Crime Thriller: డ్యూటీలో ఉన్నప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ తీసుకునే చిన్న డిసిషన్ కొన్నిసార్లు అతని లైఫ్ లో ఊహించని ట్విస్ట్ ఇవ్వవచ్చు. ముఖ్యంగా మనం సేవ్ చేయాలనుకున్న ఒక పర్సన్ వల్ల పెద్ద నేషనల్ కాన్స్పిరసీలో ఇరుక్కుంటే, ఆ తర్వాత జరిగే పరిణామాలు ఊహకందవు. హెల్ప్ చేయాలనే ఆలోచన మంచిదే. కానీ దానివల్ల వచ్చే ఇబ్బందులు తలనొప్పిగా మారితేనే కష్టం. రోడ్డు మీద ఒక గాయపడిన అమ్మాయికి హెల్ప్ చేయాలని డిసైడ్ అయిన పోలీస్, ఉన్నతాధికారులు, సిస్టమ్ లో నడుస్తున్న పవర్ ఫుల్ పాలిటిక్స్ మధ్య ఎలా నలిగిపోయాడనేదే ఈ ‘గజబ్ రాత్’ (Gajab Raat) మూవీ మెయిన్ ప్లాట్. కేవలం ఒక్క రాత్రిలో జరిగే ఈ క్రైమ్ థ్రిల్లర్ ఆడియన్స్ కు గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. మరి ఈ థ్రిల్లర్ మూవీని ఎక్కడ చూడవచ్చు ? ఏ ఓటీటీలో ఎప్పుడు అందుబాటులోకి వచ్చింది ? అనే వివరాల్లోకి వెళ్తే…
ఈ స్టోరీలో హీరో ఒక రొటీన్ నైట్ పెట్రోలింగ్ డ్యూటీలో ఉంటాడు. ఆ సమయంలో అనుకోకుండా ఒక అమ్మాయి తీవ్రంగా గాయపడి కనిపించడంతో ఆమెను కాపాడటానికి ముందుకు వస్తాడు. ఫస్ట్ చూస్తే ఇదొక సింపుల్ హ్యుమానిటేరియన్ కేస్ లాగే అనిపిస్తుంది. కానీ ఆ తర్వాతే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. ఆ అమ్మాయికి హెల్ప్ చేయడం వల్ల హీరో ఒక బిగ్ క్రైమ్ సర్కిల్ లో లాక్ అయిపోతాడు.
ఆ సిట్యుయేషన్ కేవలం లోకల్ ఇష్యూ కాకుండా, స్టేట్ అండ్ నేషనల్ లెవెల్ పీపుల్ ఇన్వాల్వ్ అయిన డేంజరస్ కాన్స్పిరసీ అని అతనికి చాలా లేట్ గా అర్థమవుతుంది. సిస్టమ్ లోని కరప్ట్ ఆఫీసర్స్ తమ తప్పులు బయట పడకుండా ఉండేందుకు హీరోను అడ్డుకోవాలని చూస్తారు. ఒకవైపు తన జాబ్ అండ్ లైఫ్ సేవ్ చేసుకోవడం, మరోవైపు నిజం ఏంటో బయట పెట్టడం పోలీస్ కు కత్తి మీద సాములా మారుతుంది.
నైట్ టైమ్ లో జరిగే ఈ ఛేజింగ్‌లు, ఎవ్వరిని నమ్మాలో తెలియని సస్పెన్స్, ఎటు చూసినా డేంజర్ ఉండే వాతావరణం సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తాయి. హీరో నిజం కోసం చేసే ప్రయత్నంలో ప్రతీ స్టెప్ చాలా రిస్కీగా మారుతుంది. మరి ఇంతకీ హీరోకి హెల్ప్ చేయడం వల్ల వచ్చిన సమస్యలు ఏంటి ? వాటి నుంచి ఎలా బయట పడ్డాడు ? ఇందులో ఉన్న డేంజర్ ఏంటి ? చివరికి ఏమైంది ? అన్నది సినిమాలో చూడాల్సిందే.
‘గజబ్ రాత్’ సినిమా నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మేకర్స్ దీనికి సంబంధించిన తెలుగు డబ్బింగ్ ఆడియోను కూడా అఫీషియల్ గా అందించారు. సో, తెలుగు ఆడియన్స్ ఎలాంటి లాంగ్వేజ్ బ్యారియర్ లేకుండా ఈ క్రైమ్ థ్రిల్లర్ ను హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. మనోజ్ బాజ్‌పేయి, దివ్య దత్తా, అక్షయ్ ఒబెరాయ్, సాకిబ్ సలీమ్, నుష్రత్ భరుచా వంటి టాలెంటెడ్ ఆర్టిస్టులు నటించడం వల్ల ఈ థ్రిల్లర్ మరింత ఇంటెన్స్ గా అనిపిస్తుంది. నీరజ్ పాండే మేకింగ్, రితేశ్ షా డైరెక్షన్ ఈ క్రైమ్ డ్రామాకు బిగ్ ప్లస్. కాబట్టి క్రైమ్ థ్రిల్లర్ మూవీ లవర్స్ మస్ట్ వాచ్.
Read Also: పోలీసులు జైల్లోనే కొట్టి చంపేస్తే… సీజన్ 2తో వచ్చేసిన క్రేజీ క్రైమ్ థ్రిల్లర్