E-Paper
Advertisement

కాళేశ్వరం బ్యారేజీలకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు చేయండి.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

కాళేశ్వరం బ్యారేజీలకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు చేయండి.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
Advertisement

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రానికి అత్యంత కీలకమైన కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజీలకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు పూర్తి చేసి, వాటిని వినియోగంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ప్రాజెక్టు భవిష్యత్తు, పునరుద్ధరణ పనులపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు.

నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) సూచనలను తూచా తప్పకుండా పాటించాలని, వర్షాకాలం ప్రారంభానికి ముందే పనులు ఒక కొలిక్కి రావాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మరమ్మత్తుల కోసం ఒక ప్రత్యేక కార్యాచరణను రూపొందించి, నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పనుల్లో జాప్యాన్ని ఏమాత్రం సహించబోమని, నిర్మాణ సంస్థలు, ఏజెన్సీలను అప్రమత్తం చేసి వేగం పెంచాలని సూచించారు. నిధుల విషయంలో ఎటువంటి ఇబ్బంది కలగనివ్వబోమని సీఎం ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.

Advertisement

సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (CWPRS) ఆధ్వర్యంలో జరుగుతున్న పరీక్షలు, నమూనాల సేకరణను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. ఈ ప్రక్రియలో నీటిపారుదల శాఖ, నిర్మాణ సంస్థలు, డిజైన్ కన్సల్టెంట్లతో కలిపి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని, ప్రతి పనిలో సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) సభ్యులు ఉండేలా చూడాలని సూచించారు. కేవలం మేడిగడ్డలో కుంగిపోయిన పిల్లర్లనే కాకుండా, మొత్తం 1.6 కిలోమీటర్ల మేర బ్యారేజీని సమగ్రంగా అధ్యయనం చేయాలని ఇంజనీర్లకు స్పష్టం చేశారు.

మేడిగడ్డ బ్యారేజీ పునాదుల పటిష్టతను పరిశీలించేందుకు 500 బోరు బావులను తవ్వాల్సి ఉందని ఇంజనీర్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనికోసం ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని, అవసరమైన యంత్రాలను వెంటనే సమకూర్చుకోవాలని సీఎం ఆదేశించారు. డిసెంబరు వరకు చేపట్టాల్సిన పనులపై స్పష్టమైన షెడ్యూల్ సిద్ధం చేయాలని కోరారు. పనుల పర్యవేక్షణ కోసం మేడిగడ్డ వద్దే బేస్ క్యాంపు ఏర్పాటు చేయాలని, పనులు ప్రారంభమయ్యాక తాను స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి పనులను పరిశీలిస్తానని ముఖ్యమంత్రి తెలిపారు.

Advertisement

ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇరిగేషన్ సెక్రటరీ శ్రీధర్, సీఎం కార్యదర్శి మానిక్ రాజ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొని ప్రాజెక్టు సాంకేతిక అంశాలపై నివేదికలను సమర్పించారు.

Read Also: స్పీకర్ వద్దు.. మంత్రి పదవి ముద్దు అంటున్న గడ్డం ప్రసాద్ కుమార్..!

Related News

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Big Stories

Advertisement
×