E-Paper
Advertisement

‘ఘోస్ట్ రైడర్’ హీరో నికోలస్ కేజ్ లేటెస్ట్ కాంట్రవర్సీ హారర్ థ్రిల్లర్ ఓటీటీలోకి… ఎక్కడ చూడచ్చు అంటే?

‘ఘోస్ట్ రైడర్’ హీరో నికోలస్ కేజ్ లేటెస్ట్ కాంట్రవర్సీ హారర్ థ్రిల్లర్ ఓటీటీలోకి… ఎక్కడ చూడచ్చు అంటే?
Advertisement

Horror Thriller OTT :’ఘోస్ట్ రైడర్’, ‘ఫేస్ ఆఫ్’ వంటి సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు హాలీవుడ్ హీరో నికోలస్ కేజ్. ఈయన సినిమా అంటేనే ఒక విషయం ఉంటుందని ప్రేక్షకుల నమ్మకం. అలాంటి క్రేజ్ ఉంది ప్రజల్లో అతనికి. అయితే భారీ అంచనాల మధ్య, హారర్ థ్రిల్లర్ ఫాంటసీ ఎలిమెంట్స్‌తో ఈ హీరో నటించిన ఒక సినిమా గత ఏడాది థియేటర్లలోకి వచ్చింది. ఇందులో ఆయన జీసస్ కు పెంపుడు తండ్రి పాత్రలో నటించారు. అయితే ఈ సినిమా అనుకున్నంత సక్సెస్ సాధించలేకపోయింది. ఈ సినిమాలో బైబిల్‌ లోని వివాదాస్పద అంశాలను చూపించారని చాలా వరకు నెగెటివిటీ తెచ్చుకుంది.

జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్

లోట్ఫీ నాథన్ దర్శకత్వం వహించిన ఈ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ది కార్పెంటర్స్ సన్’ (The Carpenter’s Son). ఇందులో హాలీవుడ్ స్టార్ హీరో నికోలస్ కేజ్ ఈ మూవీలో మెయిన్ లీడ్‌లో నటించారు. ఆయనతోపాటు నోవా జుప్, ఎఫ్‌కేఏ ట్విగ్స్, ఐస్లా జాన్‌స్టన్, సౌహీల యాకూబ్, కైతి మనోలిడకి తదితరులు కీలక పాత్రలు పోషించారు. గతేడాది నవంబర్ 14న థియేటర్లలో విడుదల అయింది. ఓటీటీలోకి ఏప్రిల్ 4వచ్చేసింది ఈ మూవీ. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్‌(Jio hotstar)లో ఇంగ్లీష్‌తోపాట తెలుగు, హిందీ, తమిళం భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

నికోలస్ కేజ్ నటించిన ఈ కొత్త సినిమా కథ యేసుక్రీస్తు బాల్యం చుట్టూ తిరుగుతుంది. బైబిల్‌లో లేని కొన్ని పాత కథల ఆధారంగా దీనిని ఒక ‘హారర్ థ్రిల్లర్’గా తీశారు. ఇందులో యేసు ఒక మామూలు వడ్రంగి కొడుకుగా తన కుటుంబంతో కలిసి ఈజిప్టులో నివసిస్తుంటాడు. అయితే తనకు తెలియకుండానే అతనిలో ఉన్న అద్భుత శక్తులు ఒక్కొక్కటిగా బయటపడటం మొదలవుతాయి. ఈ శక్తుల వల్ల తన చుట్టూ ఉన్న వారికి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని ఆయన కుటుంబం భయపడుతూ ఉంటుంది. రెండో భాగంలో, ఆ శక్తుల వల్ల అతనిపై ఒక దుష్టశక్తి కన్నేస్తుంది. ఆ శక్తి యేసును తప్పుదారి పట్టించడానికి, అతన్ని భయపెట్టడానికి ప్రయత్నిస్తుంది. తనలో ఉన్న దైవిక శక్తికి, ఎదురవుతున్న ఆ చీకటి శక్తులకు మధ్య జరిగే పోరాటమే ఈ కథ. ఈ సినిమాలో నికోలస్ కేజ్ ఒక నిరుపేద వడ్రంగి పాత్రలో నటించారు. తన కుమారుడిలో ఉన్న అద్భుత శక్తులు బయటపడటం చూసి, ఆ శక్తుల వల్ల ఎదురయ్యే ప్రమాదాల నుండి కొడుకును ఎలా కాపాడుకోవాలనే ఒక తండ్రి పాత్రలో ఆయన కనిపిస్తారు.

Read Also : నిద్రలేని రాత్రులు మిగిల్చే అత్యంత భయంకరమైన హారర్… చూస్తే చలి జ్వరం గ్యారంటీ

Related News

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

Big Stories

Advertisement
×