Advertisement

Crime Investigation Series on OTT : ఓటీటీలో ఒక రియల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఒక అమ్మాయి మర్డర్ కేసును పోలీసులు ఎంత ఓపికగా, నిజాయితీగా ఛేదించారనేది చూపించే పక్కా రియలిస్టిక్ ఇన్వెస్టిగేషన్ సిరీస్ ఇది. దీని స్పెషాలిటీ ఏంటంటే, కథలో అసలు హంతకుడి మొహం చూపించరు, అతని పేరు కూడా ఎక్కడా వాడరు. ఎందుకంటే సైకో గాళ్లకు అనవసర పబ్లిసిటీ ఇవ్వకూడదని డైరెక్టర్ అలా ప్లాన్ చేశాడు. సముద్రంలో ముక్కలు చేసిన అమ్మాయి పార్ట్శ్ ను వెతకడానికి పోలీసులు, నేవీ డైవర్లు పడిన కష్టాన్ని, కూతుర్ని కోల్పోయిన తల్లిదండ్రుల బాధను మాత్రమే చాలా ఎమోషనల్‌గా చూపించారు ఇందులో.

ఎక్కడ చూడచ్చు అంటే

2020లో వచ్చిన ఈ సూపర్ హిట్ డానిష్ క్రైమ్ డ్రామా మినీ సిరీస్ పేరు ‘ది ఇన్వెస్టిగేషన్’ (The Investigation). 2017లో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన స్వీడిష్ జర్నలిస్ట్ “కిమ్ వాల్” హత్య కేసు ఆధారంగా దర్శకుడు టోబియాస్ లిండ్‌హోమ్ దీనిని 6 ఎపిసోడ్స్ గా రూపొందించారు. ఇందులో చూపించిన చాలా అంశాలు వంద శాతం నిజం. సాధారణంగా సినిమాల్లో సముద్రం లోపల జరిగే సీన్ల కోసం గ్రాఫిక్స్ వాడుతుంటారు, కానీ ఈ దర్శకుడు మాత్రం అస్సలు రాజీ పడకుండా నిజమైన కెమెరాలతో, ఒరిజినల్ సముద్రంలోనే షూటింగ్ జరిపారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే… నిజ జీవితంలో ఆ కేసును చేధించడానికి పోలీసులు ఏ స్నిఫర్ కుక్కలనైతే వాడారో, సముద్రంలో శవాన్ని వెతకడానికి ఏ డైవర్లయితే ప్రాణాలకు తెగించారో, వాళ్లందరినీ ఈ సిరీస్‌లో కూడా పెట్టి నిజమైన పాత్రల్లోనే యాక్ట్ చేయించారు. అందువల్లే ఈ సిరీస్ చూస్తున్నంత సేపు ఒక సినిమా చూస్తున్నట్లు కాకుండా, మన కళ్ల ముందే నిజంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఈ డానిష్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. బ్రిటన్‌కు చెందిన బిబిసి (BBC), అమెరికాకు చెందిన హెచ్‌బిఓ (HBO) లాంటి టాప్ నెట్‌వర్క్స్ ఈ సిరీస్ రైట్స్ కొనుగోలు చేసి ప్రసారం చేశాయంటే దీని రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇది prime videoలో కూడా అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే 

Advertisement

2017లో ఒక క్రేజీ సైంటిస్ట్ సొంతంగా ఓ సబ్‌మెరైన్ తయారు చేస్తాడు. అందులోకి ఇంటర్వ్యూ కోసం వచ్చిన కిమ్ వాల్ అనే మహిళా జర్నలిస్ట్‌ను నడిసముద్రంలో దారుణంగా చంపేస్తాడు. ఆ తర్వాత ఆధారాలు దొరకకుండా శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికేసి సముద్రంలో పారేస్తాడు. సబ్‌మెరైన్ మునిగిపోయిందని, ఆమెను ముందే ఒడ్డున దించేశానని ఆ సైంటిస్ట్ తప్పుడు కథలు చెప్తాడు. కోపెన్‌హాగన్ పోలీస్ హెడ్ జెన్స్ మోల్లర్ ఈ కేసును చేతుల్లోకి తీసుకుని, అతను చెప్తున్నవన్నీ పచ్చి అబద్ధాలని కనిపెడతాడు. అయితే కోర్టులో అతనికి శిక్ష పడాలంటే ఖచ్చితమైన ఆధారాలు, చనిపోయిన అమ్మాయి శవం కావాల్సి వస్తుంది.

ఇక అక్కడి నుండి పోలీసులు, నేవీ డైవర్లు ప్రాణాలకు తెగించి నడిసముద్రంలో గాలించడం మొదలుపెడతారు. ఎలాంటి క్లూస్ లేకపోయినా, సముద్రపు అలల వేగాన్ని లెక్కగడుతూ, స్నిఫర్ కుక్కల సహాయంతో నెలల తరబడి వెతికి అమ్మాయి శరీర భాగాలను ఒక్కొక్కటిగా బయటకు తీస్తారు. ఈ సిరీస్ ప్రత్యేకత ఏంటంటే… ఎక్కడా హంతకుడి ముఖం చూపించకుండా, అనవసరమైన సీన్లు పెట్టకుండా, కేవలం పోలీసులు పట్టుదలగా కేసును ఎలా ఛేదించారు, ఆ తల్లిదండ్రుల బాధ ఎలాంటిది అనే విషయాలను కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది.

Advertisement

Read Also : సమ్మర్ క్యాంప్ లో పిల్లల ప్రాణాలు తీస్తున్న ముసుగు హంతకుడు… ఊపిరి బిగబట్టేలా చేసే హారర్ సినిమా

Related News

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

అడవి నేపథ్యంలో ఊపిరి బిగబట్టించే వేట… రక్తం ఉడికించే మలయాళం సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×